Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Indian Pride… ప్రపంచ అగ్రశ్రేణి 2 % శాస్త్రవేత్తల్లో వరుసగా మూడేళ్లు..!!

September 30, 2025 by M S R

.

 

డాక్టర్ సంధ్య షెనాయ్…: ప్రపంచంలోని టాప్ 2 శాతం అగ్రశ్రేణి శాస్త్రవేత్తల జాబితాలో ఉన్న పేరు అని ఎక్కడో చదివాాను… గ్రేట్… ఇంతకీ ఆమె ఎవరు?

Ads

శ్రీనివాస్ విశ్వవిద్యాలయం సైన్స్ కారిడార్లలో, సుస్థిర శక్తి (Sustainable Energy) భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆమెది అసాధారణ విజయగాథ… ఎప్పుడో వెలుగులోకి వచ్చింది… వరుసగా మూడో సంవత్సరం కూడా ఆమె పేరు బహుళ ప్రచారంలోకి రావడానికి కారణం ఏమిటంటే..?

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం (Stanford University) రూపొందించిన ప్రపంచం అగ్రశ్రేణి 2% శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా మూడో సంవత్సరం చోటు దక్కించుకోవడం…  డాక్టర్ సంధ్య షెనాయ్, మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధకురాలు…

shenoy

విద్యా నేపథ్యం: పటిష్టమైన పునాది

డాక్టర్ సంధ్య షెనాయ్ అపారమైన పరిశోధన అనుభవం ఆమె పటిష్టమైన విద్యా పునాదిని ప్రతిబింబిస్తుంది…

  • గ్రాడ్యుయేషన్ (B.Sc.): మంగళూరు విశ్వవిద్యాలయం (Mangalore University) నుండి 2007లో పూర్తి చేసింది…
  • మాస్టర్స్, డాక్టరేట్ (M.Sc. & Ph.D.): ఆమె సైన్స్ విద్యలో కీలకమైన మలుపు.., దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, సూరత్‌కల్ (NITK Surathkal) నుండి 2009లో M.Sc. (కెమిస్ట్రీ…), ఆ తర్వాత 2013లో Ph.D. (కెమిస్ట్రీ) పొందింది…
  • పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్ (P.D.F.) : అత్యున్నత పరిశోధనా సంస్థ జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCASR), బెంగళూరులో 2014-2017 మధ్య పోస్ట్-డాక్టోరల్ ఫెలోగా పరిశోధనను కొనసాగించింది…

సుమారు 13 సంవత్సరాల పరిశోధన అనుభవం, 2.5 సంవత్సరాల బోధనా అనుభవం ఆమెకున్న లోతైన విజ్ఞానాన్ని తెలియజేస్తుంది… ప్రస్తుతం ఆమె శ్రీనివాస్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో సైంటిస్ట్ కమ్ టీచర్…

sandhya


పరిశోధన: వ్యర్థ వేడిని శక్తిగా మారుస్తోంది…

డాక్టర్ షెనాయ్ పరిశోధన ప్రధాన దృష్టి వ్యర్థ వేడిని విద్యుత్‌గా మార్చే అంశం… పారిశ్రామికంగా, గృహాలలో పెద్ద మొత్తంలో నష్టపోతున్న శక్తిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఆమె థర్మోఎలక్ట్రిక్ పదార్థాలను (Thermoelectric materials) అభివృద్ధి చేస్తోంది…

స్టాన్‌ఫోర్డ్ విడుదల చేసిన, స్కోపస్ సైటేషన్ల ఆధారంగా రూపొందించబడిన ఈ వరల్డ్ ఫేమస్ సైంటిస్టుల జాబితాలో ఆమె స్థానం, కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఆమె పరిశోధన తాలూకు నిలకడైన ప్రభావం (Sustained Impact) ప్రపంచ ఔచిత్యాన్ని (Global Relevance) నిరూపిస్తుంది…


భారతదేశ కీర్తి కిరీటం

వరుసగా మూడు సంవత్సరాలు ఈ ఉన్నత జాబితాలో చోటు దక్కించుకోవడం భారతదేశంలోని పరిశోధకులకు అరుదైన, గొప్ప ఘనత…

విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ సి.ఎ. రాఘవేంద్ర రావు, ప్రో-ఛాన్సలర్ డాక్టర్ ఎ. శ్రీనివాస్ రావు ఈ సందర్భంగా ఆమెను అభినందించారు… “ఆమె సాధించిన ఈ అరుదైన విజయం శ్రీనివాస్ విశ్వవిద్యాలయానికి మాత్రమే కాక, దేశానికి కూడా గర్వకారణం” అన్నారు…

ఇదెందుకు చెప్పుకుంటున్నాం అంటే… మూర్ఖాభిమానులూ మీమీ చెత్తా కుల నటులు కాదురా, ఇదుగో వీళ్లు అసలైన హీరోలు, ఇండియన్ ప్రైడ్ అని చెప్పడానికి..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…
  • కాంతారా చాప్టర్-1 … ఇది వనరుల దోపిడీ కథ… ఓ డిఫరెంట్ రివ్యూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions