Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దీపం కింద చీకటి..! సొంత సిబ్బంది ఆకలి, జీతాలే పట్టని నేతలు..!

October 6, 2025 by M S R

.

Murali Buddha….. సార్, మాకు ఆరు నెలల నుంచి జీతాలు లేవు …
ఐతే నాకెందుకు చెబుతున్నారు …?
మేం – డబ్బులివ్వని పత్రికలో ఆరు నెలల నుంచి జీతాలు లేకుండా పని చేస్తున్నాం …

వెరీ గుడ్, సమాజానికి మీలాంటి నిస్స్వార్ధ కలం వీరులు కావాలి …
సార్, మేం జీతం ఇస్తారనే పని చేశాం .. సేవ కాదు …
హు …. కాలం మారింది … తుచ్ఛమైన డబ్బు కోసం పవిత్రమైన జర్నలిజంలోకి వస్తున్నారు … మా రోజులే వేరు ..

Ads

సార్, మా ఆకలి కేకలు వినాలి …
జర్నలిజం పుట్టినప్పటి నుంచి సమాజంలో ఆకలి కేకలు ఉన్నాయి . ఇప్పుడు ఆ ఆకలి కేకలు జర్నలిస్ట్ లలో ఉన్నాయి . అంతే … ఏమన్నా కొత్తవి చెప్పు ?
మా జీతాలు …?
ఐనా జీతాలు మమ్ములను అడుగుతున్నావేమిటీ ?

మీరు జర్నలిస్ట్ ల నాయకులు కదా ? జీతాలు ఇప్పించమని ..
అసలు జర్నలిస్ట్ నాయకులు అంటే తెలుసా ? ఎవడు జీతాలు ఇవ్వకుంటే, వాళ్ల నుంచి జీతాలు ఇప్పించడం ఒక్కటే మా పని అనుకుంటున్నావా ?
డార్జిలింగ్ లో, ఆఫ్రికాలో జర్నలిజం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై రెండు గంటల ఉపన్యాసం ఇచ్చా … విన్న వాళ్ళు డంగై పోయారు తెలుసా ?
తెలియదు …

మా ఉపన్యాసాల వార్త చదవరు కానీ జీతాలు ఇప్పించాలి …
మీరంతా ఓ లెదర్ బ్యాగ్ పట్టుకొని గ్రూప్ ఫోటో దిగుతారు . ఏదో చిన్న పత్రికలో ఫోటో వస్తుంది . అది చూస్తా . మీ ఉపన్యాసం మాత్రం ఎవ్వరూ వేయరు సార్ …

ఐనా ఎప్పటి నుంచో అడగాలి అనుకుంటున్న డౌట్ .. ఇక్కడ జీతాలు ఇవ్వడం లేదు మొర్రో అని ఏడుస్తుంటే … జార్జియా, జమ్మూ అంటూ దేశం మూలమూలల్లో మీరు భలే మీటింగ్ లకు వెళతారు సార్ …
జర్నలిజమే పవిత్రమైన వృత్తి అంటే యూనియన్ నాయకత్వం అనేది అంతకన్నా పవిత్రమైన వృత్తి నీకు అర్థం కాదు వదిలేయ్ …

మీలా అంతర్జాతీయ విషయాలు , మాట్లాడే అర్థం చేసుకొనే స్థితిలో లేం.. మావి ఆకలి కేకలు …
అరే… ఆకలి కేకలు టైటిల్ భలే ఉంది … రిజిస్టర్ చేయించు పది మందిమి కలిసి పత్రిక పెడదాం సహకార పద్దతిలో …
మీకూ ఇందులో ఉద్యోగం ఇస్తాలే … గొంతు లేని వారికి మన ఆకలి కేకలు గొంతు అవుతుంది . నాలుక లేని వారికి నాలుక , చెవులు లేని వారికి చెవులు , ముక్కు లేని వారికి ముక్కు అవుతుంది …

సార్, సారా కొట్టు సాంబయ్య నుంచి రియల్ ఎస్టేట్ యాదగిరి , కాంట్రాక్టర్ కనకయ్య వరకు బోలెడు సంపాదించిన వారంతా ఇవే డైలాగులు ప్రజలకు నాలుక గుండె అవుతామని …. మాకు జీతాలు ఇప్పించండి సార్ …

డిబ్రుగఢ్ లో జర్నలిజం భవిషత్తు-  సవాళ్లు అంతర్జాతీయ సదస్సులో మాట్లాడేందుకు వెళుతున్నా.. వచ్చాక మాట్లాడుతా ..
కనీసం ఒక్క నెల జీతం ఇప్పించండి . ఇంటి ఓనర్ సామాన్లు బయట పారేస్తున్నాడు …
ఈ బుర్జువా ఇంటి ఓనర్లు ఇంతే బ్రదర్ … ఇంకెంత కాలం వీళ్ళ దౌర్జన్యాలు … ఇంటి అద్దె వసూలు చేయని మరో ప్రపంచం కోసం మనం కలం ఝుళిపించాలి …

ఇంత నీరసంగా ఉన్నప్పుడు కలం ఎలా ఝుళిపించాలి … జీతాలు ఇప్పించండి సార్ ..
తల కోసిన మేకలా ఆ జీతాల అరుపేంటి ? నేను అంతర్జాతీయ సమస్యలు మాట్లాడుతుంటే నువ్వు తిండి గురించి … మన పార్టీ యూనియన్ ఉన్నాక ఆ బుడ్డ యూనియన్ వద్దకు ఎందుకు వెళ్లారు … మీ జీవితాలు ఇంతే ఫో …. ( వాస్తవిక కల్పన )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…
  • కాంతారా చాప్టర్-1 … ఇది వనరుల దోపిడీ కథ… ఓ డిఫరెంట్ రివ్యూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions