.
మీడియా వేసిన ఓ ప్రశ్నకు కొత్త డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి ఇచ్చిన జవాబు ఆసక్తికరంగా అనిపించింది ఈరోజు మీడియాలో ఆయన ప్రెస్‌మీట్, ఇంటర్వ్యూల వార్తలు చదివాక… (ఖాకీ బుక్ అనే పదాన్నే మొత్తం మీడియా హైలైట్ చేసింది… ఇప్పుడు బుక్కులు ట్రెండింగ్ కదా మరి…)
నిజానికి ఆ మీడియా ప్రశ్నే కరెక్టు కాదు… ‘‘పింక్ బుక్, రెడ్ బుక్, మీది ఏ బుక్..?’’ ఇదీ ప్రశ్న… ఐతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తమ కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి.., దూకుడుగా అధికార పార్టీ తరఫున మీదికొచ్చే అధికారులను నిలువరించడానికి.., మేం అధికారంలోకి వచ్చాక ఈ బుక్కుల్లో రాసుకున్న వారి భరతం పడతాం అని బెదిరించడానికి ఓ ఎత్తుగడ అది…
Ads
జగన్ పాలనకాలంలో లోకేష్ ప్రవేశపెట్టింది రెడ్ బుక్… అంటే ఓ హిట్ లిస్ట్ తరహాలో ప్రచారం చేశారు… కూటమి అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ విమర్శ… మళ్లీ తనే ఇప్పుడు అవే లక్ష్యాలతో డిజిటల్ బుక్ తీసుకొచ్చింది… ఎక్కడ వేధింపులు ఎదురవుతున్నా, అందులోకి ఎంటరైతే వైసీపీ హైకమాండ్, లీగల్ ఎల్ మద్దతుగా వస్తాయనేది మరో అంశం…
మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు… రకరకాల వేధింపులకు గురైన కాంగ్రెస్ పార్టీ ఏమైనా బుక్ ఆలోచన చేసిందా..? లేదు… దూకుడుగా దాడి చేస్తూ, కేసీయార్ పార్టీని కకావికలం చేస్తుంటే ఆ దెబ్బలు కాచుకోవడానికే సరిపోయింది… సరే, బీజేపీ ఇలాంటి బుక్కులన్నింటికీ అతీతం… మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా…
తప్పుడు ప్రచారాలతో, అబద్ధాలతో, సోషల్ మీడియా నెగెటివ్ ప్రాపగాండాతో ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కోట్లకుకోట్లు ఖర్చు పెడుతోంది బీఆర్ఎస్… ఒకరకమైన ఫ్రస్ట్రేషన్, కోపం, అసహనంతో అనేక టీమ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలను ‘క్యాంపెయిన్’తో ముంచెత్తుతోంది… పైగా తనే పింక్ బుక్ తెచ్చాం అంటోంది… ఇదీ లోకేష్ బాపతు రెడ్ బుక్ ఎత్తుగడే…
ఈ కపట ప్రచారాల్ని నిరోధించేందుకు ఏం చేయాలో తేల్చుకునేందుకు కాంగ్రెస్ ఓ హైలెవల్ కమిటీని కూడా వేసింది… సరే, అదంతా వేరే సంగతి… మరి మీకు ఏ బుక్ ఉంది అని పోలీస్ యంత్రాంగాన్ని అడగడం కరెక్టు కాదనేది ఇందుకే…
పోలీస్ యంత్రాంగం గానీ, ఇతర అధికార యంత్రాంగం గానీ స్థూలంగా ప్రభుత్వ అనుబంధ విభాగాలు… చట్టం, సిస్టం, రాజ్యాంగం చెప్పినట్టు నడవాల్సిందే… ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రకటించే బుక్కులు జస్ట్, ఓ ఎత్తుగడలు, వాటి లక్ష్యాలు వేరు… ఏ పార్టీ అధికారంలో ఉంటేనేం, పోలీసులకు వాళ్ల విధులే ముఖ్యం కదా…
ఎస్, శివధర్‌రెడ్డి చెప్పిన జవాబు అందుకే నచ్చింది… రెడ్ బుక్, పింక్ బుక్ వంటివి మాకు ఉండవు, జస్ట్, ఖాకీ బుక్… పర్‌ఫెక్ట్ జవాబు… ఖాకీ బుక్ అంటే పోలీసుల విధినిర్వహణకు సంబంధించిన నియమావళి… అందులోనే అన్ని చట్టాలూ ఉంటాయి… దాన్ని అనుసరించడమే పోలీసుల పని… చట్ట వ్యతిరేకులను బుక్ చేయడమే ఖాకీ బుక్… బాగుంది…
కాకపోతే ప్రభుత్వాలు, పోలీసు బాసుల ప్రయారిటీలు కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మారుతుండొచ్చు… డీజీపీ చెప్పిన తమ ప్రయారిటీలు…
– వ్యక్తత్వ హననాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలకు అడ్డుకట్ట
– డ్రగ్స్ బెడదపై… సైబర్ క్రైమ్స్‌పై ప్రత్యేక దృష్టి… (అవును, ఇవి సొసైటీకి ఇప్పుడు డెడ్లీ వైరసులు… వామపక్ష తీవ్రవాదం ఆల్మోస్ట్ తెలంగాణలో లేదు… కబ్జాలు మరో వైరస్… డీజీపీ చెబుతున్న ప్రయారిటీలు అవసరమే… రేవంత్ రెడ్డి చెబుతున్న ప్రయారిటీలు కూడా ఇవే కదా…)
Share this Article