Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాహుబలితో స్టార్ట్… పదేళ్లలో ఏడు సౌత్ సినిమాలదే హవా..!!

October 2, 2025 by M S R

.

ప్రేక్షకుల వ్యూస్ ఆధారంగా మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీలు ఎవరిన మొన్న ఐఎండీబీ ర్యాంకింగ్స్ ఇచ్చింది కదా… ఆ ర్యాంకులతో అందరూ ఏకీభవించాలనేమీ లేదు… అది ఐఎండీబీ ఎంపిక చేసుకున్న ప్రామాణికాల ఆధారంగా కూర్చిన ర్యాంకులు… ఏమో ట్యాంపరింగులూ ఉండొచ్చు, బార్క్ రేటింగుల్లాగే…

అది 2000 నుంచి 2025 వరకు ఏయే సినిమాలు ఈ వ్యూస్ కోణంలో చూసినప్పుడు… అంటే పాపులారిటీ కోణంలో ఫస్ట్ ప్లేసులో ఉన్నాయంటే…. ఇదీ జాబితా…

Ads

Year  Movie Title
2000  Mohabbatein
2001  Kabhi Khushi Kabhie Gham
2002  Devdas
2003  Kal Ho Naa Ho
2004  Veer-Zaara
2005  Black
2006  Dhoom 2
2007  Taare Zameen Par
2008  Rab Ne Bana Di Jodi
2009  3 Idiots
2010  My Name is Khan
2011  Zindagi Na Milegi Dobara
2012  Gangs of Wasseypur
2013  The Lunchbox
2014  PK
2015  Baahubali: The Beginning
2016  Dangal
2017  Baahubali 2: The Conclusion
2018  K.G.F: Chapter 1
2019  Uri: The Surgical Strike
2020  Dil Bechara
2021  Pushpa: The Rise
2022  K.G.F: Chapter 2
2023  Animal
2024  Pushpa 2: The Rule

చూశారుగా… 2015 బాహుబలి రిలీజయ్యే వరకూ హిందీ సినిమాలదే హవా… సౌత్ సినిమాలు కేవలం తమ రాష్ట్రాలకే పరిమితం అయి ఉండేవి… సౌత్ సినిమాలను బాలీవుడ్ యాక్సెప్ట్ చేసేది కాదు… కానీ 2015 నుంచి సౌత్ దాడి మొదలైంది… హిందీ మాత్రమే కాదు… కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ బాక్సులూ షేక్ అయిపోయాయి…

ఓవర్సీస్, ఇతర దేశాల్లోనూ రిలీజులు, వసూళ్లు… 2015 నుంచి 2024 వరకు… అంటే పదేళ్లలో బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, పుష్ప, కేజీఎఫ్-2, పుష్ప-2… అంటే పదేళ్లలో ఆరు మన సినిమాలే… యానిమల్ కూడా హిందీలో తీసినా మన వంగ సందీప్ రెడ్డి ఖాతా కాబట్టి… అదీ లెక్కేస్తే పదిలో ఏడు మనకే… హిందీలో కూడా షారూక్ ఖాన్ సినిమాలే టాప్…

మరి ఇంకొన్ని తెలుగు సినిమాలూ బాగానే నడిచాయి కదా అంటారా..? అవును, మగధీర 2009లో నాలుగో స్థానం, నేనొక్కడినే 2014లో నాలుగో స్థానం, అర్జున్ రెడ్డి 2017లో నాలుగో స్థానం, అల వైకుంఠపురంలో 2020లో రెండో స్థానం, ఆర్ఆర్ఆర్ 2022లో రెండో స్థానం, సలార్-1 2023లో నాలుగో స్థానం… ఇవీ పరిగణించదగినవే…

2020లో దిల్ బెచారా ధాటికి అల వైకుంఠపురంలో రెండో ప్లేసుకు పోగా, 2022లో ఆర్ఆర్ఆర్ సినిమాకు మన సౌత్ సినిమా కేజీఎఫ్ నుంచే పోటీ ఎదురైంది… ఆ సంవత్సరం ఫస్ట్, సెకండ్ ప్లేసులు సౌత్ సినిమాలవే… అదీ సంగతి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈతరం తప్పక చదవాల్సిన శాస్త్రి డెత్ మిస్టరీ… ఎవరు చంపారు..?!
  • ఎంత మంచివాడవురా…? ఎన్ని నోళ్ల పొగడుదురా..? చెంపపైకి ఓ కన్నీటి చుక్క..!!
  • 75 weds 35 … పెళ్లిరోజు రాత్రే కుప్పకూలాడు… ఏం జరిగి ఉంటుందబ్బా…
  • బాహుబలితో స్టార్ట్… పదేళ్లలో ఏడు సౌత్ సినిమాలదే హవా..!!
  • యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ను బుక్ చేయడమే… ఖాకీ బుక్..!!
  • వేటూరి వీక్, పరుచూరి వీక్… కథ వీక్, కథనమూ వీక్… కృష్ణ సినిమా వీక్…
  • కాంతార చాప్టర్-1… రిషబ్ శెట్టి మళ్లీ కొట్టాడు… అవే పూనకాలు..!!
  • ఉడికీఉడకని ఇడ్లీ… ధనుష్ నటుడిగా డిస్టింక్షన్… దర్శకుడిగా జస్ట్ పాస్…
  • పోలీసులకు ఐ-బొమ్మ హెచ్చరిక వైరల్… కానీ కంటెంటు పాతదే…
  • ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అమ్మకమే..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions