.
పి.చిదంబరం … ఒకప్పటి కేంద్ర హోం మంత్రి … పక్కా కాంగ్రెస్… ఇప్పుడు 80 ఏళ్ల వయస్సు వచ్చాక… ఆల్రెడీ తనపై సీబీఐ, ఈడీ కేసులు నమోదై (ఎయిర్‌సెల్ మాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసులు) కొన్నాళ్లు జైలులో ఉండి వచ్చాక… ఇప్పుడు హఠాత్తుగా కొన్ని నిజాలు చెబుతున్నాడు ఎందుకో మరి…
తనంతటతానే బీజేపీ చేతికి అస్త్రాలిస్తున్నాడు… మొన్నామధ్య ఎక్కడో మాట్లాడుతూ ‘‘ముంబై ఉగ్రవాద (26.11.2008) దాడి తరువాత తాను హోంమంత్రిగా సైనిక చర్యను ప్లాన్ చేశాను, అప్పటి ప్రధాని మన్మోహన్‌తోనూ చర్చించాను, కానీ అమెరికా అడ్డుకుంది, ఆ దేశ విదేశాంగ కార్యదర్శి కండోలిజా రైస్ ఢిల్లీ వచ్చింది, ఒత్తిడితో మేం మా ఆలోచనల్ని నిలిపేసుకున్నాం’’ అని చెప్పాడు…
Ads
అమెరికా చెప్పగానే మోడీ ఆపరేషన్ సిందూర్ ఆపేసి, దేశానికి ద్రోహం చేశాడని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేస్తున్న విమర్శలు ఇప్పుడు చిదంబరం చెప్పిన మాటలతో తేలిపోయాయి… అప్పట్లో కాంగ్రెస్ నిర్వాకం కూడా అదేకదా అని జనంలోకి ఒక నిజం వెళ్లడానికి, కాంగ్రెస్- బీజేపీ ప్రభుత్వాలు దొందూ దొందే అనే భావన ఏర్పడటానికి చిదంబరం మాటలు దోహదం చేశాయి…
ఇప్పుడు ఏమంటున్నాడు అంటే… ‘‘ఆపరేషన్ బ్లూస్టార్ తప్పుడు మార్గం… అది అన్ని ప్రభుత్వ కీలక విభాగాల సామూహిక నిర్ణయమే అయినా చివరకు ఇందిరాగాంధీ తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది… దాంతో పోలిస్తే ఆపరేషన్ థండర్ విజయవంతమైన మార్గం…’’
ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలోనే కాదు… తరువాత 1986లో జరిగిన ఆపరేషన్ బ్లాక్ థండర్-1, 1988లో జరిగిన ఆపరేషన్ బ్లాక్ థండర్-2 సమయాల్లోనూ కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంది…
భింద్రన్‌వాలే నేతృత్వంలోని (ఇందిర పెంచి పోషించిన వ్యక్తే) మిలిటెంట్లను హతమార్చడానికి ఆపరేషన్ బ్లూస్టార్ జరిగింది… ఆ దాడిలో అకాల్ తఖ్త్ కొంత దెబ్బతినడం, చాలామంది మిలిటెంట్లు హతమారడం, తన పవిత్రస్థలాన్ని ఆర్మీ అపవిత్రం చేసిందనే భావన సిక్కు సమాజంలో బాగా పెరిగింది…
ఫలితమే ఇందిర హత్య.,. తరువాత ఢిల్లీ అల్లర్లలో సిక్కులు బాగా నష్టపోయారు… అన్నీ కలిపి కొత్తగా మరింత యువత తీవ్రవాదంలోకి వచ్చింది… వాళ్లకూ గోల్డెన్ టెంపులే అడ్డా… దాంతో 1986లో బ్లాక్ థండర్… ఐనా అదుపులోకి రాలేదు, ఫలితంగా 1988లో బ్లాక్ థండర్-2… ఈ రెండు సమయాల్లో హోంమంత్రి బూటాసింగ్…
ఆర్మీ నేరుగా దాడికి దిగలేదు (బ్లూస్టార్ సమయంలో పీవీ హోం మంత్రి)… కానీ ఆలయం కాంప్లెక్సులో నీరు, విద్యుత్తు, ఆహారం కట్ చేశారు… ఒత్తిడి పెంచారు… తీవ్రవాదులు భక్తుల్ని బందీలుగా పట్టుకుని బెదిరింపులకు దిగారు.., అప్పుడు ప్రధాని రాజీవ్‌గాంధీ… బ్లాస్టార్ నష్టాలేమిటో తెలిసి, ఆ కారణంగా తల్లిని కోల్పోయిన రాజీవ్ సంయమనంతో వ్యవహరించాడు…
బ్లాక్ థండర్-2 సమయంలో 140 మంది మిలిటెంట్లు లొంగిపోయారు… బ్లూస్టార్ తప్పుడు మార్గమని చెప్పడం ద్వారా మళ్లీ కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లోకి పడేశాడు చిదంబరం… పైగా తను మాజీ హోం మంత్రి… హఠాత్తుగా చిదంబరం నిజాల వెల్లడి వెనుక కారణాటేమిలో కూడా తనే చెప్పాలి, మరేదో మీటింగులో..!!
Share this Article