Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

*ఫ్రీ మిక్సర్లు, గ్రైండర్ల, మేకలు, ఆవులు… అంతేకాదు, ప్రతివాడికీ ఫ్రీ భార్య..!!

October 14, 2025 by M S R

.

ప్రజెంట్ పొలిటిషయన్స్‌లో అందరూ అందరే… నీచ వ్యాఖ్యలు, బజారు భాష, అబద్ధపు ప్రచారాలు, కించపరిచే వ్యాఖ్యానాలు, చిల్లర విమర్శలు ఇలా…

వివాదం తలెత్తగానే, అబ్బే, నా వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించింది అని మళ్లీ అబద్ధాలు, దాటవేతలు, ఆత్మవంచనలు, దిగజారుడు సమర్థనలు… ఇప్పుడు టీవీల్లో రికార్డయినా సరే, తిక్క సమర్థనలకు మీడియాను నిందించడం కూడా సాగుతూనే ఉంది…

Ads

ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా ఏమీ లేదు… అసలు రాజకీయ నాయకుడంటేనే జనం ఏవగించుకునే సిట్యుయేషన్… తాజా ఉదాహరణ ఏమిటంటే…

అన్నాడీఎంకే మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగం మహిళలను ప్రభుత్వ ఉచితాలతో పోలుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్య…

అన్నాడీఎంకే బూత్ కమిటీ శిక్షణ సమావేశంలో షణ్ముగం మాట్లాడుతూ.., “ఎన్నికల కోసం చాలా ప్రకటనలు వస్తాయి… వారు మిక్సర్లు, గ్రైండర్లు, మేకలు, ఆవులను ఉచితంగా అందిస్తారు.., అంతెందుకు..? వారు ప్రతి వ్యక్తికి ఉచితంగా భార్యను కూడా ఇవ్వవచ్చు…” అన్నాడు…

కరుణానిధి కుమారుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అలాంటి వాగ్దానాలు చేయగలడని చెప్పుకొచ్చాడు… ఉచిత పథకాల మీద దేశవ్యాప్తంగా మేధావులు ఆందోళన వెలిబుచ్చుతున్నా సరే, రాష్ట్రాల ఆర్థిక స్థితి తల్లకిందులవుతున్నా సరే… మరీ ఈ రేంజ్ విమర్శ నీచాభిరుచి, సంస్కారరాహిత్యం…

జయలలిత బతికి ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు చేస్తే ఆ నేతను తన్నితగలేసి ఉండేదని డీఎంకే కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది… పళనిస్వామి కూడా ఈ నాయకుడిని ఎప్పుడూ మందలించడం లేదు ఎందుకని ప్రశ్నించింది…

నిన్నో మొన్నో బీహార్ సీఎం కావాలని అనుకుంటున్న ఆర్జేడీ బాస్, లాలూ కొడుకు తేజస్వి యాదవ్ కూడా ఓ పిచ్చి కూతకు దిగాడు… తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాడట… అసలు మతి ఉన్న మాటలేనా..? అది సాధ్యమేనా..? 2.84 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు..? పిచ్చాసుపత్రిలో చేర్చాలి తనను…

చెప్పేవాడికి వినేవాడు లోకువ… రాజకీయ నాయకుడికి ప్రజల విజ్ఞత అంటే లోకువ… ఇలాంటి  పిచ్చి కూతల్లో, చేతల్లో మమతా బెనర్జీ టాప్… మొన్న మెడికల్ విద్యార్థినిపై హత్యాచారం జరిగితే… అసలు అర్థరాత్రి ఆమె బయటికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది… ఇక ఆ కేసు దర్యాప్తు ఎలా జరగనుందో అర్థం చేసుకాల్సిందే…

అంతేకాదు, మొన్న జలపాయిగుడి ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తి తీవ్రంగా నష్టపరిస్తే… ఆమె ఇందులో కూడా బీజేపీని, మోడీని తిట్టడానికి ఏమీ దొరక్క భూటాన్ మీద పడింది… భూటాన్ నిర్లక్ష్యం కారణంగా వరదలు సరిహద్దులు దాటి బెంగాల్‌లోకి వచ్చిపడ్డాయట…

భూటాన్ పరిహారాలు చెల్లించాలట… ఇంకా నయం, సరిహద్దుల్లో భూటాన్ నీళ్లు బెంగాల్‌కు రాకుండా పెద్ద పెద్ద కరకట్టలు కట్టాలని డిమాండ్ చేయలేదు… తక్షణమే భూటాన్2తో సంబంధాలు తెంచుకోవాలని మోడీని కూడా నిలదీయలేదు… సంతోషం…

ఇవీ రీసెంటు మూడు ఉదాహరణలు… వీళ్లు మన రాజకీయవేత్తలు… ఖర్మ..! సర్లెండి, ఆ ట్రంపుతో పోలిస్తే వీళ్లెంత ఫాఫం… తన వాచాలత్వంలో వీళ్లు వన్ పర్సెంట్ కూడా కారు అంటారా..? అదీ నిజమే లెండి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మల్లోజుల లొంగుబాటు ఓ సంచలనమే… మావోయిస్టు చరిత్రలో మలుపు..?!
  • *ఫ్రీ మిక్సర్లు, గ్రైండర్ల, మేకలు, ఆవులు… అంతేకాదు, ప్రతివాడికీ ఫ్రీ భార్య..!!
  • ఎములాడ రాజన్న గుడి అభివృద్ధిపై ఓ దిక్కుమాలిన కార్యాచరణ..!!
  • తప్పుడు కేసులో 43 ఏళ్ల జైలు… ఎట్టకేలకు నిర్దోషి… కానీ మరో అన్యాయం..?
  • ఈ దర్శనం అమూల్యం… ఇది కళ్లకు తెలియని ఓ భక్తి పారవశ్యం…
  • ఆ స్వరం Gata rahe mera dil అంటూ గుండెల్లో మారుమోగుతూనే ఉంది…!
  • సానుభూతి వేరు… వోట్లేసే లెక్క వేరు… పాత ప్యాటర్న్ చెప్పేది ఇదే…
  • బిలియనీర్స్ బంకర్..! అణుయుద్ధం బూచిగా… ఇదో కమర్షియల్ స్కామ్..!!
  • విశ్వనాథుడి మరో సంగీత కెరటం… శృతిలయలు చక్కగా కుదిరిన కథ…
  • మునుగోడుకు సపరేట్ ముఖ్యమంత్రి, సొంత ఎక్సయిజు రాజ్యాంగం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions