.
ఆఫ్టరాల్ ఆసియా కప్… పేరుకు 8 దేశాలు… అసలు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఫామ్‌లోనే లేవు… ఈ కప్ సాధిస్తే ఏమిటంత ఉత్సవాలు అనడిగాడు ఓ దోస్త్… అవును, ఆ కోణంలోనూ నాలుగు ముచ్చట్లు చెప్పుకోవాలి… తప్పనిసరిగా…
అసలు పాకిస్థాన్ వంటి ధూర్తదేశంతో, శతృదేశంతో… ఉగ్రవాద దేశంతో క్రికెట్ ఆడటమేమిటి..? ఆసియా కప్ బహిష్కరించాలి అనేదే దేశం స్థూలాభిప్రాయం, అదొక ఎమోషన్… కానీ ఉద్వేగాన్ని మించిన సమీకరణాలూ ఉంటయ్…
Ads
పాకిస్థాన్‌లో నిర్వహిస్తే మేం రాం అని చెప్పేశాం… దాంతో యూఏఈ తటస్ఠ వేదిక… ఐనా ఆడకూడదని జాతీయవాదుల బలమైన డిమాండ్లు… సరే, ఏవేవో లెక్కలతో కేంద్ర ప్రభుత్వం వోకే చెప్పింది… ఆసియా కప్ మొదలైంది… టీ20 పద్దతిలో…
ఒకే గ్రూపులో ఉండటంతో పాకిస్థాన్‌తో పోటీ తప్పలేదు, రెండు దేశాల్లోనూ ఉద్వేగాలు… ఆపరేషన్ సిందూర్ రగిల్చిన మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి… పాకిస్థాన్‌లో పరాభవ జ్వాలలు… తనే కాళ్లబేరానికి వచ్చి యుద్ధం ఆపేయించుకున్నా సరే, అంతర్జాతీయ వేదికల మీద మేమే గెలిచాం, భారత్ ఓడింది అనే డొల్ల ప్రచారాలు, తుపాకీరాముళ్లు కదా…
తరువాత మరో మ్యాచ్ పాకిస్థాన్‌తో తప్పలేదు… చివరకు ఫైనల్స్ కూడా ఈ రెండు జట్లకే తప్పలేదు… ఆటను అన్నిసార్లూ ఆటగా చూడలేం… తొలిగెలుపును ఇండియన్ ఆర్మీకి అంకితం ఇచ్చాం, పాకిస్థాన్ జట్టుతో షేక్ హ్యాండ్లకూ నిరాకరించాం… అదొక నిరసన ప్రకటన… పహల్గాం ఘాతకులకు ఓ చెంపదెబ్బ… సరిపోతుందా..? లేదు…
పైగా వాడెవడో పాకిస్థానీ ప్లేయర్ ‘మేం ఆరు ఇండియన్ జెట్లను కూల్చేశాం’ అన్నట్టుగా సైగలు… ట్రోలింగులు, ఇరు దేశాల్లోనూ ఉద్వేగాలు ఓ యుద్ధం స్థాయికి చేరాయి… అందుకే ఫైనల్ మీద ఆసక్తి… ఒకవేళ ఇండియా ఓడిపోతే పాకిస్థాన్‌లోనే కాదు, ఇండియాలో కూడా పాక్ అనుకూల శక్తుల వీరంగం, ట్రోలింగ్, దుష్ప్రచారం జరిగేవి… ఇదే పాకిస్థాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్, వీలయితే వాళ్ల పెద్ద తొత్తు ట్రంప్ కూడా పిచ్చి వ్యాఖ్యలు చేసేవాళ్లు…
ఈ ఫైనల్ కూడా ఒకరకంగా ఆపరేషన్ సిందూర్ కొనసాగింపు చర్య అన్నట్టుగా మారిపోయింది… వరుసగా రెండు మ్యాచులు గెలిచాం దాని మీద… మరి ఫైనల్..? పాకిస్థాన్ మొదట్లో దూకుడుగా ఆడినా మనవాళ్ల బౌలింగ్ వ్యూహాలతో తరువాత టపటపా వికెట్లు పడిపోయి తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు…
కానీ మనవాళ్లు కూడా మొదట్లో టపటపా వికెట్లు కోల్పోయినా మన హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ తెలివైన కూల్ బ్యాటింగుతో మనం గెలిచాం… దేశంలోని అనేక నగరాల్లో బాణాసంచా కాల్చి, దీపావళిని ముందే జరుపుకున్నారు క్రికెెట్ ప్రేమికులు… అవును, మోడీ అన్నట్టుగా… ప్లేయింగ్ ఫీల్డ్స్‌లోె కూడా ఆపరేషన్ సిందూర్‌దే జయం… జయహో భారత్…
చివరకు ఇండియా జట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నక్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి కూడా నిరాకరించింది… బహుశా ఈ రెండు దేశాల నడుమ జరిగిన ఈ ఎమోషనల్ సమరం క్రిెకెట్ చరిత్రలో ఎప్పుడూ ఏ దేశాల నడుమ జరగలేదేమో..!!
Share this Article