.
సుగర్ రోగులకు అందరూ చెప్పేది… అన్నం మానేయండి అని… ఎందుకు..?
అది ఫుల్ కార్బొహైడ్రేట్స్‌తో కూడినది… తిన్నవెంటనే సుగర్ లెవల్ పెరుగుతుంది… మధుమేహులకు మంచది కాదు అని..,
Ads
ఒక్కసారి సుగర్ అటాక్ అయ్యాక… అయ్యో, వేడి అన్నం తినలేకపోతున్నాను అని బాధపడే వాళ్లే అందరూ.,. కాకపోతే మిల్లెట్స్, దంపుడు బియ్యం, బ్రౌన్ బాస్మతితో నడిపిస్తుంటారు… జీఐ ఇండెక్స్ తక్కువ, సుగర్ మెల్లిగా రిలీజవుతుంది తప్ప అవీ కార్పోలే కదా…
సరే, రాత్రి అన్నాన్ని మజ్జిగలో నానబెట్టి, పొద్దున్నే ఆ పులిసిన చద్దన్నం (ఫర్మెంటెడ్ రైస్) తినడం వల్ల ప్రొబయోటిక్స్ అంది, ఆరోగ్యానికి మేలు… దానికీ పరిమితి ఉంటుంది… కానీ కొన్ని కొత్త అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..?
వేడి అన్నం కాదు, చల్లారబెట్టిన అన్నమే బెటర్?
కొత్త పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు!
మనలో చాలామందికి అన్నం అంటే వేడిగా ఉండాలి — ఆవిరి పొగలు గక్కే వేడి వంట అన్నం తిన్నప్పుడు కలిగే ఆనందం వేరే!
కానీ కొత్తగా వస్తున్న కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి — వేడి అన్నం కంటే చల్లారబెట్టిన అన్నం తింటే రక్తంలో షుగర్ కొంచెం తక్కువగా పెరుగుతుంది!
కారణం ఏమిటంటే…
అన్నంలో ప్రధానంగా స్టార్చ్ (పిండి పదార్థం) ఉంటుంది.
అది వేడి వేడిగా తిన్నప్పుడు త్వరగా జీర్ణమవుతుంది — దాంతో రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరుగుతుంది.
కానీ అదే వేడి అన్నాన్ని, ఫ్రిజ్‌లో లేదా గది ఉష్ణోగ్రతలో కొంతసేపు చల్లారనిస్తే —
దానిలోని కొంత స్టార్చ్ రూపం మారుతుంది.
ఇది “రెసిస్టెంట్ స్టార్చ్” అని పిలుస్తారు — అంటే ఇది శరీరంలో తేలిగ్గా జీర్ణం కాదు.
దాంతో, చల్లారబెట్టిన (లేదా మళ్లీ వేడి చేసి) అన్నం తింటే షుగర్ నెమ్మదిగా విడుదల అవుతుంది,
రక్తంలో ఒక్కసారిగా పెరగదు.
పరిశోధనలు ఏమంటున్నాయి?
కొన్ని ప్రయోగాల్లో…
-
ఫ్రిజ్‌లో 12–24 గంటలు ఉంచిన అన్నాన్ని మళ్లీ వేడి చేసి తిన్నవారికి
రక్తంలో గ్లూకోజ్ స్థాయిల పెరుగుదల కొంత తక్కువగా ఉందని కనిపించింది. -
ఈ తగ్గుదల ముఖ్యంగా వైట్ రైస్ కంటే పారబాయిల్డ్ రైస్ లేదా బ్రౌన్ రైస్ వంటి రకాలలో ఎక్కువగా కనిపించిందట.
కానీ జాగ్రత్త…
-
ఇది డయాబెటిస్‌కి మందు కాదు.
-
ఫలితం కూడా వ్యక్తి వ్యక్తికీ మారుతుంది —
అన్నం రకం, చల్లార్చిన సమయం, మళ్లీ వేడి చేసిన విధానం అన్నీ ప్రభావం చూపుతాయి. -
మొత్తానికి ఇది ఒక చిన్న సైన్స్-బేస్డ్ చిట్కా మాత్రమే,
“షుగర్ కంట్రోల్”లో ఒక సహాయకం అని భావించవచ్చు…
చాలామంది… రాత్రి మిగిలిన అన్నాన్ని, లేదా కావాలని మిగిలించబడిన అన్నాన్ని… పొద్దున వెజ్ ఫ్రైడ్ రైస్ లేదా ఇతరత్రా ఫ్రై చేసుకుని (పోపు అన్నం) తింటారు… మరి అది లాభమా..? నష్టమా..?
రాత్రి మిగిలిన అన్నం తెల్లారేసరికి బాగా చల్లారి, అందులో కొంత భాగం రెసిస్టెంట్ స్టార్చ్‌గా మారుతుంది, నిజమే, అది సుగర్‌ను వెంటనే రిలీజ్ కానివ్వదు… కానీ ఫ్రై చేసేటప్పుడు మళ్లీ ఆయిల్ గట్రా ఎడాపెడా వేసేస్తే చల్లారిన లాభం కాస్తా గోవిందా…
అందుకని తక్కువగా, అంటే వేసీవేయనట్టు ఆయిల్‌తో… ఎక్కువ కూరగాయల్ని గనుక వాడితే ఫైబర్ పెరిగి, సుగర్ రిలీజ్ మెల్లిగా ఉంటుంది… ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇంకాస్త బెటరేమో… కానీ జాగ్రత్త… మీ మీ సుగర్ లెవల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మాత్రమే..!!
దంపుడు బియ్యం బెటర్ కదా, తెల్లగా కనిపించకపోవచ్చుగాక… కానీ విటమిన్లు పోవు, అన్నం తిన్నామనే తృప్తి ఉంటుంది అంటారా..? వోకే, బాగా చల్లారక తినండి… కొంత బెటర్..!
Share this Article