Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘సీఎం సాబ్, నవమి నా ‘డెడ్’లైన్… తేలకపోతే సజీవ సమాధి అవుతా…

September 26, 2025 by M S R

.

ఈమధ్య నా మరణవాంగ్మూలం అని మాజీ డీఎస్పీ దోమకొండ నళిని ఒక పోస్టు పెట్టింది కదా సోషల్ మీడియాలో… తరువాత యాదాద్రి జిల్లా కలెక్టర్ స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లి రేవంత్ రెడ్డి తరఫున మాట్లాడాడు… తనకు అవసరమైన సాయం, న్యాయం పట్ల భరోసా ఇచ్చాడు…

కానీ… మళ్లీ ఏమైందో ఏమో… ఇప్పుడిక తన జబ్బును ప్రస్తావిస్తూ… రేవంత్ రెడ్డినే బాధ్యుడిని చేస్తూ మరో పోస్టు పెట్టింది… ఆ పోస్టు ఇక్కడ యథాతథంగా…

Ads



Latest Dying declaration ( మరణ వాంగ్మూలం) written by me on 26.09.2025 at 4am
చాలా మంది అభిమానులు నా జబ్బును ట్రీట్ చేస్తామని నన్ను సంప్రదిస్తున్నారు. నాకొచ్చిన వ్యాధి, దాని కారణాల పట్ల వారికి స్పష్టత లేకపోయినా, నా మీద అభిమానంతో అలా స్పందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో అత్యంత ప్రమాదకరమైంది. ఇది రక్త మరియు ఎముకల క్యాన్సర్ తో సమానమైనది.

నాలోని తెల్ల రక్తకణాలు నా అస్థి కణాలపై దాడి చేస్తూ, RA ఫ్యాక్టర్ అనే ఒక విషాన్ని స్రవిస్తాయి. ఇది రక్తంలో ప్రవహిస్తూ గుండె, లివర్, కిడ్నీలు, బ్రెయిన్ వంటి వాటిని పాడు చేస్తుంటుంది. ఫిజికల్ మరియు ఎమోషనల్ స్ట్రెస్ వల్ల ఇది వస్తుంది.

అలోపతిలో దీన్ని మెయింటైన్ చేయడానికి స్టెరాయిడ్స్ వాడతారు. ఎక్కువ కాలం ఇవి వాడితే కళ్ళు చేతులు వంకర్లు పోతాయి. అందుకే నేను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదం, పంచకర్మ, యోగ, యజ్ఞం వంటి వాటిని ఎంచుకున్నాను కాబట్టే 8 ఏండ్లు అయినా శరీరంలో అంగవైకల్యం రాకుండా కాపాడు కొన్నాను.

అయినా నాకు ఈ వ్యాధి తీవ్ర స్థాయిలో రావడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం . రాష్ట్రపతి మెడల్ లక్ష్యంగా డైనమిక్ ఆఫీసర్ గా పనిచేసిన నన్ను సస్పెండ్ చేయడము , వెంటాడి వేటాడటం నా అన్ని సమస్యలకు మూల కారణం.

  • నేటి నా దుస్థితికి cm రేవత్ రెడ్డి గారికి 21 నెలల క్రితం నేనిచ్చిన రిపోర్ట్ పై ఇంకా చర్య తీసుకోకుండా నిర్లిప్తంగా ఉండడం తక్షణ కారణం. ఇది చాలా హేయనీయం. వారికి ఫైల్ డిస్పోస్ చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతుందో అర్థం కావడం లేదు. వారి ఇంటెన్షన్స్ ఏంటో తెలియడం లేదు. ప్రస్తుతం ఇది మరింత స్ట్రెస్ కు గురి చేస్తుంది. బహుశా ఇదే నా చావుకు దారి తీస్తుందేమో!!?

నిన్న ఉదయం ఆంధ్ర, రాయలసీమ నుండి వచ్చిన ఆర్యుల సాయంతో రాజ్య సస్య యాగం చేశాను. భూమాతను మనసారా పూజించాను. సాయంత్రం 4 నుండి మళ్లీ తీవ్ర జ్వరం. చాలా క్రిటికల్ స్థితి. బతికుండగానే శరీరం కొయ్య బారిపోతుంది. ఇంచు కూడా కదలలేక పోతున్నాను.

