.
రాబోయే కాలంలో యుద్దాలు నేల మీద కాదు… గగనంలో, గగనం నుంచి… అంతకుమించి అంతరిక్షంలో…!
నిజమే… స్టార్ వార్స్ తరహాలో ఒక దేశపు ఉపగ్రహాలను మరోదేశం కూల్చేయడం… ప్రస్తుతం శాటిలైట్ల మీద ఆధారపడి సాగుతోంది కదా ప్రపంచం… కమ్యూనికేషన్ల నుంచి నిఘా దాకా… సో, ఉపగ్రహాల్ని కూల్చేయడం అంటే ఓ దేశం వెన్నువిరవడం…
మన దేశం ఈ ప్రమాదాన్ని ఎప్పుడో అంచనా వేసింది… ఇటు చైనా, అటు పాకిస్థాన్… పాకిస్థాన్ కొమ్ముకాసే అమెరికన్ ట్రంపర్లు సరేసరి… అందుకని అంతరిక్షంలో శాటిలైట్లను ధ్వంసం చేసే పరిజ్ఙానాన్ని మనం ఎప్పుడో సాధించేశాం…
Ads
దాడిచేయగలం సరే, కానీ మన శాటిలైట్లకు రక్షణ మాటేమిటి..? సరిహద్దులకు అవతల నుంచి వచ్చే యుద్ధవిమానాలు, డ్రోన్లను ఎప్పటికప్పుడు కూల్చేసే ఎస్-400 ఉంది… ఎస్-500 కూడా డెవలప్ అవుతోంది… అంతేకాదు…
మనకు రక్షణగా ఓ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్ ఉంది… ఈ వ్యవస్థలో దీర్ఘ, మధ్య, స్వల్ప శ్రేణులలో పనిచేసే అనేక క్షిపణి వ్యవస్థలు, రాడార్లు, అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి.., వీటిలో స్వదేశీ ఆకాశ్, QRSAM క్షిపణులు, SPYDER వ్యవస్థలు కూడా ఉంటాయి…
మరి అంతరిక్ష సమరంలో మనకు డిఫెన్స్ ఎలా..? మనకు కత్తి ఉంది, కానీ కవచం..? అదుగో ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే మరో ప్రాజెక్టు… “సాటిలైట్ బాడీగార్డ్స్”… ఇస్రో (ISRO) ఈ రక్షణ వ్యవస్థను సిద్ధం చేస్తోంది… ఇది రష్యా, ఫ్రాన్స్ లేదా ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకునేది కాదు… పూర్తిగా దేశీయ సాంకేతికతతోనే ఇస్రో అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది…
2024లో ఒక శత్రు దేశపు ఉపగ్రహం, ఇస్రో సైనిక మిషన్ నిర్వహిస్తున్న ఉపగ్రహానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోకి చేరింది… ఆ ఉపగ్రహం భూ పటాల తయారీ, గ్రౌండ్ మానిటరింగ్ వంటి కీలక పనులు చేస్తోంది… చివరికి ఏ ప్రమాదం జరగకపోయినా, ఆ సంఘటన భారత్‌లో అలర్ట్ బెల్స్ మోగించింది…
ప్రస్తుతం భారత్ వద్ద ఉపగ్రహాలు 100 మాత్రమే ఉండగా, చైనాకు 900కిపైగా ఉన్నాయి… పాకిస్థాన్ వద్ద ఉన్న 8 ఉపగ్రహాలకు కూడా చైనా మద్దతు ఇస్తోంది… 2025 మేలో భారత్- పాక్ ఘర్షణ సమయంలో, చైనా పాకిస్థాన్‌కు ఉపగ్రహ డేటా సాయం చేసినట్టు వార్తలు వచ్చాయి… దీనితో అంతరిక్షంలో వ్యూహాత్మక పోటీ ఎంత కీలకమైందో స్పష్టమైంది…
శాటిలైట్ బాడీగార్డ్స్ అనే ఈ భారీ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం సుమారు ₹27,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది… మొత్తం 50 ఉపగ్రహాలను “శాటిలైట్ బాడీగార్డ్స్”గా ప్రయోగించనున్నారు… వీటిలో తొలి ఉపగ్రహం వచ్చే ఏడాదికే కక్ష్యలోకి వెళ్ళే అవకాశం ఉంది…
ఇస్రో లిడార్ (Light Detection and Ranging) ఉపగ్రహాలను కూడా ప్రయోగించనుంది… ఇవి కక్ష్యలో ఉండే ముప్పులను రియల్ టైమ్‌లో గుర్తించి, భూమిపై ఉన్న శాస్త్రవేత్తలకు వెంటనే సమాచారం అందిస్తాయి… అంతరిక్ష రక్షణలో భాగంగా, భూమిపై రాడార్‌లు, టెలిస్కోప్ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేయనున్నారు… దీని వలన ఉపగ్రహాలపై 24 గంటల పహారా సాధ్యం అవుతుంది… ఇదీ ఇస్రో కొత్త ప్రాజెక్టు కథ..!!
Share this Article