.
వర్ష నిర్వహించే కిసిక్ షో ప్రోమో చూస్తుంటే… అందులో హరితేజ చెబుతోంది… ఈ బిగ్‌బాస్‌కు ఓ దండం, మళ్లీ రమ్మన్నా పోను, అసలు చూడటమే మానేశాను అని… ఓసారి టాప్ ఫైవ్, మరోసారి వెళ్లివచ్చింది, డబ్బులొచ్చాయి, ఐనా ఏమిటీ విరక్తి..?
మునుపెన్నడూ లేనంత ఏవగింపు ఈ బిగ్‌బాస్ 9వ సీజన్ మీద కనిపిస్తోంది… ఎస్, మరీ దిగజారిపోయింది… 6, 7, 8 సీజన్లు ఫ్లాప్ కావడంతో ఆ ఫ్రస్ట్రేషన్‌లో దిక్కుమాలిన అగ్నిపరీక్ష తంతు నిర్వహించి, కామనర్లను ఆరేడుగురిని ప్రవేశపెట్టడంతో అసలు పెంట మొదలైంది… జనం ఛీత్కరించారు… వరుసగా ఆ వికెట్లు పడిపోయాయి… ముగ్గురు మిగిలినట్టున్నారు…
Ads
ఆ ఫ్రస్ట్రేషన్‌లో మునిగి ఈసారి కంట్రవర్సీ కేరక్టర్లను ప్రవేశపెట్టారు… ఆల్రెడీ రీతూ చౌదరి ఉందక్కడ… తనపై అనేకానేక ఆరోపణలతో కంట్రవర్సీ చేసింది మీడియా… ఏదో కసి ఉన్నట్టు… ఇక దివ్వెల మాధురి మీద సోషల్ మీడియా నీచంగానే ట్రోల్ చేసింది… ఆమె కేరక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం…
మరో కేరక్టర్ పికిల్స్ రమ్య… ఆమె అంతకు ముందు ఎవరు..? ఏమీ కాదు, ఎవరో ఓ కస్టమర్‌ను ఏదో తిడుతూ ఓ పోస్ట్ పెడితే, ఇక దుమ్ముదుమారం సోషల్ మీడియాలో… దెబ్బకు సోషల్ సెలబ్రిటీ అయి కూర్చుంది.,. మరొకరు ఆయేషా… తమిళ బిగ్‌బాస్‌లో కాస్త కంపు చేసిన కేరక్టరే… ఏరి కోరి వీళ్లందరినీ తీసుకొచ్చిది బిగ్‌బాస్ టీమ్…
పేరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు… ఫైర్‌స్టారమ్ అట… ఇద్దరో ముగ్గురో మగపోరగాళ్లు కూడా వచ్చారు కానీ ఒకరికి అసలు తెలుగే రాదు, మరో ఇద్దరు ఉన్నారో లేదో హౌజ్‌మేట్స్‌కే తెలియదు… హౌజ్ మొత్తం అరుపులు, కేకలు, రంకులు, బూతులు… మొత్తానికి పెంట పెంట చేశారు హౌజును… చేస్తూనే ఉన్నారు…
- ఓ వీడియోలో సెలబ్రిటీ అస్ట్రాలజర్ వేణుస్వామి చెప్పినట్టు… ‘‘సోషల్ మీడియా, మీడియా కొందరు అనామకుల్ని హఠాత్తుగా నెగెటివ్ ట్రోలింగుతో సెలబ్రిటీలుగా మారుస్తోంది… బిగ్‌బాస్ ముడిసరుకులను మీడియా, సోషల్ మీడియాయే ఉత్పత్తి చేసి, హౌజులోకి పంపిస్తోంది…’’
ఇంతా చేస్తే ఏమైనా రేటింగులు పెరిగాయా..? పాపులర్ అయ్యిందా..? లేదు, జనంలో ఓరకమైన అసహ్యం… కాస్తోకూస్తో పద్ధతిగా ఉన్నది ముగ్గురు నలుగురు పాత సెలబ్రిటీలే… నిజానికి మాధురిని అంత నెగెటివ్‌గా చూపించారు కదా, ఆమె కూడా వచ్చిన కొత్తలో పిచ్చిపిచ్చిగా అందరినీ డామినేట్ చేయడానికి ప్రయత్నించింది (బిగ్‌బాస్ టీమ్ స్క్రిప్టే) కానీ తరువాత ఆమె గేమ్ బాగుంది…
రమ్య, ఆయేషాలకన్నా బెటరే… రమ్య నోరు పెద్ద, ఆట దిబ్బ… ఆయేషాకు నోరు పారేసుకోవడమే… తన కామెడీతో హౌజును, బయట ప్రేక్షకులకు కాస్త బాగానే ఎంటర్‌టెయిన్ చేస్తూ అందరితో ఎస్ అనిపించుకున్న ఇమాన్యుయేల్ అసలు రూపం ఇప్పుడు బయటపడుతోంది…
అఫ్‌కోర్స్, ఎండ్ ఆఫ్ ది డే ఎవరి ఆట వారిదే… రాము రాథోడ్‌ను సేవ్ చేసి, భరణిని బలి తీసుకోవడం, తనతో బాగుండే తనూజను దూరం చేసుకోవడం ఎట్సెట్రా… బట్, తన పోటీదారులు, తన ఆట మీద తనకు క్లారిటీ ఉంది, టాప్ ఫైవ్‌లో ఉంటాడు, విన్నర్ బరిలో ప్రధాన కంటెండర్ తను…
- చాన్నాళ్లు ఉండదులే అనుకున్న సంజన ఇప్పుడు గుడ్ గేమర్… ఎస్, చివరగా, ప్రధానంగా చెప్పుకోవాల్సింది తనూజ పుట్టస్వామి… రియల్ గేమర్… ఎమోషన్స్ ఉన్నాయి, సెన్సిటివ్, ఏ టాస్కూ వదిలేయదు, పద్ధతిగా మాట్లాడుతుంది… కన్నడిగ అయినా సరే, తెలుగులో ఫ్లూయెంట్… ఇప్పటి సిట్యుయేషన్‌ను బట్టి ఆమె ఆల్రెడీ విజేత…
తరువాత బిగ్‌బాస్ పైత్యం ఎలా మారుతుందో, ఆమెను ఎప్పుడు బలి తీసుకుంటారో తెలియదు, చూడాలి..! ఆల్రెడీ ఆమె మీద రకరకాల కామెంట్లు చేయిస్తూ, వాటిని ప్రయారిటీతో ప్రసారం చేస్తూ బిగ్‌బాస్ వాడూ ఓ గేమ్ స్టార్ట్ చేశాడు..!! చివరగా… మొదటి నుంచీ ఉన్నవాళ్లే గెలవాలి, నడమంత్రపు కేరక్టర్లు నడిమిట్లోనే ఎగిరిపోవాలి… కనీసం ఆ సూత్రమైనా పాటిస్తాడు ఈ బిగ్‌బాస్ గాడు..!?
Share this Article