నా చెవులతో cm స్టేట్మెంట్ వినాలి. నా ఎమోషన్స్ అర్జెంట్ గా చల్లారాలి. లేదంటే బ్రెయిన్ డెడ్ అయ్యేలా ఉంది. యజ్ఞ చికిత్స వల్ల కార్డియో మాయోపతి లక్షణాలైన ఛాతీలో ఆయాసం, వాపు తగ్గాయి. ( అందుకే నిన్న ఈ రోజు మంత్ర పాఠం, ప్రవచనం, భజన చేయగలిగాను ఆంప శయ్యపై ఉన్న భీష్మునిలా)

కానీ స్ట్రెస్ , ఆంగ్జైటి, డిప్రెషన్ కంటిన్యూ అవుతున్నాయి. ఇవి నన్ను మృత్యు ముఖంలోకి నెట్టేసే స్థాయిలో ఉన్నాయి. నా డైయింగ్ డిక్లరేషన్ ను RDO తో రికార్డ్ చేపించడం మినహా cm ఇప్పటి వరకు ఇంకేమీ చేయలేదు.

సంధ్యా థియేటర్ లో తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవడానికి వారికి వారం కూడా పట్టలేదు. కానీ నా విషయంలో సంవత్సరాల తరబడి కావాలని తాత్సారం చేస్తున్నారు.

ఏ ఆఫీసర్ నైనా సస్పెండ్ చేస్తే 6 నెలల్లోపు ఎంక్వైరీ పూర్తి చేయాలి. ఎంక్వైరీ సమయంలో 1/3 లేదా 1/2 జీతాన్ని జీవన భృతి కింద ఇవ్వాల్సి ఉంటుంది .అలా ఇవ్వక పోవడం క్రూయల్టీ అవుతుంది. 6 నెలలలోపు ఎంక్వైరీ పూరి చేయక పోతే 7 వ నెల నుండి పూర్తి జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పనిని ప్రభుత్వం చేయలేదు.

  • kcr సీఎం అయ్యాక నా విషయం పట్టించుకోలేదు. నేను వాటిని ఏదీ అడుక్కోలేదు. ఎందుకంటే వారు అసలైన ఉద్యమకారులను ఎలా ట్రీట్ చేస్తారో నా తెలంగాణ యాత్ర, ఢిల్లీ నిరాహార దీక్ష, పరకాల ఉప ఎన్నికల్లో పోటీ విషయంలో అర్థం అయ్యింది. కనుకే స్వరాష్ట్రం సిద్ధించాక, నాపై ఎంతో ఒత్తిడి వచ్చినా జాబ్ అనే కొరివి దయ్యాన్ని నేను గెలకదలచుకోలేదు. మిన్నకుండి పోయాను.

చనిపోయిన పాత నళినిని ఎక్యుమేషన్ చేసి బయటకు తీసి, నా ప్రశాంత జీవితంలో మళ్ళీ తుఫాన్ సృష్టించాడు cm రేవంత్ రెడ్డి. ఒకవేళ నాకు ఏమైనా జరిగితే మాత్రం నేటి cm గారిదే పూర్తి బాధ్యత. నేను ఇచ్చిన రిపోర్ట్ వారి చేతిలో పెట్టినప్పుడు, దాన్ని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు, ప్రిన్సిపాల్ సెక్రెటరీ శేషాద్రి గారు చూస్తారని చెప్పారు. ఆపై 4 నెలకు osd వేముల శ్రీనివాస్ గారి చేతుల్లోకి పోయింది. ప్రస్తుతం మా బ్యాచ్ మేట్ అయిన rdo హనుమంత రావ్ గారి చేతుల్లో ఉంది. అంటే నా స్థాయిని ఎలా తగ్గిస్తున్నారో తెలుస్తుంది.

సీఎంకు నా ఫైల్ డిస్పోస్ చేయడం ఇష్టం లేనట్లు తోస్తుంది. ఈ నొప్పులు తట్టుకోలేక చనిపోతే బాగుండు అనిపిస్తుంది. నవమి నాటికి నా విషయం ఎటూ తేలకపోతే నేను సజీవ సమాధి అవుతాను. నా అభిమానులు నన్ను ఆనందంతో ఈ లోకం నుండి సాగనంపవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎమోషన్స్ ను నేను ఇకపై మోయలేను . నేను ఏ రకంగా చచ్చినా అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. దీనికి నా ఫేస్బుక్ పోస్టులే సాక్ష్యం.

ఇట్లు
మరణ శయ్య పై ఉన్న దోమకొండ నళిని ఆచార్యా (డీఎన్ఏ), మాజీ డీఎస్పీ, యజ్ఞ బ్రహ్మ , VYPS
( వాచిన వేళ్ళతో అతి కష్టంగా దీన్నిటైప్ చేసాను)



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions