.
మొన్న ఓ పిల్లాడు… అత్యుత్సాహంతో అమితాబ్ కేబీసీలో (17 జూనియర్) అడుగుతున్న ప్రశ్నలకు వేగంగా సమాధానాలు చెప్పిన తీరు చూశాం కదా… ఫాఫం, రూపాయి కూడా ఇంటికి తీసుకుపోలేదు… తను అమితాబ్ ఎదుట వ్యవహరించిన తీరు మీద కొన్ని వేల పోస్టులు, ట్రోలింగు…
చివరకు పేరెంటింగ్ మీద బోలెడన్ని పాఠాలు సోషల్ మీడియాలో… సరే, మళ్లీ మనం ఆ చర్చలోకి వెళ్లాల్సిన పనిలేదు గానీ… అదే హాట్ సీటులో కూర్చున్న మరో పిల్లాడి గురించి చెప్పుకోవాలి… సూపర్ కిడ్… వివరాలు వింటూ అమితాబ్ కూడా స్టన్నయిపోయాడు…
Ads
మహారాష్ట్ర, డొంబివిలీ నుంచి వచ్చాడు హర్షిల్ శర్మ… మిగతా ప్రశ్నల మాటెలా ఉన్నా… వేగంగా సమాధానాలు చెప్పాల్సిన సూపర్ సందూక్ రౌండ్ గురించి ఓసారి చూడాలి నిజానికి… చదవడం కాదు… ఇదుగో… వీడియో లింక్…
అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పగలిగితే అమితాబ్ ఇంట్లో విజేత కుటుంబానికి డిన్నర్ ఆఫర్… ఆ పిల్లాడు అంటాడు, నేను గెలిస్తే నాకు పన్నీర్ బిర్యానీ పెట్టాలి అని..!
అసలు అమితాబ్ ప్రశ్న అడగడం కూడా పూర్తి గాకముందే ఆ అబ్బాయి కంప్యూటర్‌పై వేగంగా ప్రశ్న చదివేసి, ఆప్షన్లు చదివేసి… సమాధానం చెప్పడం… ఎంత స్పీడ్… షార్ప్ బ్రెయిన్… మొత్తం జవాబులు వేగంగా చెప్పేశాడు… డిన్నర్ చాన్స్ గెలిచాడు…
అవునూ, మీ అబ్బాయి అభిషేక్ బచ్చన్ కాళీధర్ లాపతా సినిమాలో చూపినట్టు ఇంట్లో కూడా బిర్యానీ ప్రియుడా అనడుగుతాడు… అవును, రోజూ తింటాడు ఇంట్లో, సో, నీకు పన్నీర్ బిర్యానీ పెట్టడం మాకు ప్రాబ్లం ఏమీ లేదు, ఐనా నీకు ఎక్సట్రా చీజ్ బిర్యానీ పెట్టిస్తానులే అంటాడు అమితాబ్ ప్రేమగా…
నిజానికి ఇదంతా కాదు… ఆ అబ్బాయి ఇప్పటికి నాలుగు పుస్తకాలు రాసినట్టు, పబ్లిష్ చేసినట్టు ఓ ఫోటో చూసి, నిజమేనా అనడుగుతాడు అమితాబ్… కాదు, సార్, నాలుగు కాదు, ఎనిమిది రాశాను అంటాడు పిల్లాడు… అంతేకాదు, తన డ్రైవ్‌లో మరో మూడు పుస్తకాలు రెడీగా ఉన్నాయని చెబుతూ… తనకు అందుబాటులో ఉన్న ప్రతి లైబ్రరీని తనెలా వాడుకునేవాడో, పుస్తకాలు ఎలా చదివాడో వివరించాడు…
వావ్..,. సూపర్ కిడ్… కొందరు ఈ జనరేషన్ పిల్లల్ని చూస్తే నిజంగానే ఓ విభ్రమ… చదివిన పాఠాలే సరిగ్గా గుర్తుండని వయస్సులో ఏకంగా పుస్తకాలే రాసేయడం ఆసక్తికరమే… ఒకటైతే ఒకేరోజులో పూర్తి చేసేశాడట…! సరే, ఆ పిల్లాడికి ఎదురైన మరికొన్ని ప్రశ్నలు, జవాబుల మీద ఆసక్తి ఉన్నవాళ్లు ఈ కింద టైమ్స్ వార్త లింక్ చదవొచ్చు…
Share this Article