.
జీఎస్టీ స్లాబుల్ని తగ్గించి, కొన్ని వస్తువులపై రేట్లు తగ్గించి… జీఎస్టీ 2.0 ప్రవేశపెట్టారు కదా… వాటి ఫలితాలు సాధారణ జనానికి అనుకున్నట్టు అందాయా లేదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి…
కానీ ఈ పన్ను రేట్ల తగ్గింపు ప్రభావం ఏమైనా వ్యాపార విక్రయాలపై సానుకూలంగా ఉందా..? ఇదీ ప్రశ్న… కొన్ని విశ్లేషణలు ఉందనే చెబుతున్నాయి… ఒక విశ్లేషణ ఇదుగో…
Ads
దేశ వినియోగదారుల ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది నవరాత్రి పండుగ సందర్భంగా గత దశాబ్దకాలంలోనే అత్యధిక విక్రయాలను నమోదు చేసింది… ముఖ్యంగా మోదీ ప్రభుత్వం అమలు చేసిన నెక్స్ట్‌జెన్ జీఎస్‌టీ సంస్కరణలు (NextGen GST reforms) పన్ను రేట్లను తగ్గించి, ఉత్పత్తులను మరింత అందుబాటులోకి తీసుకురావడం ఈ రికార్డు స్థాయి వృద్ధికి ప్రధాన కారణం…
పన్నుల తగ్గింపుతో ధరలు తగ్గడం, వినియోగదారుల్లో కొనుగోలు శక్తి పెరగడం వల్ల కుటుంబాలు కొత్త వాహనాలను, గృహోపకరణాలను కొనుగోలు చేయడంతో పాటు, జీవనశైలికి సంబంధించిన వస్తువులపై మరింత స్వేచ్ఛగా ఖర్చు చేశాయి… ఇది పండుగ ఉత్సాహాన్ని రికార్డు బద్దలు కొట్టిన అమ్మకాలుగా మార్చింది… బ్రాండ్‌లు, రిటైలర్లు 25% నుండి 100% వరకు అమ్మకాల వృద్ధిని చూపిస్తున్నారు…
ఆటోమొబైల్ రంగంలో సునామీ
నవరాత్రి సందర్భంగా వాహనాల విక్రయాల్లో అద్భుతమైన వృద్ధి కనిపించింది… మారుతి సుజుకి అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 100% వృద్ధి సాధించాయి… ఇది కనీసం దశాబ్దంలోనే ఆ కంపెనీకి అత్యుత్తమ ప్రదర్శన…
మారుతి సుజుకి 1,50,000 బుకింగ్‌లు నమోదు చేసింది… గత నవరాత్రికి ఇది 85,000 వాహనాలను మాత్రమే విక్రయించింది… నవరాత్రి మొదటి 8 రోజుల్లోనే కంపెనీ ఏకంగా 1.65 లక్షల వాహనాలను డెలివరీ చేసింది…
మొదటి రోజునే 30,000 కార్ల రికార్డు డెలివరీ చేసింది, ఇది గత 35 ఏళ్లలో కంపెనీకి అత్యుత్తమ వన్ డే పనితీరు… మహీంద్రా & మహీంద్రా (XUV700, స్కార్పియో ఎన్ వంటి ఎస్‌యూవీల తయారీదారు) విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 60% పెరిగాయి…
హ్యుందాయ్‌లో క్రెటా, వెన్యూ వంటి మోడళ్లకు విపరీతమైన డిమాండ్ కారణంగా మొత్తం అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 72% కి పెరిగింది… హీరో మోటోకార్ప్ (టూ-వీలర్ తయారీదారు) షోరూమ్‌ల సందర్శన రెట్టింపు కాగా, బజాజ్ ఆటో కూడా బలమైన అమ్మకాలను రికార్డు చేసింది… టాటా మోటార్స్ ఈ పండుగ సమయంలో 50,000కు పైగా వాహనాలను విక్రయించింది…
ఎలక్ట్రానిక్స్ రంగంలో దూకుడు
ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా LG, Haier, Godrej Appliances వంటి సంస్థలు గత ఏడాదితో పోలిస్తే రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి… హైయర్ (Haier) అమ్మకాలు 85% పెరిగాయి… ₹2.5 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న 85-అంగుళాల, 100-అంగుళాల టీవీల దీపావళి నిల్వలను దాదాపుగా అమ్మేసింది… ఈ కాలంలో 65-అంగుళాల టీవీలను రోజుకు 300–350 యూనిట్లు విక్రయించింది…
భారతదేశంలో అతిపెద్ద రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ అమ్మకాలు గత నవరాత్రి కంటే 20-25% పెరిగాయి… పెద్ద స్క్రీన్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఫ్యాషన్ వస్తువులు ఈ వృద్ధికి కీలకం… ఎలక్ట్రానిక్స్ రిటైల్ చెయిన్ విజయ్ సేల్స్ కూడా 20% పైగా అమ్మకాల వృద్ధిని చూసింది… ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కూడా…
ఓనం, దుర్గా పూజ, దసరా వంటి పండుగలతో కూడిన సీజన్‌లో మొత్తం అమ్మకాలలో 40–45% వాటాను కలిగి ఉంటుంది. దేశంలో ఇదే అతిపెద్ద క్రయవిక్రయ కాలంగా పరిగణిస్తారు… సో, ఈ సీజన్‌లో పెరిగిన అమ్మకాలు జీఎస్టీ 2.0 సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నట్టే లెక్క..!!
Share this Article