Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిగ్‌బాస్ హౌజ్ సీజ్…! కంటెస్టెంట్లను తరిమేశారు..! అసలు ఏమిటీ కథ..!?

October 8, 2025 by M S R

.

బిగ్‌బాస్ హౌజును కర్నాటక ప్రభుత్వం సీజ్ చేసి, ప్రస్తుతం నడుస్తున్న 12వ సీజన్ కంటెస్టెంట్లను అందులో నుంచి తరిమేసింది… గేటుకు తాళం వేసింది… ఇదీ వార్త… సరే, సొసైటీకి పెద్ద నష్టం ఏమీ లేదు కానీ…

రెండు కోణాల్లో ఆలోచించాలి దీన్ని… ఈటీవీ కన్నడలో ప్రసారమయ్యేది మొదట్లో, తరువాత కలర్స్ కన్నడ చానెల్… ఇండియన్ భాషల్లో బిగ్‌బాస్ షో ప్రజెంట్ చేసే ఎండెమాల్ షైన్ దీన్ని నిర్మిస్తోంది… హోస్ట్ కిచ్చా సుదీప్…

Ads

మొదట్లో పూణేలోని లోనావాలాలో షూట్ చేసేవాళ్లు… (తెలుగు కూడా మొదట్లో అక్కడే)… తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌కు మార్చినట్టుగానే కన్నడ బిగ్‌బాస్ షూట్‌ను బెంగుళూరులోని ఇన్నొవేటివ్ ఫిలిమ్ సిటీకి మార్చారు… (జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్ (Jollywood Studios and Adventures) అని ఈమధ్య పేరు మార్చారు…)

2018 లో హౌజ్ సెట్ కాలిపోయింది… ఆరో సీజన్‌కు మొత్తం మళ్లీ పునర్నిర్మించాల్సి వచ్చింది… సో, ఆ ఫిలిమ్ సిటీ నిర్వహణ చాలా లోపభూయిష్టమనే విమర్శలు చాన్నాళ్లుగా ఉన్నాయి… ఇప్పుడు కర్నాటక కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు హఠాత్తుగా వెళ్లి, ఆ హౌజ్ నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేయకుండానే బయట డ్రెయిన్లలో కలిపేస్తున్నారని హౌజును సీజ్ చేశారు… తాళాలు వేశారు…

bbk12

ఇక్కడ కర్నాటక ప్రభుత్వం సదరు ఇన్నొవేటివ్ ఫిలిమ్ సిటీ మీద కావాలనే ఏదో కక్ష ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది… అధికారులు చెప్పే కారణాలు…

1) కాలుష్య నియంత్రణ చట్టాల ప్రకారం తప్పనిసరిగా తీసుకోవాల్సిన ‘కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్’…  ‘కన్సెంట్ ఫర్ ఆపరేషన్’ వంటి ముఖ్యమైన అనుమతులను స్టూడియో యాజమాన్యం తీసుకోలేదు…

2) మురుగునీరు శుద్ధి చేయకుండా బయట డ్రెయిన్లలోకి వదిలేస్తున్నారు…

పర్యావరణ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆదేశాల మేరకు, KSPCB అధికారులు స్టూడియో కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు… రామనాగర జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను ఆ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశించగా, విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని BESCOM అధికారులకు సూచించారు…

ఆల్రెడీ అక్కడ చాన్నాళ్లుగా ఫిలిమ్ సిటీ కార్యకలాపాలు సాగుతున్నాయి… సరిగ్గా ఇప్పుడు బిగ్‌బాస్ సెట్ వల్ల కొత్తగా కాలుష్యం రావడం లేదు… సరిగ్గా ఈ సీజన్ నడుస్తున్నప్పుడే ఈ దాడులు, ఒకేసారి అన్ని శాఖలు మీదపడటం చూస్తుంటే… కావాలని కీలకమైన సమయం ఎంచుకుని మరీ టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది…

దాని వెనుక ఎవరున్నారు? ఏం ఆశిస్తున్నారు? వంటివి పక్కన పెడితే… ఇన్నాళ్లూ కర్నాటక ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు మరి..? ఇదీ కీలకప్రశ్న… ఒక్క బిగ్‌బాస్ సెట్ నుంచి వచ్చే మురుగునీటిని మాత్రమే బయట డ్రెయిన్లలోకి వదులుతున్నారా..? మరి మిగతా ఫిలిమ్ సిటీ నుంచి వచ్చే మురుగునీటి మాటేమిటి..? చాలా ప్రశ్నలున్నాయి…

ఇక్కడే మరో విషయం చెప్పుకోవాలి… బెంగుళూరులో KSPCB నిబంధనల ప్రకారం, వాణిజ్య సంస్థలు (Commercial Projects),  ఇతర పెద్ద నిర్మాణాలకు సంబంధించి STP తప్పనిసరి … స్టూడియోలు, వాణిజ్య సముదాయాలు (Commercial Complexes), కార్యాలయ భవనాలు నిర్మిత ప్రాంతం (Built-up Area) 5,000 చదరపు మీటర్లు (sq.m) లేదా అంతకంటే ఎక్కువ ఉంటే., లేదా మురుగునీటి ఉత్పత్తి రోజుకు 35 కిలోలీటర్లు (35 KLD) లేదా అంతకంటే ఎక్కువ మురుగునీటిని ఉత్పత్తి చేస్తుంటే… మురుగునీటి శుద్ధ ప్లాంటు తప్పనిసరి…

హోటళ్లు మరియు రెస్టారెంట్లు గదులు 20 లేదా అంతకంటే ఎక్కువ గదులు ఉన్న హోటళ్లు లేదా 36 లేదా అంతకంటే ఎక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్న రెస్టారెంట్లు/విందు హాళ్లు (Banquet Halls) తప్పనిసరిగా STP లేదా ETP (Effluent Treatment Plant) ను ఏర్పాటు చేయాలి…

అవునూ… మన తెలుగు బిగ్‌బాస్ షో షూట్ చేసే అన్నపూర్ణ స్టూడియోస్‌కు కన్నడ బిగ్‌బాస్ హౌజు సీజర్ ఏదైనా సందేశమో, సంకేతమో ఇస్తున్నదా..?

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…
  • కాంతారా చాప్టర్-1 … ఇది వనరుల దోపిడీ కథ… ఓ డిఫరెంట్ రివ్యూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions