.
మాజీ మంత్రి ఈమధ్య తరచూ పొంతన లేని, అసంబద్ధ, అసందర్భ దురుసు వ్యాఖ్యలు, విమర్శలకు దిగుతున్నాడు తెలుసు కదా… కల్వకుంట్ల కవిత కూడా కామెంట్లు చేసింది… విచిత్రంగా తను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు వ్యాఖ్యలకు విరుద్ధంగా కూడా… ఏదో ఓకటి నేనూ విమర్శించాలని అనే వింత పోకడలతో వ్యాఖ్యానాలు చేస్తున్నాడు…
ప్చ్, ఏ అంశంపై ఎవరు మాట్లాడాలో కాస్త బీఆర్ఎస్ ఓ పద్ధతి పెట్టుకుంటే మేలు… పైగా కేటీయార్ ఓ ధోరణి తీసుకున్నాక ఇక మిగతా లేయర్-2, లేయర్-3 నాయకులు కూడా ఫాఫం, అదే ధోరణిలో మాట్లాడాలనే సోయి తప్పితే కష్టం… లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంటును అవమానించినట్టే… జనానికి కూడా పార్టీ స్టాండ్ ఏమిటో క్లారిటీ ఉంటుంది… (కేసీయార్ సుప్రీం ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్‌లో హరీష్ రావు, కేటీయార్… మిగతా వాళ్లు థర్డ్ లేయర్)
Ads
విషయం ఏమిటంటే..? ఎల్ అండ్ టీ నుంచి మెట్రో రైల్‌ను ప్రభుత్వం పూర్తిగా సొంతం చేసుకోవడానికి నిర్ణయం జరిగింది కదా… ఎల్ అండ్ టీ ప్రభుత్వం మీదే దాదాపు బ్లాక్ మెయిల్ వ్యూహాల్ని పన్నితే, రేవంత్ రెడ్డి తెలివిగా ఓ పద్ధతి ప్రకారం ప్రభుత్వ హస్తగతం చేస్తున్నాడు కదా… మీ అప్పుల్ని మేం తీసుకుంటాం, ఓ 2 వేల కోట్లు ఇస్తాం, ఇక దయచేయండి అన్నాడు…
కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా… ఏదీ ఆలోచించకుండా తిట్టేయడమే కదా బీఆర్ఎస్ ట్రెండ్, అసలే జనం తిరస్కరణ బాపతు ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు… కేటీయార్ ఏమన్నాడు..? రేవంత్ రెడ్డి అహంభావం, చేతకానితనం వల్ల… తన రియల్ ఎస్టేట్ స్వార్థం కోసం మెట్రో రైల్ విస్తరణకు ఎల్ అండ్ టీ అంగీకరించడం లేదనే కోపంతో దాన్ని వెళ్లగొట్టాడని కదా…
మేడిగడ్డ వైఫల్యం మీద కేసు కూడా పెడతానని, కంపెనీ సీఎఫ్‌వోను జైలుకు పంపిస్తానని రేవంత్ రెడ్డే ఎక్కడో చెప్పాడనీ కేటీయార్ ఆరోపించాడు… కంపెనీని నాశనం చేయడానికి ప్రయత్నించాడని చెప్పుకొచ్చాడు…
ఎస్, మేడిగడ్డ రిపేరుపై ఇదే ఎల్ అండ్ టీ సంస్థ నానా సాకులు చెబుతోంది… చంద్రబాబుకు, కేసీయార్‌కు ప్రియమైన సంస్థ… మరోవైపు నష్టాల్ని సాకుగా చూపుతూ, మెట్రో రైల్ నడపలేం అని చెబుతూ, మీడియాకు లీకులు ఇస్తూ ఏవో వేషాలు వేయబోతే… మీకో దండంరా బాబూ అన్నాడు రేవంత్ రెడ్డి… సో, కంపెనీకి రేవంత్ రెడ్డికీ నడుమ అగాధం ఉందనే కదా అర్థం…
కానీ ఇదే బీఆర్ఎస్ మాజీ మంత్రి… మాటిమాటికీ అన్ని విషయాలపైనా మీడియాకు ఎక్కే జగదీష్‌రెడ్డి ఏమంటున్నాడు..? రేవంత్ రెడ్డి 1000 కోట్లు తీసుకుని, మెట్రో రైల్‌ను ఎల్ అండ్ టీ నుంచి తీసుకున్నాడట… అందుకని దాని షేర్ల ధరలు పెరిగాయట… కేటీయార్ చేసే విమర్శలు వేరు, ఇవి వేరు… కొంపదీసి, కేటీయార్‌ను ధిక్కరిస్తున్నాడా ఏం..?
ఎవరైనా సరే, కోపంతో తమను తరిమేస్తున్న ముఖ్యమంత్రికి 1000 కోట్ల ముడుపులు ఇస్తాడా..? అదీ తమకు వచ్చే 2000 కోట్లలో సగం ఇచ్చేస్తారా..? కవిత బతుకమ్మ ఉత్సవాల నుంచి తిరిగి రాగానే… జగదీష్ రెడ్డి మీద మరోసారి స్పందిస్తేనే బెటర్ అనిపిస్తుంది…!!
Share this Article