Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Not OG… They call him DG… శివధర్‌రెడ్డి కెరీర్ ఓ ఇంట్రస్టింగ్ కథ…

September 26, 2025 by M S R

.

సాధారణంగా డీజీపీలుగా ఎవరిని ఎంచుకోవాలనేది ముఖ్యమంత్రుల విచక్షణ… శివధర్‌రెడ్డిని తెలంగాణ కొత్త డీజీపీగా రేవంత్‌రెడ్డి నియమించడం పెద్ద ఆశ్చర్యమేమీ కలిగించలేదు, చాన్నాళ్లుగా అందరూ ఊహిస్తున్నదే… దానికి బలమైన కారణాలూ ఉన్నాయి…

ఐతే డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు కాపీని స్వయంగా ముఖ్యమంత్రే శివధర్‌రెడ్డికి అందించి, అభినందించిన ఫోటో విస్మయపరిచిన ఓ విశేషమే… అసాధారణం ఇది… శివధర్‌రెడ్డి పట్ల సీఎం మొగ్గు, తనపైన నమ్మకం ఎంతో ఆ ఫోటో చెబుతోంది…

Ads

dgp

సరే, డీజీపీలుగా సీనియర్ ఐపీఎస్‌లు వస్తుంటారు, పోతుంటారు… కానీ శివధర్‌రెడ్డి ఎంపిక గురించి, తన కెరీర్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ అంశాలు ఇప్పుడు చెప్పుకోవాలి… సందర్భమే కాబట్టి…

1994 బ్యాచ్ ఐపీఎస్ శివధర్‌రెడ్డి స్వరాష్ట్రం తెలంగాణ… రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, పెద్దతుండ్ల నేటివ్… పుట్టిందీ పెరిగిందీ హైదరాబాదే కాబట్టి తను పక్కా హైదరాబాదీ… ఉద్యమాల ఉస్మానియా స్టూడెంట్…

ప్రధానంగా ఆయన పేరు బలంగా తెర మీదకు వచ్చి, ఒక్కసారిగా పాపులరైన సందర్భం… నయీం ఎన్‌కౌంటర్..! నొటోరియస్ క్రిమినల్, పెద్ద నెట్‌వర్క్, క్రుయల్ కేరక్టర్ నయీంను ఓ పర్‌ఫెక్ట్ ఆపరేషన్‌లో ఖతం చేయడంలో శివధర్‌రెడ్డిదే కీలకపాత్ర, వ్యూహరచన, ఆచరణ… అయితే తరువాత ఏమైంది..?

క్రెడిట్ ప్రభుత్వానికి వచ్చింది, పెయిన్ ఒక సిస్టంకే మొగ్గు చూపిన ఈ ఆఫీసర్ వంతైంది… అదెట్ల అంటే ..? నయీం ఆస్తులేమయ్యాయనే మిస్టరీ పక్కన పెడితే… చాన్నాళ్లు నయీం డైరీలు అనే కథనాలుగా నడిచాయి మీడియాలో…

ఎవరెవరినో నయీం లింక్డ్ కేసులు చుట్టుకుంటాయనే వార్తలూ వినిపించాయి, సిస్టంను వ్యక్తినీ ఒకే గాటన కట్టలేకపోయారేమో ! అలా కట్టాలనుకున్న వారికి తను అంగీకరించలేదేమో… కేసీయార్‌కు నచ్చలేదు, తనకు నచ్చకపోతే , ప్రొఫెషనల్ ఎధిక్స్, పొలిటికల్ ఎథిక్స్ మరిచిపోయి ఎలా వ్యవహరిస్తాడో తెలుసు కదా…

dgp

ఆ ఎన్‌కౌంటర్ శివధర్‌రెడ్డికి చివరకు ఓరకంగా ఓ వింత శిక్ష విధించింది… అదెలాగంటే..? కేసీయార్ కోపంతో ఇంటలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తొలగించి, ఓ లూప్ లైన్ పోస్టుకు పంపించాడు 2015లో… ఐజీ పర్సనల్ పోస్ట్… ఓ చిన్న గదిలో కొలువు… తనతో ఎవరు మాట్లాడినా, కలిసినా ప్రభుత్వం సహించేది కాదు… దాదాపు ఏడున్నరేళ్ల అప్రధాన పోస్టు శిక్ష…

