.
సాధారణంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారం వారం రాసే కొత్త పలుకుకు పాఠకులు ఎక్కువ… ఏ ఇతర పత్రికల్లోనో కనిపించే సంపాదకీయ వ్యాసాలు చదివేవాళ్లే ఉండరు… ఉత్త నస… పసలేని రాతలు…
ఐతే రాధాకృష్ణ వ్యాసాలకు అతి పెద్ద మైనస్… జగన్‌పై విషం, చంద్రబాబుపై భక్తి… సో, ఏపీ రాజకీయాలకు సంబంధించిన తన అభిప్రాయాలన్నీ వెయ్యి శాతం బయాస్డ్… తన వ్యాసాల్ని చదివేవాళ్లు అది తెలిసీ చదువుతూనే ఉంటారు…
Ads
ఈసారి పూర్తి భిన్నం… ఈరోజు తను రాసిన వ్యాసం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్… బ్యాలెన్స్‌డ్… ఓ జర్నలిస్టుగా తన అనుభవం, తన పరిణతి కనిపించాయి… మామూలుగా తన వ్యాసాల్ని నిశితంగా విమర్శించే సోషల్ మీడియా యాక్టివిస్టులు సైతం ఈరోజు వ్యాసాన్ని మెచ్చుకుంటున్నారు తమ పోస్టుల్లో…
కాస్త కటువుగా, పరుషంగా చెప్పాలంటే… బాలకృష్ణ బట్టలిప్పేశాడు… మామూలుగా బాలకృష్ణ మీద ఏదైనా రాయడానికి చాలామంది సంకోచిస్తుంటారు… కానీ ఆ క్యాంపు మనిషే అయి ఉండీ రాధాకృష్ణ నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా కడిగేశాడు… తన వ్యాసంలోని కొన్ని వాక్యాలు ఇలా…
‘‘తెలుగుదేశం సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్న మాటలను కాదు – నిండు సభలో ఆయన ప్రవర్తించిన తీరును తప్పు పట్టాలి. బాలకృష్ణ శాసనసభకు ఎన్నికవడం ఇది మొదటిసారి కాదు. మూడో పర్యాయం. సభ మర్యాదల గురించి ఆయనకు తెలియదని అనుకోగలమా? చలువ కళ్లద్దాలను తలపైకి నెట్టి, రెండు జేబులలో చేతులు పెట్టుకొని ఆయన మాట్లాడటం సభా మర్యాదలను ఉల్లంఘించడమే!
నిండు సభలో సహచర సభ్యుడిని సైకోగాడు అనడం, కళ్లజోడును తలపైకి నెట్టుకొని, జేబుల్లో చేతులు పెట్టుకొని మాట్లాడటం కచ్చితంగా అభ్యంతరకరమే.
బాలకృష్ణకు సందర్భ శుద్ధి తక్కువని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం కష్టం. ఆయన వ్యాఖ్యలు తన అభిమానులకు నచ్చవచ్చునుగానీ ఇతరులకు ఎందుకు నచ్చుతాయి?
శాసనసభలో తాను సైకోగాడు అన్న జగన్మోహన్‌రెడ్డి ఒకప్పుడు కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు అన్న విషయం బాలకృష్ణ మర్చిపోయారేమో తెలియదు.
మాట తూలే ముందు సంయమనం పాటిస్తే బాలకృష్ణకే గౌరవం పెరుగుతుంది. శాసనసభలో ఏక వచనంతో ఎవరినీ సంబోధించకూడదు. అది తెలుసో లేదో తెలియదుగానీ బాలకృష్ణ ‘వాడు వీడు’ అన్న పదాలను వాడారు.
ఇది తప్పు అని ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా స్పీకర్ అయ్యన్నపాత్రుడైనా బాలకృష్ణకు చెప్పాలి. నటుడిగా బాలకృష్ణ వ్యవహార శైలి వల్ల లాభమైనా నష్టమైనా ఆయన మాత్రమే అనుభవిస్తారు. శాసనసభ్యుడిగా ఉన్నంత కాలం నా ఇష్టం అంటే కుదరదు. సభా సంప్రదాయాలకు, విలువలకు ఆయన కట్టుబడి ఉండాల్సిందే’’
హవ్వ… నవ్విపోదురుగాక! ఈ ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఆయన నలిగిపోతున్నారు… అని చంద్రబాబును చూసి కూడా జాలిపడ్డాడు రాధాకృష్ణ…
బాలకృష్ణ వల్ల తలెత్తిన వివాదం రాజుకోకుండా ఉండేందుకు జ్వరంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ ఇంటికి పరామర్శ పేరుతో చంద్రబాబు వెళ్లి గంటకు పైగా గడిపారని ప్రచారంలో ఉంది. కాగా, ఆయన చిరంజీవికి కూడా ఫోన్ చేసి సముదాయించి ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది… అని బాలకృష్ణ మాటలతో చంద్రబాబు ఇలా ఇబ్బంది పడ్డాడో చెప్పుకొచ్చాడు ఆర్కే…
ఏపీ రాజకీయాల్లో కమ్మ, రెడ్డి, కాపు కులజాఢ్యం ఎలా ప్రబలిందో ఘాటుగానే రాశాడు… నిజమే, కేవలం వాళ్ల కులస్తులు వోట్లేస్తేనే గెలుస్తారా ఈ కులరాజకీయ నేతలు..? టీడీపీ కమ్మ పార్టీ, వైసీపీ రెడ్ల పార్టీ, జనసేన కాపు పార్టీ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేసేంతగా కులం- రాజకీయం కలగలిసిపోయి, దానికి ఫ్యానిజం తోడై… ఏపీ రాజకీయాలు నిజంగానే కంపు కొడుతున్నాయి..!!
ఓ కొత్త విషయం తెలిసింది… ‘‘బాలకృష్ణను మాత్రమే కాదు– ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎంపీ కే.కేశవరావు కుమారుడు కాల్పులకు తెగబడిన సందర్భంలో కూడా రాజశేఖరరెడ్డే రక్షించారు. నేరం చేశారని తెలిసి కూడా వదిలేయడం మంచిదా? కాదా? అన్నది వేరే విషయం…’’
Share this Article