Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చార్మినార్ భాగ్యలక్ష్మి…! ఫాఫం బీఆర్ఎస్ పాట్లు, అగచాట్లు, ఇక్కట్లు..!!

October 20, 2025 by M S R

.

చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి హరీష్ రావు వెళ్తున్నాడట… ఎందుకట..?

జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక కదా, వెళ్తాడు, బీఆర్ఎస్ ముఖ్య నేత కదా, ఇంకా ఏ వేషాలైనా వేస్తాడు…

Ads

ఎహె, అత్యంత భక్తిపరుడు, అంత మాటన్నావేమిటి..?

పొలిటికల్ లింక్డ్ భక్తి మాత్రమే…

ఛ, నిజమా..?

అవును, అప్పుడెప్పుడో 2019లో వెళ్లాడు…

వెళ్లాడు కదా, భక్తే కదా.,.?

భక్తే, వోట్ల భక్తి, హిందూ సమాజాన్ని మభ్యపెట్టే భక్తి… 2020 గ్రేటర్ ఎన్నికల కోసం కృత్రిమ భక్తి…

ఎహె, కాదులే, ధర్మచింతన, పాపభీతి ఉన్నోడు…

కరెక్టు… పాపభీతి ఉన్నోడు… మజ్లిస్‌తో అంటకాగీ కాగీ, హిందూ సమాజాన్ని హెకిల్ చేసీ చేసీ, పాప నివారణ కోసం, అదే సమయంలో వోట్ల భక్తి కోసం భాగ్యలక్ష్మి జపం…

అదేమిటి..? అంత మాటన్నావు..?

అదే కరెక్టు… గ్రేటర్ ఎన్నికలొచ్చేసరికి, బండి సంజయ్ దూకుడుగా రంగంలోకి దిగాడు… నువ్వు మజ్లిస్ కార్యకర్తవా కేసీయార్ అంటూ ఉరుముతూ భాగ్యలక్ష్మి గుడి దగ్గర నిలబడి సవాల్ చేశాడు, అసలే అర్బన్ వోటర్.,. దాంతో ఠారెత్తిపోయింది కేసీయార్‌కు… అందుకే పాపాల భైరవుడు హరీష్ రావును పంపించాడు…

మరిా కేటీయార్‌ను పంపించి ఉండొచ్చు కదా, తన నెత్తుటి మగ రాజకీయ వారసుడు…

అబ్బే, అది నాస్తిక కేసులే… ఇలాంటి పనులకు కట్టుబానిస ఉన్నాడుగా… ప్రపంచంలోకెల్లా అత్యంత భీకర, భయంకర హిందూ అని చెప్పుకునే ప్రచారం చేశాడు, మజ్లిస్ దాసుడనే పేరు చెరుపుకోవడం కోసం… భాగ్యలక్ష్మి అనే పేరే ఒవైసీ అండ్ కో అస్సలు నచ్చదుగా…

సరే, సరే, మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు భాగ్యలక్ష్మి టెంపుల్‌కు, పైగా శ్రీనివాస యాదవ చక్రవర్తి కూడా వెళ్తాడట…

వెళ్తారు… జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక కదా… మజ్లిస్ వోట్లు కాంగ్రెస్‌కు పడబోతున్నాయి… కనీసం హిందూ వోట్లను సంఘటితం చేసుకునే ఓ కుటిల, విఫల ప్రయత్నం…

అలా సంఘటితం చేసుకోవడానికి ఎలాగూ బీజేపీ ఉందిగా….

పిచ్చోడా… అది  కిషన్ రెడ్డి ఇలాఖా… లేటు అభ్యర్థి ఎంపిక, ఇప్పటికీ ప్రచారం లేదు, ఎవ్వడూ పట్టించుకోలేదు… పైగా తను కేసీయార్ ఆత్మీయుడు… ఆ పార్టీ అసలు పోటీలోనే లేదు కదా… లోపాయికారీగా బీఆర్ఎస్ గెలిస్తే చాలు అనుకునే బాపతు రాజకీయం నడుస్తోంది…

అరెరె, బండి సంజయ్ ఉంటే బాగుండేది…

అలా ఉండకూడదనే కదా… హైకమాండ్ కేసీయార్ మీద దయతో బండి సంజయ్‌ను తప్పించేసి, కిషన్ రెడ్డి సారు గారిని అధ్యక్షుడిని చేసింది… పైగా ఇదంతా తన ఎంపీ ఏరియా…

సరే, ఇదంతా సరే… కాంగ్రెస్‌కు హిందువుల వోట్లు అవసరం లేదా..? రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి టెంపుల్ వెళ్తాడా..? మజ్లిస్‌కు కోపం తెప్పిస్తాడా..?

బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారీగా ఒక్కటయ్యాక… ఇక భాగ్యలక్ష్మి గుడి దగ్గర రేవంతుడి పాత్ర అవసరం లేదు కదా… అఫ్‌కోర్స్, కవిత వెళ్తుందేమో… అభ్యర్థి నవీన్ యాదవ్ వెళ్తాడేమో… ఏమో, చివరకు రేవంతుడూ వెళ్తాడేమో… బీఆర్ఎస్, బీజేపీ అక్రమ సంబంధం ఎండగట్టడానికి..!!

కానీ ఏమాటకామాట… ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండి ఉంటే… ఆహా, కథ వేరే ఉండేది..!!

అవునూ, ఫామ్ హౌజులో పడుకున్న కేసీయార్ నిజంగానే అరివీర భీకరమైన హిందూ కాదంటావా..?

ఏమో, ఎవరికి తెలుసు..? హిందూగాళ్లు బొందుగాళ్లకు తెలుసు… రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి వ్యాఖ్యలకు తెలుసు… అందుకే కదా… ఆయుత చండీయాగ స్థలి మంటల్లో కాలిపోయింది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘గంధర్వగళం..! జీవితంలో మొదటిసారి ఈ గొంతుకతోనే ప్రేమలో పడ్డాను’’
  • చార్మినార్ భాగ్యలక్ష్మి…! ఫాఫం బీఆర్ఎస్ పాట్లు, అగచాట్లు, ఇక్కట్లు..!!
  • సూపర్ కిడ్..! కేబీసీలో జవాబు చెప్పే వేగం చూస్తే… నిజంగా ఓ విభ్రమ..!!
  • మూడు నటసింహాల భీకర గర్జన… ప్చ్… తెలుగు జనం పట్టించుకోలేదు…
  • దీపావళి… రెండు ఊళ్ల పేరూ అదే… ఓ ఇంట్రస్టింగు కథ…
  • ట్రంప్‌ పాలనపై అమెరికా ఎల్లెడలా భగ్గుమంటున్న ప్రజాగ్రహం..!!
  • తెర విడిచిన, తెర మరిచిన ఆ ఇద్దరితో… ఓ కొత్త జటాధరుడు..!!
  • అత్తిల్లు, పుట్టిల్లు కాంగ్రెస్..! కమలదళంలో చేరిన ఆరేళ్లకే మంత్రి..!!
  • దీపావళి అమ్మకాలకు దెబ్బ… రెండ్రోజులు బంద్ వాయిదా వేస్తే బాగుండేది…
  • చిరంజీవిని బతికించారు… సినిమా కూడా ఎంచక్కా బతికిపోయింది..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions