Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేసీయార్ మార్క్ సింపతీ పాలిటిక్స్… సీటుసీటుకూ మారుతుంటయ్…

October 11, 2025 by M S R

.

స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది కదా… ఆ ఎన్నికల సంగతేమిటో కాలం చెబుతుంది… ఈలోపు అందరి దృష్టీ జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక మీద పడింది…

రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలు ఆలోచిస్తుంటే.,. బీఆర్ఎస్ క్యాంపు మాత్రం సోషల్ మీడియా క్యాంపెయిన్‌ను, ప్రత్యేకించి సానుభూతి అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది… మాగంటి భార్య, కూతుళ్ల ప్రచారం ఫోటోలు పెట్టేసి… ఎమోషన్ చుట్టూ ఈ ఉపఎన్నికను తిప్పాలని ఆలోచిస్తోంది…

Ads

‘‘పాపం, భర్త లేని భార్య, తండ్రి లేని కూతుళ్లు… కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నారు… వాళ్లకు అండగా నిలబడాల్సిన సమయం ఇది…’’ అని కొన్ని పోస్టులు… ‘‘గతంలో ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఏకగ్రీవంగా ఆ కుటుంబసభ్యులకే అవకాశం ఇచ్చే ఆనవాయితీ ఉండేది…’’ అనీ కొందరు ప్రస్తావిస్తున్నారు…

పనిలోపనిగా కాంగ్రెస్ అభ్యర్థిపై ఓ రౌడీ ముద్ర వేసే ప్రచారమూ నడిపిస్తున్నారు… ఆయన తండ్రినీ బజారుకు లాగుతున్నారు… సరే, గుడ్, మాగంటి మరణంతో ఆ కుటుంబం ఓ పెద్ద దిక్కును కోల్పోయిన మాట నిజం… కానీ ఓసారి ఇదే కేసీయార్ సానుభూతి అనే ఓ ఎమోషన్‌తో ఎన్నిసార్లు ఎలా పొలిటికల్ ఆటలు ఆడాడో కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి…

2016… ఖమ్మం జిల్లా, పాలేరు… కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి మరణిస్తే ఉపఎన్నిక వచ్చింది… దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబీకులకే ఓ చాన్స్ ఇవ్వాలనే పాత సంప్రదాయాన్ని కేసీయార్ తుంగలో తొక్కేశాడు… తుమ్మల నాగేశ్వరరావును అభ్యర్థిగా పెట్టాడు… కాంగ్రెస్ పార్టీ మాత్రం వెంకటరెట్టి భార్య సుచరిత రెడ్డికి టికెట్ ఇచ్చింది…

సానుభూతీ గీనుభూతీ జాన్తా నై అన్నాడు కదా కేసీయార్… హరీష్‌రావు అభివృద్ధికీ, అణిచివేతకూ నడుమ పోరాటం అన్నాడు… లాజిక్‌లెస్… కానీ ఆమె ఓడిపోయింది… మరి ఆమె కూడా అప్పుడు భర్త లేని భార్యే కదా… ఇప్పుడు జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ క్యాంపు ప్రచారం చేస్తున్న మాగంటి కుటుంబంలాగే అప్పట్లో రామిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబమూ పెద్ద దిక్కును కోల్పోయింది కదా… మరి ఆమెకూ సానుభూతి దక్కి ఉండాలి కదా…

అదే 2016… నారాయణ్‌ఖేడ్… కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి మరణించాడు… అప్పుడూ ఇంతే… కేసీయార్ మహారెడ్డి భూపాల్‌రెడ్డి అని వేరే అభ్యర్థిని నిలబెట్టింది… కాంగ్రెస్ మాత్రం కిష్టారెడ్డి కొడుకు సంజీవరెడ్డికి టికెట్ ఇచ్చింది… అక్కడా సానుభూతి అనేది పనిచేయలేదు… సంజీవరెడ్డి ఓడిపోయాడు… మరి సేమ్, జుబ్లీహిల్స్ ప్రచారంలోలాగే… సంజీవరెడ్డి పాపం, తండ్రి లేని కొడుకు అనే భావనతో కేసీయార్ పోటీకి పెట్టకుండా ఉండాల్సింది కదా…

2018… సీన్ రివర్స్… కేసీయార్‌కు అదే సానుభూతి గుర్తొచ్చింది… దుబ్బాకలో రామలింగారెడ్డి మరణించడంతో ఉపఎన్నిక వచ్చింది… ఆయన భార్య సోలిపేట సుజాత రెడ్డిని బరిలో దింపింది… కానీ ఆమె ఓడిపోయింది… బీజేపీ నేత రఘునందన్‌రావు గెలిచాడు… అఫ్‌కోర్స్, కాంగ్రెస్ అసలు పోటీలోనే లేదన్నట్టు పూర్ పర్‌ఫామెన్స్…

ఇప్పుడు మళ్లీ సానుభూతి వోట్లు కావాలి కేసీయార్‌కు… మాగంటి భార్యకు టికెట్టు… పాలేరు, నారాయణ్‌ఖేడ్‌లో వైఖరికీ, దుబ్బాక, జుబ్లీహిల్స్‌లో వైఖరికీ పూర్తి కంట్రాస్టు… సేమ్, 2023లో హుజూరాబాద్ ఎన్నిక కూడా…

ఇదే బీఆర్ఎస్ అభ్యర్థి తన బిడ్డ, భార్యలను పక్కన కూర్చోబెట్టుకుని… గెలిపిస్తే సేవ చేస్తా, లేకపోతే నా భౌతిక కాయం చూస్తారు’ అని ఆత్మహత్య బెదిరింపులకు దిగాడు… సానుభూతి కోసం… సో, కేసీయార్ మార్క్ సానుభూతి వైఖరి స్థిరమైంది కాదు… అవసరాన్ని బట్టి అటూ ఇటూ… ఎటైనా మారిపోగలదు…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రిషబ్‌ శెట్టి ‘కాంతార’ మ్యాన్షన్… కళాత్మకత, సంస్కృతి, భద్రత మేళవింపు…
  • చావు దాకా తోడుగా, తోడ్పాటుగా వెన్నంటి… A True Love Story…
  • “యుద్ధం తానే, శాంతి తానే — జరగని యుద్ధాలనూ ఆపాడట..!!
  • మరేటి సేస్తాం అలగైపోయినాది… సొంత ‘నోబుల్’ అవార్డులే ఇక దిక్కు…
  • బ్లేమ్ గేమ్… బీసీ రిజర్వేషన్లపై పార్టీల పరస్పర నిందాపర్వం…
  • కేసీయార్ మార్క్ సింపతీ పాలిటిక్స్… సీటుసీటుకూ మారుతుంటయ్…
  • రెండు బొమ్మలూ ఒక్కచోట కుట్టేసి… మరోసారి దండుకో నా రాజామౌళీ…
  • ఆధునిక తెలుగులో ఎండ్ టు ఎండ్ ఇంగ్లిష్ ఓన్లీ…!
  • ‘‘నేనెందుకు అర్చకవృత్తి చేపట్టానంటే…’’ చిలుకూరు రంగరాజన్ కథ…
  • చిరంజీవి క్లాసిక్ చేస్తే ఎందుకో గానీ ఆ ‘ఆరాధన’ దక్కదు తనకు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions