.
శుభోదయం….
బాల్యంలో రోహన్ పాఠశాలలో నేర్చుకున్న ఆత్మవిశ్వాసం, పాఠాన్ని అతను ఎప్పటికీ మర్చిపోలేదు…
Ads
ఒకసారి తరగతి గదిలో ముందుగా పద్యం చదవడానికి అతన్ని పిలిచారు… అతను మొదలుపెట్టాడో లేదో, వెంటనే ఉపాధ్యాయుడు గట్టిగా “తప్పు!” అని అడ్డుకున్నాడు…
అతను మళ్ళీ మొదలుపెట్టాడు.., కానీ ఉపాధ్యాయుడు మళ్ళీ “తప్పు!” అని ఉరిమాడు… అవమానంతో రోహన్ కూర్చుండిపోయాడు…
తరువాత మరో బాలుడు పద్యం చదవడానికి లేచాడు, అతను మొదలుపెట్టగానే ఉపాధ్యాయుడు “తప్పు!” అని అరిచాడు… అయితే, ఆ విద్యార్థి లెక్కచేయకుండా చదవడం ఆపివేయలేదు, పూర్తిగా పూర్తి చేశాడు.., అతను కూర్చోగానే, ఉపాధ్యాయుడు “చాలా బాగా చెప్పావు!” అన్నాడు…
రోహన్ కి చాలా చిరాకు వచ్చింది… “నేను కూడా అతనిలాగే చదివాను, కానీ తప్పు అన్నారేంటి” అని ఉపాధ్యాయుడితో నిష్టూరంగా అన్నాడు…
కానీ ఆ గురువు ఇలా సమాధానం ఇచ్చాడు.., “నువ్వు పాఠం తెలుసుకోవడం మాత్రమే సరిపోదు… నాకు తెలుసనే నమ్మకం నీకు ఖచ్చితంగా ఉండాలి… నన్ను నిన్ను ఆపడానికి నువ్వు అనుమతించావంటే, నీకే ఏదో అనుమానం ఉందని అర్థం… ప్రపంచం ‘తప్పు!’ (లేదు!) అని చెప్పినప్పుడు, నువ్వు ‘అవును!’ అని చెప్పి, దాన్ని నిరూపించడం నీ పని…”
ప్రపంచం చెప్పే ‘తప్పులు’
ప్రపంచం నీకు ‘తప్పు!’ (లేదు!) అని వేల రూపాల్లో చెబుతుంది.
‘లేదు! నువ్వు అది చేయలేవు.’
‘లేదు! నువ్వు తప్పు.’
‘లేదు! నీకు చాలా వయసైపోయింది.’
‘లేదు! నీకు ఇంకా చాలా తక్కువ వయసు.’
‘లేదు! నువ్వు చాలా బలహీనుడివి.’
‘లేదు! ఇది ఎప్పటికీ పని చేయదు.’
‘లేదు! నీకు సరైన చదువు లేదు.’
‘లేదు! నీకు సరైన నేపథ్యం లేదు.’
‘లేదు! నీ దగ్గర డబ్బు లేదు.’
‘లేదు! అది అసాధ్యం.’
ఇలా నువ్వు వినే ప్రతి ‘తప్పు!’ (లేదు!) నెమ్మదిగా నీ ఆత్మవిశ్వాసాన్ని కొంచెం కొంచెంగా తగ్గించి, చివరకు పూర్తిగా వదిలేసేలా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది…
ప్రపంచం ఈ రోజు నీతో ‘తప్పు!’ (లేదు!) అని చెప్పినా, నువ్వు మాత్రం ‘అవును!’ అని చెప్పి, దాన్ని నిరూపించడానికి సంకల్పించుకోవాలి! If world says NO every time, You should tell it YES, and prove it…
Share this Article