  • తన పట్ల సదభిప్రాయం ఉన్న పలువురు జర్నలిస్టులు, సివిలియన్స్, మరికొందరు తప్ప తనను ఎవరూ కలిసేవాళ్లు కాదు… ఆ నిర్బంధం నుంచి కోపం, కోపం నుంచి కసి… మౌనం… ఓపిక… మథనం… దాదాపు పదేళ్లపాటు ఆయన బీఆర్ఎస్ క్యాంపు వైపు కన్నెత్తి చూడలేదు, కేసీయార్‌తో గ్యాప్ పూడ్చుకునేందుకు కూడా ఏమాత్రం ప్రయత్నించలేదు… ఈ క్షణం వరకు కూడా, బహుశా తను తెలిసిన ఎవ్వరైనా ఇది నమ్ముతారు…
  • తనకు సన్నిహితులైన జర్నలిస్టులకు తెలుసు తన పెయిన్… రేవంత్‌రెడ్డికి దగ్గరయ్యాడు. ఇద్దరికీ లోతైన తెలంగాణ వాదం ఉంది… చివరకు ఆ సత్సంబంధం డీజీపీ నియామకం పైనా మొగ్గుచూపింది … తన మీద నమ్మకం పెట్టుకున్న ఆఫీసర్‌ను అక్కున చేర్చుకోవడంలో వైఎస్ తరువాత అంతటి హృద్యం చూపించిన నాయకుడు రేవంతే…

    ఇక్కడ ఇంకో విషయం… తన కెరీర్‌లో అధికభాగం ఇంటలిజెన్స్, ఎస్ఐబీ… ఎస్పీ ఇంటలిజెన్స్, ఎస్ఐబీ డీఐజీ, ఐజీ ఇంటలిజెన్స్, డీజీ ఇంటలిజెన్స్… ఏళ్లకేళ్లుగా… చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి… కొన్నాళ్లు కేసీయార్ దగ్గర… అందరు సీఎంలూ తనకు మంచి ప్రాధాన్యతే ఇచ్చారు… మంచి పీఆర్…

    ఫేక్ ఎన్‌కౌంటర్లను వ్యతిరేకించే తనపై అప్పట్లో పీపుల్స్‌వార్ (తరువాత మావోయిస్టులు) రక్తపిపాసి అనే ముద్ర వేశారు… అంతగా వేటాడాడు వాళ్లను… ఎస్ఐబీలో కూడా చేశాడు కదా… కొన్నాళ్లు గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్… ఇంకొన్ని విశేషాలు…

    తను స్వతహాగా లాయర్, కొన్నాళ్లు ప్రాక్టీస్ కూడా చేశాడు… 1994లో ఐపీఎస్… ఐరాస శాంతి పరిరక్షక దళంలోనూ కొన్నాళ్లు కొలువు… 2007లో మక్కా మసీదు బాంబు పేలుళ్ల అనంతరం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న స్థితిలో ప్రభుత్వం తనను ఆ సున్నిత ప్రాంతాల సౌత్ జోన్ డీసీపీగా పంపించింది…

    ఇలా తన కెరీర్ పరికిస్తే ప్రతి ఐపీఎస్ తరిచి చూడాలనుకునే ఓ ఇంట్రస్టింగ్ కథనం…. అందుకే ఇదంతా చెప్పుకోవడం… అందుకే చెప్పింది… Not OG… They call him DG అని..!!

    Share this Article



    Advertisement

    Search On Site

    Latest Articles

    • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
    • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
    • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
    • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
    • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
    • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
    • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
    • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
    • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
    • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

    Archives

    Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions