.
Pardha Saradhi Potluri
…… భారత విదేశాంగ విధానం విఫలం అయ్యింది! ……… రాహుల్ !
ఎందుకంటే… రష్యా భారత అభ్యర్ధనని కాదని పాకిస్తాన్ కి JF-17 ఇంజన్ల ని సరఫరా చేస్తున్నది అట… కానీ ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు!
Ads
విచిత్రం ఏమిటంటే పాకిస్థాన్ నుండి వస్తున్న ప్రతీ రూమర్ ని పిచ్చిగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు!
మరి అసలు నిజం ఏమిటీ?
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన JF-17 బ్లాక్ III ఫైటర్ జెట్ కి కావాల్సిన ఇంజన్లని రష్యా సరఫరా చేస్తున్నది అని నానా యాగీ చేస్తున్నారు! కానీ నిజానికి అలాంటి ఒప్పందం ఏమీ జరగలేదు!
కాంగ్రెస్ తో పాటు కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నట్లుగా రష్యా పాకిస్తాన్ మధ్య ఇంజిన్ల సరఫరా కోసం ఎలాంటి ఒప్పందం జరగలేదు!
మరి ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారు? వాస్తవాలు ఏమిటీ?
1995 లో పాకిస్తాన్ తనకంటూ స్వంత ఫైటర్ జెట్ ఉండాలని భావించి చైనాతో సంప్రదింపులు జరిపి జాయింట్ వెంచర్ గా ఒక ఫైటర్ జెట్ ని తక్కువ ధరలో తయారు చేయడానికి ఒప్పందం చేసుకున్నాయి.
ఫైటర్ జెట్ డిజైన్ చేసేటప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇంజినీర్లు తమ అవసరాల కోసం ప్రత్యేకంగా ఏమేమి కావాలో చైనాకి చెందిన చెంగ్డు కార్పొరేషన్ ఇంజినీర్ల ముందు ఉంచారు.
కానీ పాకిస్తాన్ ఇంజినీర్లు అడిగినవి అన్నీ సమకూరిస్తే ధర ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువ ధరలో వీలున్నంత వరకూ పాకిస్తాన్ అడిగినవి సమకూరుస్తామని హామీ ఇచ్చారు.
ధర తక్కువలో డిజైన్ చేయాలి కాబట్టి చెంగ్డు కార్పొరేషన్ ఇంజినీర్లు అప్పటికే తమ వద్ద ఉన్న డిజైన్స్ ని ఆధారం చేసుకొని కొత్తగా డిజైన్ చేశారు.
కొత్త డిజైన్ కి JF-17 అని పేరు పెట్టారు. JF అంటే జాయింట్ ఫైటర్.
JF-17 డిజైన్ కి చైనాకి చెందిన J-7 ఫైటర్ జెట్ ఆధారం.
J-7 డిజైన్ కి ఆధారం సోవియట్ MIG-21 ఫైటర్ జెట్. ఒకప్పటి సోవియట్ యూనియన్ ని నుండి లైసెన్స్ తీసుకొని చైనా డెవలప్ చేసిందే J-7 మోడల్.
JF-17 అనేది MIG-21, J-7 ఫైటర్ జెట్ల నుండి స్ఫూర్తిని పొంది డిజైన్ చేశారు.
Mig-21 అనేది 1950 వ దశకంలో సోవియట్ యూనియన్ డిజైన్ చేసింది కాబట్టి అది 3rd జెనరేషన్ ఫైటర్ జెట్ గా పిలుస్తారు.
JF-17 డిజైన్ చేయడానికి ముందే ఏ ఇంజిన్ వాడాలో నిర్ణయించుకున్నారు. అది రష్యన్ తయారీ క్లిమోవ్ ( Klimov )RD-93 టార్బో ఫాన్ ఇంజన్.
రష్యన్ తయారీ అయిన Mig-29 ఫైటర్ జెట్స్ కి RD-33 మరియు RD 93 ఇంజన్లని వాడతారు.
మన దగ్గర ఉన్న MIG-29 లలో RD-33 ఇంజన్లని వాడుతున్నాము. RD-33 కి మరో వేరియంట్ RD-93 మోడల్.
RD-93 ని మరింత అభివృద్ధి చేసిందే RD-93MA అనే ఇంజిన్. ఇప్పుడు RD-93MA ఇంజన్ల గురుంచే చర్చ జరుగుతున్నది.
చైనా, పాకిస్తాన్ జాయింట్ వెంచర్ JF-17 మొదటి ప్రోటో టైపు మోడల్ 2003 లో గాల్లోకి ఎగిరింది. అప్పట్లో JF-17 లో వాడింది రష్యన్ తయారీ RD-33 ఇంజన్.
1998 లో రష్యా, చైనా, పాకిస్తాన్ కలిసి ఒక త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందం ప్రకారం రష్యా RD-33 ఇంజన్లని చైనాకి సరఫరా చేస్తుంది. చైనా JF-17 విడి బాగాలతో సహా పాకిస్థాన్ కి ఇస్తుంది. పాకిస్తాన్ వాటిని అసెంబుల్ చేసి వాడుకుంటుంది లేదా ఇతర దేశాలకి అమ్ముతుంది. పాకిస్తాన్ JF-17 లని ఇతర దేశాలకి అమ్ముతుంది కాబట్టి రష్యా అభ్యంతరం చెప్పకూడదు.
అలాగే భవిష్యత్ లో RD-33 ఇంజన్ అప్ గ్రేడ్ చేస్తే వాటిని కూడా JF-17 కోసం వాడుకోవచ్చు కానీ దాని కోసం విడిగా మరో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.
RD-33 ➡️ RD-93 ➡️ RD-93MA!
ఇప్పుడు RD-93MA ఇంజిన్ కోసం పాకిస్తాన్ ఎందుకు అడుగుతున్నది?
ఎందుకంటే వేరే దారి లేదు గనుక…!
మొదట 2003 లో JF-17 ఎగిరినప్పుడు అది ప్రోటో టైప్ కాబట్టి పెద్దగా సమస్య రాలేదు. ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఆపరేషన్ లోకి వచ్చిందో అప్పటినుండి రష్యన్ ఇంజన్లు మొరాయించడం మొదలుపెట్టాయి.
అఫ్కోర్స్! మన దగ్గర ఉన్న MIG-29K ( నావీ వేరియంట్) కూడా తరుచూ ఇంజన్లలో లోపాల వల్ల సగానికి పైగా విమానాలు మెయింటనెన్స్ కోసం హ్యాంగర్స్ కే పరిమితం అయి ఉండేవి.
CAG ( Comptroller and Auditor General of India) 2016 లో పార్లమెంట్ కి ఇచ్చిన నివేదికలో ఇండియన్ నావీ కి చెందిన MIG-29K ఫైటర్ జెట్స్ లలో పదే పదే లోపాలు తలత్తడంతో 65 ఇంజన్ల లో 40 ఇంజన్లని సర్వీస్ నుండి తొలగించాల్సి వచ్చింది అని పేర్కొంది. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అని పేర్కొంది.
రష్యా నుండి స్పేర్ పార్ట్స్ సరఫరాలో విపరీతమైన జాప్యం జరగడం ఒక కారణం అయితే, వచ్చినవి నాణ్యత బాగా లేకపోవడంతో Mig-29K ఫైటర్ జెట్స్ యుద్ధ సన్నధ్ధత (War readiness) కేవలం 39% కే పరిమితం అవుతూ వస్తున్నది. ఏ విమాన ఫ్లీట్ అయినా యుద్ధ సన్నధ్ధత అనేది 60% గా ఉండాలి.
అందుకనే మిగ్ విమానాలని కొనడానికి ఆసక్తి చూపడం లేదు భారత నావీ.
ఎప్పుడో 1996 లో రష్యా, చైనా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఒప్పందాన్ని ఇప్పుడు ఎందుకు రచ్చ చేస్తున్నారు?
2004 నుండి 2014 వరకూ పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రష్యా మీద ఒత్తిడి తెచ్చి ఇంజన్ల సరఫరా ఒప్పందం రద్దు చేయించి ఉండాల్సింది కదా?
2003 లో JF-17 మొదటి ప్రోటో టైప్ ఫైటర్ జెట్ గాల్లోకి ఎగిరినప్పటి నుండి ఇంజన్ సమస్యల వల్ల అసలుకే మోసం వచ్చింది. తరుచూ JF-17 లు కూలిపోవడమో లేదా రన్ వే మీదకి వచ్చిన తరువాత తగినంత థ్రస్ట్ లభించక టేక్ అఫ్ చేయలేకపోవడమో జరుగుతూ వచ్చింది.
రష్యన్ RD-93 ని వాడడం మొదలుట్టిన తరువాత కొద్దిగా మార్పు వచ్చింది.
కానీ స్పేర్ పార్ట్స్ సప్లై విషయంలో రష్యా వేగంగా స్పందించకపోవడంతో పాకిస్తాన్ చైనా మీద వత్తిడి తెచ్చింది రష్యా ఇంజన్ కి ప్రత్యామ్నయంగా స్వంత ఇంజన్ తయారుచేయాలని.
చైనా చెంగ్డుకి చెందిన ఇంజనీర్ యాంగ్ వీ ( Yang Wie) JF-17 కోసం WS-13 ఇంజన్ సిఫారస్ చేశాడు. గిజ్హౌ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ( GUIZHOU AIRCRAFT INDUSTRY CORPORATION) WS-13 ఇంజన్ ని తయారుచేస్తుంది.
ప్రస్తుతం JF-17 కి రష్యన్ RD-93 ఇంజన్ తో పాటు చైనా తయారీ WS-13 ఇంజన్ ని కూడా వాడుతున్నారు.
JF-17 Thunder Block III
ఈ F-17 బ్లాక్ 3 కోసం RD-93, WS-13 లు సరైన థ్రస్ట్ ఇవ్వలేకపోతున్నాయి. పైగా బ్లాక్ III కోసం చైనా శక్తివంతమైన రాడార్ తయారు చేసింది. కానీ ఇంజన్ పవర్ సరిపోవకపోవడంతో RD-93 MA మోడల్ ఇంజన్ ని ప్రయత్నించడం, అది సరిగ్గా సరిపోవడంతో RD93 MA ఇంజన్ ని పాకిస్తాన్ లో అసెంబుల్ చేయడం కోసం ( Transfer of Technology) ఒప్పందం కోసం రష్యాని అడిగింది కానీ రష్యా కేవలం ఇంజన్లని అమ్మడానికి మాత్రమే ఒప్పుకుంది! కానీ ఇంకా ఒప్పందం చేసుకోలేదు.
1996 నుండి JF-17 రష్యన్ RD-33 ఫ్యామిలీకి చెందిన RD-33, RD-93 వేరియంట్ ఇంజన్లని వాడుతూ వస్తున్నది. ఇప్పుడు RD-93 MA ఇంజిన్ కొనడానికి ప్రయత్నిస్తున్నది.
రష్యా నేరుగా పాకిస్థాన్ తో ఒప్పందం చేసుకోలేదు. చైనాకి చెందిన చెంగ్డుతో ఒప్పందం చేసుకొని నేరుగా చైనాకే ఎగుమతి చేస్తున్నది. RD-93 MA ఇంజన్ కూడా చెంగ్డుతోనే ఒప్పందం చేసుకుంటుంది అదీ కేవలం ఇంజన్ల సరఫరా కోసమే!
రష్యా చైనాకి RD-93 MA ఇంజన్లని అమ్మవద్దని మనమెలా డిమాండ్ చేయగలం? ప్రస్తుత పరిస్థితుల్లో చైనా మాత్రమే రష్యాకి సహాయం చేయగలదు.
డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు?
రష్యా RD-93 MA ఇంజన్లని పాకిస్థాన్ కి అమ్మితే అది భారత దేశానికే లాభం అవుతుంది కానీ ఎలాంటి నష్టం ఉండదు.
2024 ఏప్రిల్ లో రష్యా RD-33 ఇంజన్ తాలూకు టెక్నాలజీ ని భారత్ కి ఇచ్చింది.
ఒరిస్సాలోని కోరాపుట్ లో ఉన్న HAL లో SU-30 MKI కి వాడే Saturn AL – 31, Mig-29k కి వాడే RD-33 ఇంజన్లని తయారు చేస్తున్నారు. అంతకు ముందు అసెంబ్లింగ్ మాత్రమే జరిగేది కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో మన దేశంలోనే తయారు అవుతున్నాయి!
ఇప్పుడు JF-17 కి RD-93MA ఇంజిన్ వాడితే దాని బలాలు, బలహీనతలు మనకి తెలుసు కాబట్టి మనకే లాభం!
ASTRA BVR MK-1, ASTRA MARK -2 బెయాండ్ విజువల్ రేంజ్ మిస్సైళ్ళు IIR ( Imaging Infrared ) సీకర్ తో పనిచేస్తాయి. అస్త్ర BVR IIR సీకర్ శత్రు దేశపు ఫైటర్ జెట్ ఇంజిన్ నుండి వెలువడే హీట్ సిగ్నేచర్ ని టార్గెట్ చేస్తూ వెళ్లి ఢీ కొడుతుంది. RD-33 హీట్ సిగ్నేచర్ మనకి తెలుసు కాబట్టి ASTRA BVR MK 1, MK2 లు చాలా తేలికగా JF-93MA ఇంజిన్ నుండి బయటికి వచ్చే హీట్ సిగ్నేచర్ ని చాలా తేలికగా గుర్తించి కూల్చేస్తాయి.
RD-93MA ఇంజిన్ లో FADEC (Full Authority Digital Engine Control) ఉంది. ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ లో కూలిపోయింది గుర్తుంది కదా? అందులో కూడా ఫడేక్ టెక్నాలజీ ఉంది దాని వల్లనే ఆ విమానం కూలి పోయింది.
RD-33, RD-93 ఇంజన్లు జీవిత కాలం 4,000 ఫ్లైయింగ్ అవర్స్ అయితే RD-93MA ఇంజిన్ 2,200 ఫ్లైయింగ్ అవర్స్ మాత్రమే!
అంటే ప్రతీ 2,200 గంటల ఫ్లైయింగ్ అవర్స్ తరువాత ఇంజిన్ ని దించేసి ఫుల్ ఓవర్ హాలింగ్ చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పాకిస్తాన్ RD-93 ఇంజన్ల ఓవర్ హాలింగ్ కోసం చైనాకి పంపిస్తున్నది. భవిష్యత్ లో అవే ఇంజన్లు ఒరిస్సాలోని కోరాపుట్ HAL కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే చైనా JF-17 లని వాడదు. RD-93 ఇంజన్ల ఓవర్ హాలింగ్ కోసం ప్రత్యేకంగా ఒక ఫెసిలిటి నడుపుతున్నది.
రష్యా తాను అమ్మిన RD 33 ఫ్యామిలీ ఇంజన్ల సర్వీసింగ్, ఓవర్ హాలింగ్ కోసం భారత్ లోనే చేయించుకోమ్మని సలహా ఇస్తుంది. అప్పుడు RD 33 ఫ్యామిలీ ఇంజన్లు వాడుతున్న అన్ని దేశాలు కూడా భారత్ కి రావాల్సిందే!
****************
రాజకీయం చేయవచ్చు కానీ దేశ ప్రయోజనాలని తాకట్టు పెట్టేవిధంగా చేయకూడదు.
వచ్చే డిసెంబర్ 5 న రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకి వస్తున్నాడు.
S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురుంచి కీలక ఒప్పందం జరిగే సూచనలు ఉన్నాయి. పుతిన్ నుండి ఇప్పటికే రెండు ప్రతిపాదనలు మోడీ పరిశీలనలో ఉన్నాయి అవి…..
S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పూర్తిగా భారత్ లోనే తయారు చేయడానికి ఒప్పందం చేసుకోవాలని.
SU-57 ఫిఫ్త్ జెనరేషన్ ఫైటర్ జెట్స్ ని కనుక భారత్ కొంటే వాటి తాలూకు డిజైన్స్ (80%)కూడా భారత్ కి ఇచ్చి భారత్ లోనే తయారు చేసి బయటి దేశాలకి అమ్మాలని.
ఈ రెండు ప్రతిపాదనలు కనుక కార్యరూపం దాలిస్తే అంత కంటే కావాల్సింది ఏముంటుంది?
మోడీ వైపు నుండి రెండు ప్రతిపాదనలు ఉన్నాయి.
మరో రెండు S-400 రేజిమెంట్లు కొనడానికి మొదటి ప్రతిపాదన అయితే రెండు రేజిమెంట్లు S-500 కొనడానికి రెండో ప్రతిపాదన ఉంది. 2018 లో మనం ముందే డబ్బులు ఇచ్చిన 5 రేజిమెంట్ల S400 లలో మూడు రేజిమెంట్స్ మాత్రమే సరఫరా చేయగలిగింది రష్యా. ఇంకా రెండు రేజిమెంట్లు రావాల్సి ఉంది.
పుతిన్ భారత పర్యటనకి ముందే ఏదో విధంగా రచ్చ చేయాలని చూస్తున్నది కాంగ్రెస్!
Share this Article