.
(రమణ కొంటికర్ల )
….. బాలీవుడ్ సినీ పుటల్లో శశికపూర్‌ది ఓ ప్రత్యేకమైన పేజీ… శశికపూర్ కేవలం ఓ సూపర్ స్టార్ నటుడిగానే కాదు… వినయం, వినమ్రత, దయ వంటి వాటికిి చిహ్నంగా నిల్చినవాడు… తన స్మైల్ ఒక్కటి చాలు… తన అభిమానులను సమ్మోహనపర్చేందుకు.
తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మిగిలినవారితో పోలిస్తే ఓ ప్రొపెషనల్‌లా ఉండేది. అయితే, వాటన్నింటినీ మించి శశికపూర్‌కు తన వ్యక్తిత్వమే బాలీవుడ్‌లో ఓ ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టింది…
Ads
బాలీవుడ్‌లో కపూర్స్ ఫ్యామిలీ అంటే ఓ రాజవంశంలాంటింది. కానీ, అలాంటి హవా పోకడలకు దూరంగా, బహు సరళంగా జీవించినవాడు. అయితే, ఆయన సరళత ఎంతవరకూ వెళ్లిందంటే తనకో జాతీయ అవార్డ్ వచ్చినా… తిరస్కరించే స్థాయికి వెళ్లింది. అది బాలీవుడ్ పరిశ్రమనే ఆశ్చర్యపర్చింది…
- ఇంతకీ ఏ సినిమాలో ఆయనకు జాతీయ అవార్డ్ వరించింది..? ఆయనెందుకు తిరస్కరించాడు..??
1962లో శశికపూర్ యష్ చోప్రా ధర్మపుత్రతో తన కెరీర్ ప్రారంభించాడు. మత ఛాందసత్వం, నాటి ఇండియా- పాక్ విభజనల ఇతివృత్తంగా ఆ సినిమా తెరకెక్కింది. తన ఉనికేంటో తెలుసుకోలేని ఓ యువకుడిగా శశికపూర్.. తీవ్రవాదం వైపు మళ్లే సంఘర్షాత్మక వైఖరి గల కీలకపాత్రను పోషించాడు. వాస్తవానికి అదో సవాలైన పాత్ర. ఆ పాత్రను అంతే నిజాయితీగా చేశాడు.
ఆ పాత్రకే జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. చాలామంది కొత్తవారికి తమ కెరీర్ ప్రారంభంలో అలాంటి గుర్తింపు రావడం ఓ కల. అది శశికపూర్ విషయంలో నిజమైంది. కానీ, కపూర్ తనకొచ్చిన అవార్డ్ విషయంలో భిన్నంగా స్పందించాడు.
- జాతీయ అవార్డునే తిరస్కరించాడు! కారణమేంటి..?
శశికపూర్ కు జాతీయ అవార్డ్ రావడం దర్శకుడు యష్ చోప్రాతో పాటు.. తన సహచరులకూ సంతోషం కల్గించింది. అయితే, అంతలోనే శశికపూర్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపర్చింది. అలాగని పెద్ద కారణమేం లేదు. తన వివరణ కూడా చాలా సరళమైంది.
తను కూడా తన నటనకు అంత గొప్ప గౌరవం దక్కుతుందని ఊహించలేకపోయాడు. కానీ, తన నటన జాతీయ అవార్డ్ సాధించేంత గొప్పది కాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయం. అలా తన మనసుకు నచ్చని పని చేయని శశి.. ఆ అవార్డును తిరస్కరించాడు.
ఓసారి ఓ ఇంటర్వూలో ఆయనే చెప్పుకొచ్చారు. ముఝే నేషనల్ అవార్డ్ కేలియా ఛునాగయాథా. లేకిన్ మైనే ఇసే తుక్రాదియా. క్యూంకీ ముఝే లగా మేరీ ప్రదర్శన ఉత్నీ అచ్చీ నహీథి అని గుర్తు చేసుకున్నారు. అవార్డును రిజెక్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యపర్చినా.. శశికపూర్ అరుదైన వ్యక్తిత్వం మాత్రం అందరిలో చర్చకు తెరలేపింది.
- శశికపూర్ నిజాయితే యష్ చోప్రాతో బంధాన్ని బలపర్చిందా..?
ఏంటీ మొట్టమొదటి సినిమాకే నేషనల్ అవార్డ్ వస్తే వద్దంటాడు. ఏంటి పిచ్చోడా అని ముందు భావించినా.. ఆ తర్వాత, శశికపూర్‌ను కాస్త అర్థం చేసుకున్న యష్ చోప్రాకు ఆయన నిజాయితీ నచ్చింది. దాంతో వారిద్దరి మధ్యా బంధం మరింత బలోపేతమైంది.
ఎంతగా అంటే ఆ తర్వాత దీవార్, కబీ కబీ, త్రిశూల్, వక్త్ వంటి బాలీవుడ్ టాప్ హిట్స్ ను ఇద్దరూ కలిసి జంటగా పనిచేసేటంత… దాంతో శశికపూర్ బాలీవుడ్ నటనాస్థానం సుస్ధిరమైపోయింది. తన స్టార్‌డమ్‌తో పాటే.. తన నిజాయితీ నచ్చినవారెందరో ఆయనకు స్నేహితులుగా మారిపోయారు.
- విలక్షణ వ్యక్తిత్వం కల్గిన మనిషి శశి!
చాలామంది నటీనటుడు కీర్తి, పురస్కారాలు వస్తున్నకొద్దీ, స్టార్ డమ్ పెరుగుతున్నకొద్దీ మారిపోతుంటారు. కానీ, అవేవీ తన జీవితాన్ని అధిగమించకుండా.. నేల విడిచి సాము చేయని ఐడియల్ పర్సనాలిటీ శశికపూర్. కమర్షియల్ సినిమాల్లో చేస్తూనే, సమాంతర సినిమాల్లోనూ నటించాడు. సమాంతర సినిమాలూ థియేటర్లలో ప్రదర్శించాలని మద్దతు ప్రకటించాడు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ కపూర్ చిన్న కొడుకుగా.. రాజ్ కపూర్, శమ్మీకపూర్, త్రిలోక్ కపూర్ తమ్ముడిగా సినీరంగంలోకి బాల్యవయస్సులోనే ఎంట్రీ ఇచ్చాడు శశికపూర్. 1950లో వచ్చిన సంగ్రామ్, సమాధితో పాటు.. 1951లో వచ్చిన ఆవారా సినిమాల్లో బాలనటుడిగా యాక్ట్ చేశాడు శశికపూర్.
- అవార్డులను కొనుక్కునేవారున్న రోజుల్లో, అవార్డుల కోసం సిఫార్సులు చేసేవారే ఎక్కువ కనిపించే కాలంలో, అవార్డులే తమ వృత్తి జీవితాలకు మైలురాయి అని భావించేవారున్న యుగంలో.. వచ్చిన జాతీయ అవార్డును తిరస్కరించిన హీరోగా శశికపూర్ ది బాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోలేని ఓ అధ్యాయం.
కానీ ఇదే శశికపూర్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ తో పాటు.. దాదా సాహేబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలనందుకున్నారు…
Share this Article