.
ఆహా… ఎంత కమనీయ దృశ్యం… ఈ దేశ రాష్ట్రపతి, ఓ ఆదివాసీ మహిళ… భక్తిగా ఇరుముడి ధరించి శబరిమల అయ్యప్పను దర్శించిన సీన్… అపురూపం…
ఆలయ మర్యాదలను భంగపరిచి, హిందూ సంస్కృతికి వ్యతిరేక సుప్రీం వెలువరించిన ఓ చెత్తా తీర్పు ఆసరా చేసుకుని… తమదైన హిందూ వ్యతిరేకతను కనబరిచి, రుతుమహిళల ప్రవేశం సహా నానారకాలుగా గుడిని భ్రష్టుపట్టించి, కిలోల కొద్దీ బంగారం కాజేసిన…. సోకాల్డ్ ధూర్త సీపీఎం పినరై విజయన్ ప్రభుత్వ ధోరణికి చెంపపెట్టు రాష్ట్రపతి శబరిమల దర్శనం…
Ads

- అదే రుతుమహిళల్ని ప్రవేశపెట్టడానికి నానా ప్రయత్నాలూ చేసిన ఓ తిక్క, చెత్త, పిచ్చి మహిళను (జర్నలిజం అట) పోషించి, కోట్ల ప్యాకేజీ ఇచ్చి, ఈరోజుకూ అశ్లీల వీడియోలతో ఎంకరేజ్ చేసే కేసీయార్ సోషల్ మీడియా క్యాంపుకీ ఇది చెంపపెట్టు…
విషయానికి వస్తే… రాష్ట్రపతి ప్రయాణించే హెలికాప్టర్ హెలిప్యాడ్ దగ్గర కుంగిపోయే ప్రమాదం… నో, నో, హిందూ ద్వేషి, సీపీఎం సీఎం పినరై విజయన్ కుట్ర ఏమీ లేకపోవచ్చు… జస్ట్, పదీపదిహేను మంది ముందుకు తోస్తే సెట్ రైట్ అయిపోయింది…

అయిపోవాలి, అయిపోతుంది… ఎందుకంటే… ఆమె ధర్మవర్తని కాబట్టి… ఎవడో కూశాడు, ఎవడో రాశాడు… సోకాల్డ్ మనువాద బీజేపీ సూత్రాలకు వ్యతిరేకంగా ఓ మహిళ శబరిమల దర్శనం ఏమిటీ అని…!
ఇలాంటి ఇడియట్లకు ఈ దేశంలో కొరత లేదు… శబరిమల దర్శనానికి చిన్న పిల్లలు లేదా 50 ఏళ్లపై బడిన మహిళలు… అంటే రుతుమహిళలు కానివాళ్లు అర్హులు అనేది ఆ దేవస్థాన నియమావళి… ఆమె వయస్సు 67 ఏళ్లురా నాయనా..?

ఈ దేశ ఆధ్యాత్మిక సంస్కృతిని గౌరవించి, తనే స్వయంగా శబరిమల వచ్చిన తొలి రాష్ట్రపతి ఈమె… సోకాల్డ్ ఈ సెక్యులర్ రాష్ట్రపతుల్లో ఒక్కడూ ఈ సంస్కృతిని గౌరవించలేదు… ఇరుముడి నెత్తిన పెట్టుకుని, ఆ మెట్లు ఎక్కి ఆమె ఈ దేశ ఆధ్యాత్మిక సంస్కృతికి శిరస్సు వంచింది.., నువ్వు గ్రేట్ తల్లీ…
- చాలామంది వెధవలు నువ్వు రాష్ట్రపతి కాగానే… రాష్ట్రపత్ని అని వెక్కిరించారు… తెలంగాణ మూర్ఖ రాజకీయాలు, సోకాల్డ్ ఆయుత చండీయాగ శుష్క వీర భక్తగణం కూడా నీకు వ్యతిరేకంగా ఇంకెవరినో సపోర్ట్ చేశాయి… ఆదివాసీ వ్యతిరేక, మనువాద ధోరణి ప్రదర్శించి చావుదెబ్బ తిన్నాయి… ఎస్, ఆ కేసీయార్ గురించే చెప్పేది…

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న ఒక మారుమూల గ్రామం ఊపర్‌బేడా... ఇక్కడి సంతాల్ అనే ఆదివాసీ తెగలో, ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆమె పేరు ద్రౌపది….
పౌరాణిక వైశిష్ట్యం ఉన్న ఆ పేరు పెట్టుకోవడానికి ఆమె గర్వపడిందే తప్ప, బాధపడలేదు… కౌన్సిలర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా, చివరకు దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అధిరోహించడం… ఇది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన భారతదేశపు అసలైన సౌందర్యం!
https://www.facebook.com/reel/1482299189688067
మట్టి మనిషి: ‘డౌన్ టు ఎర్త్’ అంటే ఇదే
ఆమె జీవితంలో విషాదాలు కూడా ఉన్నాయి—భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోయిన తీరని దుఃఖం. అయినా సరే, ఆ బాధను దిగమింగి ప్రజాసేవకు అంకితమైన పట్టుదల ఆమెది…

అయితే, భారత ప్రజాస్వామ్య గొప్పదనాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటిన అద్భుత ఘట్టం ఆమె రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారైనప్పుడు జరిగింది… దేశంలోని అత్యున్నత పదవికి ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటించిన వెంటనే, ఆమె హుందాగానో, హడావుడిగానో ప్రెస్ మీట్ పెట్టలేదు… బదులుగా, ఆమె అత్యంత సహజంగా, నిరాడంబరంగా తన స్వగ్రామానికి సమీపంలోని ఒక శివాలయం వద్దకు వెళ్లింది…
చీపురు పట్టుకుని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసింది… ఆ తర్వాత దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుని, ప్రదక్షిణలు చేసింది… రాష్ట్రపతి కాబోయే వ్యక్తి… చేతిలో చీపురు పట్టుకుని, దేవుడికి కృతజ్ఞతగా గుడి శుభ్రం చేయడం! ఈ దృశ్యం దేశమంతటా ఎంతోమంది హృదయాలను కదిలించింది… డౌన్ టు ఎర్త్…

తన నేపథ్యాన్ని, తన మూలాలను ఎన్నటికీ మర్చిపోని గొప్ప గుణం ఆమెది… అధికార హోదా ఆమె వ్యక్తిత్వాన్ని మార్చలేకపోయింది… అట్టడుగు వర్గాల నుండి వచ్చిన మనిషి… అత్యున్నత శిఖరాన్ని చేరుకున్నా కూడా, తన సేవా దృక్పథాన్ని, వినయాన్ని, అణకువను కోల్పోలేదనేందుకు ఈ ఘటనే గొప్ప ఉదాహరణ…
మన సుప్రీం కోర్టు ధోరణి తెలుసు కదా… మన దేశ ఆనవాయితీలు, సంప్రదాయాలు, సంస్కృతులకు విరుద్ధంగా వ్యవహరించడమే న్యాయం అని భావించే ఓ భ్రమాత్మక సత్యం… శనిశింగాపూర్, శబరిమల… వాట్ నాట్… చివరకు… వెళ్లి నీ దేవుడికి చెప్పుకోపో అనే అహంకారం దాకా…
కోట్ల మంది దక్షిణ భారత దైవం అయ్యప్పను సందర్శించిన భారతీయ ముఖ్య ప్రతినిధులు లేరు గతంలో… ఓసారి ఉపరాష్ట్రపతి వీవీ గిరి దర్శించినట్టు తెలుసు… చివరకు సోకాల్డ్ భారతీయ ఆధ్మాత్మిక, రాజకీయ, సాంస్కృతిక ప్రతినిధిగా చెప్పబడే మోడీ కూడా శబరిమలకు పోలేదు… అందుకే…
ఎస్, ఈ దేశ మూలవాస మహిళా ప్రతినిధి, రాష్ట్రపతి ద్రౌవది ముర్ము శబరిమల దర్శనాన్ని ‘ముచ్చట’ మనస్పూర్తిగా అభినందిస్తోంది… అమ్మా, హేట్సాఫ్..!! నువ్వు ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థ నిజ సౌందర్యానివి..!!
https://www.facebook.com/share/r/1FdEnhyx8u/
Share this Article