Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

BF అంటే..? ఆగండి, ఏవో నీలి ఊహల్లోకి వెళ్లకండి… ఇది చదవండి…

October 3, 2025 by M S R

.

BF …. ఫుల్ ఫామ్ ఏమిటి..? అర్థం ఏమిటి..? అరెరె, ఆగండాగండి, ఎక్కడికో ఆ నీలి ఊహల్లోకి వెళ్లకండి కాసేపు… మరో కథ చెబుతాను… అసలు అర్థం ఏమిటో అది చెబుతుంది… what is BF meaning…

.

Ads

ఇది ఓ అందమైన ‘BF‘ కథ …

ఓ పిల్లాడు టీన్స్… సేమ్ వయస్సులో ఓ అమ్మాయి… స్కూల్‌లో ఆ పిల్లాడు ఆమెతో ‘నేను నీకు BF‘ అన్నాడు… ఆ పిల్ల దానికి ‘BF‘ అంటే ఏంటి? అని ఆ అబ్బాయిని అడిగింది… దాని ఫుల్‌ఫామ్ ఏమిటో తెలియక… దానికి ఆ అబ్బాయి తిరిగి బదులిస్తూ ‘BF అంటే బెస్ట్ ఫ్రెండ్’ అన్నాడు…

కొన్నేళ్లు గడిచాయి… అదే అమ్మాయి, అదే అబ్బాయి పెరిగి పెద్దయ్యారు … యవ్వనంలోకి వచ్చాడు.., ప్రేమ తాలూకు, ఆకర్షణ బాపతు మధురోహలు మొదలయ్యాయి… అమ్మాయి అందంగా తయారైంది… అప్పుడు కూడా ఆ కుర్రాడు ‘నేను నీకు BF‘ అన్నాడు…

అప్పుడు అమ్మాయి సిగ్గుపడుతూ … ఆ అబ్బాయితో … “ఇప్పుడు ‘BF’ అంటే ఏంటి?” అని అడిగింది… దానికి ఆ కుర్రాడు ‘BF అంటే నేను నీకు బాయ్ ఫ్రెండ్’ అన్నాడు… మరికొన్నేళ్లు గడిచాయి…

వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు… పిల్లల్ని కన్నారు… అప్పుడు మళ్లీ అతడు ‘నేను నీకు BF‘ అని చెప్పాడు… అప్పుడామో మళ్లీ ఆమె నవ్వుతూ ‘ఇప్పుడు BF అంటే అర్థం మారిందా..? అయితే ఏంటి?’ అని ప్రశ్నించింది…

అతడు తన పిల్లలవైపు చూస్తూ ‘BF అంటే నేనిప్పుడు బేబీస్ ఫాదర్ లేదా బెస్ట్ ఫాదర్’ అని బదులిచ్చాడు… కాలం పరుగులు తీస్తోంది… చివరకు ఇద్దరూ వృద్ధులయ్యారు… ఒకరోజు సాయంత్రం తన భార్యతో మాట్లాడుతూ ‘ఇంకా నేను నీకు BFనే’ అన్నాడు…

ఆమె నవ్వుతూ ‘ఈ BF అంటే ఇప్పుడు అర్థమేమిటోయ్?’ అని ఆసక్తిగా అడిగింది… దానికి సమాధానంగా అతడు చిన్న నవ్వు నవ్వి ‘BF అంటే ఇప్పుడు బీ ఫరెవర్ అని అర్థం’ అని చెప్పాడు…

ఆ పెద్ద మనిషికి వయస్సు మీదపడింది… మరణశయ్యపై ఉన్నాడు… చివరి క్షణాల్లో భార్య వైపు కన్నీళ్లతో చూస్తూ… ‘Dear, Still I am Your BF‘ అన్నాడు… అతను చెప్పిన దానికి ఆ వృద్ధురాలు ఏడుస్తూ ‘ఇప్పుడు ఏమిటీ ‘BF‘ అంటే’ అని అడిగింది…

దానికి ఆయన బదులిస్తూ… BF అంటే ఇక బై ఫరెవర్’ అంటూనే కన్నుమూశాడు… భార్య చేతుల్లోనే… కొన్నాళ్లకు ఆ పెద్దావిడ కూడా కన్ను మూసింది… వాళ్ల పిల్లలు తమ పేరెంట్స్ ఫొటోపై ఏం రాశారో తెలుసా..?

‘BF అంటే Beside For Ever’ (ఎప్పటికీ తోడుగా ఉండటం) అని రాశారు … BF అంటే జీవితం చివరివరకు
అన్నిబాధ్యతలలో ఒకరికొకరు తోడుగా ఉండడం…

  • (ఓ మిత్రుడు పంపిన పోస్టు ఇది… కాస్త అక్కడక్కడా మార్పులు చేశాను అంతే… రచయిత ఎవరో గానీ ధన్యవాదాలు)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • BF అంటే..? ఆగండి, ఏవో నీలి ఊహల్లోకి వెళ్లకండి… ఇది చదవండి…
  • మజ్ను అంటే ఓ పేరు కాదు..! పిచ్చోడు, మూర్ఖుడు అని అర్థం..!!
  • నోబెల్ ఇవ్వకపోతే చచ్చారే… అసలే నేను మహా శాంతికాముకుడిని…
  • 10 లక్షల మంది ఉపాధి… 21 వేల కోట్లు… యూట్యూబ్‌ ఒక వ్యవస్థ..!!
  • పదాలన్నీ పచ్చల పిడిబాకులే… పదప్రయోగంలో సినారె రసికుడైన వగకాడు…
  • కాంతార ప్రీక్వెల్‌కు ఈయన పర్మిషన్ దేనికి..? అదీ దేవుడు చెప్పడమేంటి..?!
  • ఈతరం తప్పక చదవాల్సిన శాస్త్రి డెత్ మిస్టరీ… ఎవరు చంపారు..?!
  • ఎంత మంచివాడవురా…? ఎన్ని నోళ్ల పొగడుదురా..? చెంపపైకి ఓ కన్నీటి చుక్క..!!
  • 75 weds 35 … పెళ్లిరోజు రాత్రే కుప్పకూలాడు… ఏం జరిగి ఉంటుందబ్బా…
  • బాహుబలితో స్టార్ట్… పదేళ్లలో ఏడు సౌత్ సినిమాలదే హవా..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions