.
ఒక సినిమా… నాణ్యత మీద బోలెడు మంది రివ్యూయర్లు బోలెడు అభిప్రాయాలు రాస్తారు… సోషల్ మీడియాలో ప్రొఫెషనల్ రివ్యూయర్లు గాకుండా ఇతరులూ తమకు నచ్చింది రాస్తారు… ఇది కామన్…
రివ్యూలు ఓ సినిమాను పైకి లేపవు, ఓ సినిమాను తొక్కేయలేవు… ఎటొచ్చీ దీన్ని గుర్తించే విజ్ఞత సినిమా ప్రముఖులకు ఉండాలి, కానీ ఉండదు… అఫ్‌కోర్స్, ఉండాలని ఆశించడమూ కష్టమైపోతోంది…
Ads
కోట్లు ఖర్చు పెట్టి, జనంలోకి వదిలి, లాభం కోరుకునే సినిమా వ్యాపారులకు నెగెటివ్ రివ్యూలు రుచించకపోవడంలో అర్థముంది… కాకపోతే బహిరంగ వేదికల మీద బూతులంకించుకోవడమే ప్రాబ్లం…
కోపం ఎప్పుడూ సంస్కారాన్ని, సహనాన్ని చంపేస్తుంది కదా… ఈమధ్య కే-ర్యాంప్ అని ఓ సినిమా వచ్చింది, కిరణ్ అబ్బవరం హీరో… సినిమా ఎలా ఉన్నా, అందులో వీకీ నరేష్ కేరక్టరైజేషన్ మీద చాలా విమర్శలు వచ్చాయి, సరే, నరేష్‌కు ఎలాగూ డ్యాష్ డ్యాష్ లేదు… కానీ పబ్లిక్ డొమైన్‌లోకి ఆ సినిమా వదులుతున్నప్పుడు కాస్త అశ్లీలరహితంగా ఉండేలా చూసుకోవాల్సి ఉండింది నిర్మాతలకు, దర్శకులకు…
ఆ నిర్మాత రాజేష్ దండా ఏమంటున్నాడంటే..? ‘‘సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది… ఇక ఆ వెబ్‌సైట్ ఇంకా ఏడుస్తోంది… వాడికి చెబుతున్నా, అమెరికాలో ఉన్న ప్రదీప్‌గా… పగలగొడతా… నీకేం తెలుసురా లు** కా… డ్యూడ్‌కు 196.K అని నా సినిమాకు మాత్రం 47K అని వేస్తున్నాడు… అది తెలుగు, తమిళ్‌లో రా కుక్కా… తొక్కుతావా… సినిమాని తొక్కురా నువ్వు మగాడివైతే… మొగోడిగా చెబుతున్నా మళ్లీ.., ఒక హిట్టు సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు…ఈ నా***ని ఏం చేయాలి? ఉరి తీయాలి వీడిని నడిరోడ్డు మీద… మా మీద బతికే నా*** ’’
సినిమా క్వాలిటీకి, వసూళ్లకు లింక్ లేదు గానీ… ఈ సినిమాకు మూడే రోజుల్లో 10 కోట్ల దాకా వసూళ్లున్నాయి, ఓ చిన్న సినిమాకు ఇవి పెద్ద వసూళ్లే… డౌట్ లేదు… Dude తో పోలిస్తే తక్కువే కావచ్చు… కానీ నిర్మాత భాషే తీవ్ర అభ్యంతరకరం… అదీ బహిరంగ వేదిక మీద… ఈమధ్య చాలామంది సినిమా సెలబ్రిటీలు ఏదేదో కూస్తున్నారు, ఇదీ పెద్దగా తేడా లేదు… కానీ, పర్టిక్యులర్‌గా ఆ వెబ్ సైట్ మీదే ఏమిటీ కోపం అనేదే ఆశ్చర్యం… ప్రమోషన్‌కు డబ్బులిచ్చి భంగపడ్డారా..?
ఎందుకంటే..? 1) మామీద బతికేవాడు 2) కావాలని తొక్కుతున్నాడు 3) ఉరి తీయాలి 4) మొగోడివైతే తొక్కురా… ఆ ఒక్క సైటు మీదే ఏమిటీ ఆగ్రహం..? కావాలని టార్గెట్ చేసి రాస్తున్నాడా..? దేనికి..? అది తప్పే, అయితే, అదే నిజమైతే ఒక నిర్మాత ఏం చేయాలి..? ఇదీ అసలు ప్రశ్న…
కేరళలో ఆల్రెడీ రివ్యూ బాంబింగ్ పేరిట కోర్టులో కేసు నడుస్తోంది… రివ్యూలే నాలుగు రోజులు వద్దనుకుంటే సోషల్ మీడియాలో సమీక్షల్ని ఎలా ఆపేది..? మార్కెట్‌లోకి వచ్చిన సరుకు నాణ్యత మీద అభిప్రాయం వినియోగదారు హక్కే కదా..? మరి సినిమా రిలీజ్ సమయంలో రాయించుకునే పెయిడ్ పాజిటివ్ రివ్యూల మాటేమిటి..? బోలెడు ప్రశ్నలు… అన్నట్టు టాలీవుడ్‌కు ఓ ఫిలిమ్ ఛాంబర్ ఉంది కదా, ఎనీ రెస్పాన్స్..!?
Share this Article