.
ఏదో ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి చెబుతున్నాడు… ‘‘సుడిగాలి సుధీర్‌ను ఫ్రై చేస్తుంటాం టీవీ షోలలో… అలాగైతేనే జనం చూస్తున్నారని స్క్రిప్టులు రాసేవాళ్లు, టీమ్స్ చెబుతుంటాయి… ఇష్టం లేకపోయినా ఫ్రై చేస్తూనే ఉంటాం… తనేమీ ఫీల్ కాడు, స్పోర్టివ్… జనాన్ని ఎంటర్‌టెయిన్ చేయడమే కదా మన పని అంటాడు…’’
నిజమే… ఆహా ఓటీటీలో కామెడీ ఎక్స్‌ఛేంజ్ చేశారు ఇద్దరూ కలిసి… జీ సరిగమప లిటిల్ ఛాంప్స్ చేస్తున్నారు… తనతో వర్క్ చేసే అనిల్ రావిపూడి మాత్రమే కాదు, ప్రతి కోఆర్టిస్టు చెప్పే మాట ఇదే… ఓ ప్లేబాయ్‌గా చూస్తూ అందరూ జోక్స్ వేస్తారు, చివరకు డ్రామా జూనియర్స్ షోలో పిల్లలతో కూడా తనపై పంచులు వేయించారు… అందరూ ఎంటర్‌టెయిన్ ఫీలవుతారు, తనూ సరదాగా నవ్వేస్తాడు…
Ads
ఓ రేర్ క్వాలిటీ… నిజానికి తను సినిమా హీరోయే… ఐనా డౌన్ టు ఎర్త్… యాంకర్, హోస్ట్ అయ్యాక సక్సెస్ అవుతాడా అనుకున్నారు అందరూ… అసలే అక్కడ స్టార్ యాంకర్ ప్రదీప్ ఉన్నాడు, పోలిక వస్తుంది… బట్ హిట్… అఫ్‌కోర్స్, ప్రదీప్, సుధీర్‌ల హోస్టింగు తీరు వేరు… ప్రదీప్ అంటే ప్రదీప్ అంతే… స్పాంటేనిటీ, ఎనర్జీ, పంచులతోపాటు ఎక్కడా అసభ్య, అశ్లీల పదాల జోలికి పోడు…
సుధీర్ ఈ ప్లేబాయ్ అనే ఓ వినోద ఇమేజ్ పక్కన పెడితే… మంచి డాన్సర్, మంచి మెజీషియన్, మంచి స్టంట్‌మ్యాన్, మంచి కమెడియన్… ఇప్పుడు మంచి హోస్ట్… వెరసి మంచి పర్‌ఫామర్… తోటి ఆర్టిస్టులంతా ప్రేమించే తనకు యాంకర్ రష్మితో మంచి దోస్తీ… వాళ్లద్దరి కెమిస్ట్రీ తెలుగు టీవీ షోలలో సూపర్ హిట్ జోడీ…
ఇవన్నీ వోకే, కానీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… సరిగమప లిటిల్ చాంప్స్‌లో ఓ మూడున్నరేళ్ల నేత్ర వైకల్యం ఉన్న అమ్మాయి… పేరు వరుణవి… ఆమెతో పాడిస్తూ, ఎవరూ తమ జడ్జిమెంట్లలో ఆమె వైకల్యాన్ని ప్రస్తావించవద్దని, ఆమె తట్టుకోలేదని ముందే జడ్జిలను ప్రిపేర్ చేశాడు… ఓసారి ఆ అమ్మాయిని ఎత్తుకుని, ఆమెతో కలిసి ఓ పాట కూడా పాడాడు…
అందరూ ముగ్దులయ్యారు… ఆ పాపను సంతోషపెట్టడం ప్రధానం… ఈ తాజా ఎపిసోడ్ ప్రోమో చూస్తుంటే దానికి నీహారిక, ఐశ్వర్య రాజేష్, ప్రియదర్శి కూడా హాజరైనట్టు కనిపించింది… అందరూ ఎమోషన్ ఫీలయ్యారు ఆ పాటతో… తరువాత సుధీర్ మాట్లాడిన మాటలతో…
‘‘మా చిన్నప్పుడు ఏం చెప్పేవారంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయనేవాళ్లు… తరువాత కొంచెం పెద్దయ్యాక ఏం చెప్పారంటే, పూర్వజన్మ పాపాలు ఈ జన్మలో అనుభవించాలనేవాళ్లు… ఇప్పుడు ఏం చెబుతున్నారు..? ఈ జన్మలో పాపాలే ఈ జన్మలో అనుభవించాలి అని…
మూడున్నరేళ్ల పాప ఏం పాపాలు చేసింది..? దేవుడెందుకిలా శిక్షించాడు ఆమెను..? అహ్మదాబాద్ ఫ్లయిట్ ప్రమాదంలో శిశువులు కూడా మరణించారు..? వాళ్లేం పాపాలు చేశారు..? మరి ఏమని అర్థం చేసుకోవాలి ఇవన్నీ…?
సగం లైఫ్ ఆల్రెడీ అయిపోయిన నాలాంటోళ్లకు శిక్షలు వేస్తే వోకే, ఇంకా ఏమీ తెలియని, లైఫ్ చూడాల్సిన చిన్న పాపలకు దేవుడు వేసిన శిక్షలు ఏమిటో మరి’’…. ఇదీ తన వ్యక్తీకరణ… బాగుంది సుధీర్… టచింగ్..!!
Share this Article