.
( గోపు విజయకుమార్ రెడ్డి
) ….. కనీసం కాంగ్రెస్ పార్టీ అన్ని బీసీ సంఘాలతో మాట్లాడి… బీసీ బంద్‌ను దీపావళి తరువాత పోస్టపోన్ చేసి ఉండాల్సింది… ఎందుకంటే..?
సాధారణంగా వ్యాపార వర్గాలల్లో టాప్ 10 మార్కెట్స్ (ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, కొచ్చిన్, జైపూర్)… టాప్ 6 మెట్రోస్ అనీ ఉంటాయి… ఈ సిటీలు 80:20 రేషియో అనే బిజినెస్ ఫార్ములా మీద నడుస్తాయి, అంటే దేశీయ్ంగా 80% వ్యాపారం అయితే 20% ఈ పట్టణాలు, నగరాల నుంచి వస్తుంది…
Ads
ఇప్పుడిప్పుడే ఈ జాబితాలో లక్నో, పాట్నా చేరుతున్నాయి… ఒకవైపు కేంద్ర బీజేపీ పెద్దల సహకారంతో, వాళ్ల సొంత రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ కి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ, టాప్ 3 సిటీస్ ఇన్ ది కంట్రీ స్టేటస్ కి ఎంతో దూరంలో లేదు…
ఇంకోవైపుఈ వ్యాపార సమీకరణాలేవీ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని… బెంగుళూరు, హైదరాబాద్ ఈ రేసులో వెనుక పడిపోతున్నాయి, అందుకు నిన్నటి బంద్ చక్కటి ఉదాహరణ… కేరళ హై కోర్ట్ చెప్పినట్టు బందులు రాజ్యంగా విరుద్ధం, బలవంతగా షాప్స్ ఆఫీసులు ముసివేయడం ప్రజల ప్రాథమిక హక్కులని హరించడమే…
నిన్నటి బంద్ విషయానికి వస్తే … కనీసం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా ఆలోచించాల్సింది… బంద్ డేట్ మార్చుకోవటానికి ప్రయత్నించాల్సింది… ఎందుకంటే దీపావళి ముందు దంతేరాస్ వ్యాపారులకి పెద్ద రోజు, ఆ రోజు కనీసం రెగ్యులర్ డేస్ కన్నా 1000 కోట్లు ఎక్కువ బిజినెస్ జరుగుతుంది, పైగా అదంతా టైం బౌండ్ బిజినెస్ (ఆ రోజు ప్రత్యేకత వలన జరిగే వ్యాపారం ) కాబట్టి purchase పోస్టుపోన్మెంట్ జరుగదు…
నిన్నటి బంద్ వలన రాష్టానికి దాదాపు ప్రత్యక్ష లేదా పరోక్షంగా పన్నుల రూపంలో వచ్చిన నష్టం దాదాపు 300 కోట్లు, ఇది కేవలం రాష్ట్ర ఖజానాకి జరిగిన నష్టం, ఇక వ్యాపార వర్గాలది లెక్కేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది..,
ఒక ముఖ్యమయిన బిజినెస్ డే అనవసరంగా కోల్పోవలసి వచ్చింది… దాని పర్యవసానం రిటైల్ రంగం మీద పెద్ద దెబ్బ… పాపం రిటైల్ వ్యాపారాలు ముందు నుంచే ఎన్నో అడ్వర్టైజ్‌మెంట్లు ఆఫర్లు పెట్టి, చివరకి కనీసం వాళ్ల షాపులు కూడా తెరుచుకోలేని దురవస్థ…
నిన్నటి బందు రెండు రోజులు ఆగి, అనగా దీపావళి తర్వాత బంద్ జరుపుకుంటే అందరికీ బాగుండేది… దీనివల్ల పైన చెప్పుకున్నట్టు దేశ దీపావళి వ్యాపారంలో హైదరాబాద్ వాటా తగ్గినట్టే కదా ( ఉదాహరణకి ఒక జువెలరీ షాప్, ఒక ఆటో మొబైల్ డీలర్, ఒక టీవీ హోం అప్లయన్స్ షాప్, ఒక మొబైల్ షాపు, ఒక బట్టల దుకాణానికి దీపావళి పండగ ముందు సెలవు రోజు గానీ, షాపులు ముసివేస్తే గానీ వచ్చే నష్టాన్ని ఉహించుకోండి )…
గమనిక…. తమ రిజర్వేషన్ల ఆకాంక్షలు, ఆందోళనలకు వ్యాపారవర్గాలు కూడా మనస్పూర్తిగా సహకరించేవి దీపావళి తరువాత రోజు అయి ఉంటే.,.! ఆల్రెడీ దసరా సీజన్ వ్యాపారం సరిగ్గా జరగక చాలా షాప్స్ దీపావళి మీద సేల్స్ మీద హోప్స్ పెట్టుకున్నాయి…
పైగా పండుగ సేల్స్ పడిపోవడం అనేది బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ కి కూడా మంచిది కాదు, ఎందుకంటే, దేశంలో అన్ని ప్రధాన నగరలకన్నా హైదరాబాద్ సిటీ సేల్స్ బంద్ వలన తగ్గిపోవటం, బిజినెస్ సెంటిమెంట్ ని పాడు చేస్తుంది…!! ఎలాగూ అన్ని పార్టీలూ బంద్‌కు సహకరించాయి కదా, అందుకని నెగెటివ్ ఇంపాక్ట్ రాష్ట్రం మీద పడకుండా జాగ్రత్తపడి ఉండాల్సింది..!!
అన్నట్టు… ధన త్రయోదశి రోజున భారత్ లో….
ఒకే రోజులో రూ. 60,000 కోట్ల విలువైన 46 టన్నుల బంగారం, వెండి అమ్మకాలు ₹ 15000 కోట్లకు పైగా… 5 లక్షల బైక్‌లు డెలివరీ… 100,000 కార్ల డెలివరీ… ఇదీ దీపావళి మార్కెట్..!
Share this Article