.
రష్మిక మీద శాండల్‌వుడ్ బ్యాన్… కన్నడ మీడియా మాత్రమే కాదు, తెలుగు మీడియా కూడా అదే రాస్తోంది గుడ్డిగా… ఐతే ఇదేమీ కొత్త కాదు… శాండల్‌వుడ్ (కన్నడ సినిమా) వర్సెస్ రష్మిక అన్నట్టుగా పంచాయితీలు పెట్టి మరీ పెట్రోల్ పోస్తున్నది కన్నడ మీడియా…
1) కాంతార చూశారా అని ఎవరో అడిగితే ఇంకా చూడలేదు అన్నదామె… అంతే… ఓ గగ్గోలు… నీ తొలి దర్శకుడి సినిమా చూడవు, ప్రశంసించవు, ఇదేం పొగరు అని మొదలుపెట్టింది మీడియా… ఆమె కాస్త తింగరి కదా, ఇంకాస్త గోకింది… ఎందుకు..?
Ads
రక్షిత్ శెట్టితో ఆమె నిశ్చితార్థం అయ్యాక బ్రేకప్… పెళ్లి రద్దు, తప్పు ఆమెదేనని రిషబ్ అభిప్రాయం… రక్షిత్, రిషబ్ ప్రాణస్నేహితులు… సో, ఆమె మీద కోపం పెంచుకున్నాడు రిషబ్… తనూ ఓ తీట మనిషే కదా… తనూ గోకాడు అప్పట్లో…
సోషల్ మీడియా, మీడియాలో ఈ తగాదా పెరిగి చివరకు శాాండల్‌వుడ్ ఆమెపై నిషేధం పెడుతుందనేదాకా ప్రచారాలు సాగాాయి… ఎందుకు పెడతారు..? ఎవరు పెడతారు..? ఆమె కన్నడ ఇండస్ట్రీకి చేసిన ద్రోహం ఏమిటి..? ఏ విచక్షణ లేకుండా ఎడాపెడా రాసేశారు ఆమె మీద… చివరకు నా తొలి దర్శకుడు రిషబ్ శెట్టి, కాంతారా సక్సెస్ శుభాకాంక్షలు అని చెప్పుకుని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది…
మీడియా కోపం దేనికి..? ఆమె కన్నడ సినిమాలు చేయకుండా తెలుగు, హిందీ, ఒకటీ అరా తమిళ సినిమాలు చేస్తూ గగనానికి దూసుకుపోయింది… కన్నడ మీడియాను పట్టించుకోదు, అసలే ఈ మధ్య భాషోన్మాదం ఎక్కువైంది కదా కన్నడనాట… అందుకని ఆమె మీద కారాలు మిరియాలు, ఆమెకు ఈ ట్రోలింగు గాయాలు…
రక్షిత్ శెట్టితో బ్రేకప్ దగ్గర నుంచీ కిచ్చా సుదీప్ వంటి సినిమా ప్రముఖులు ఆమెకు మద్దతుగానే ఉన్నారు… ఐనా ఆమె మీద బ్యాన్ పెడితే ఆమెకేం నష్టం..? రష్మిక అనే బ్రాండ్ పేరుతో మరో పదేళ్లు హవా నడిపించగలదు… పైగా ఇప్పుడు తెలుగింటి కోడలు కాబోతోంది… టాలీవుడ్ మరింత అక్కున చేర్చుకుంటుంది…
2) వారసుడు సినిమా రిలీజ్ సమయంలోనూ ఈమె ఏదో నోటితీటతో ఏదో వాగింది… అప్పుడూ ఓ వివాదం… అసలు కన్నడనాట ఆ కన్నడ వెర్షన్ రిలీజవుతుందానేదీ సందేహంలో పడింది ఓ దశలో… రిలీజ్ తెల్లారే 30 శాతం థియేటర్ల నుంచి ఎత్తేశారు… తరువాత నాలుగైదు రోజులకు కన్నడ వెర్షన్ ఖేల్ ఖతం… అంతా రష్మిక నోటితీట మహత్యం అని మళ్లీ మీడియా దాడి, అప్పుడూ ఆమెపై బ్యాన్ వార్తలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి… కుబేర సినిమా కూడా కన్నడనాట అట్టర్ ఫ్లాప్… దానికీ ఆమే కారణమని మళ్లీ వార్తలు…
3) ఆమె కాంతారా చాప్టర్ వన్ కూడా చూడలేదు… అభినందించలేదు, ఆమెపై బ్యాన్ తప్పదు అని మళ్లీ ప్రచారం మొదలుపెట్టింది మీడియా… ఆమె థామా హిందీ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది, ఎవరో అడిగారు, మీ సొంత ఇండస్ట్రీ మిమ్మల్ని బ్యాన్ చేసిందట కదా అని…
రిలీజ్ కాగానే ఆ సినిమా చూడలేకపోయాను, తరువాత చూసి, సినిమా టీమ్‌ను అభినందిస్తూ మెసేజులు పెట్టాను అని వివరణ ఇచ్చుకుంది… ఇప్పటికిప్పుడు ఏ హొంబలె ఫిలిమ్స్ వాడో ఆమెతో ఓ భారీ కన్నడ పాన్ ఇండియా రేంజ్ సినిమా తీస్తే గానీ కన్నడ మీడియా కోపం చల్లారదేమో… ఐనా హొంబలె దత్తపుత్రుడు రిషబ్ శెట్టి అది పడనిస్తాడా..? నెవ్వర్..!!
కన్నడ మీడియా రిషబ్ శెట్టి పట్ల పక్షపాతి… రష్మిక మీద కోపంతోనే కాంతార చాప్టర్ వన్ హీరోయిన్ రుక్మిణి వసంత్‌ను తెగ మోస్తోంది అదిప్పుడు… కొత్త నేషనల్ క్రష్ అనే ప్రచారం రష్మికకు వ్యతిరేకంగా మీడియా స్టార్ట్ చేసిందే… ఈ లొల్లి రుక్మిణికి కూడా తెలుసు, అందుకే నాపై ఏ ముద్ర వేయకండి ప్లీజ్ అని చేతులు జోడించి దండం పెట్టింది..!!
Share this Article