Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ అక్కినేని సినిమా ఎందుకు తన్నేసిందో… ఓ స్టడీ అవసరం…!!

October 23, 2025 by M S R

.
Subramanyam Dogiparthi….. సినిమా విశ్లేషకులకు ఈ అగ్నిపుత్రుడు సినిమా ఓ కేస్ స్టడీ . ఫిలిం శిక్షణాలయాలలో ఈ సినిమా ఎందుకు ఎలా సక్సెస్ కాలేదో అధ్యయనం జరగాలి .

ఎందుకు అధ్యయనం అంటే : రకరకాల ఆవేశ పూరిత , విప్లవ భావాల కధలను నేయటంలో సిధ్ధహస్తులు పరుచూరి బ్రదర్స్ . వాళ్ళే ఈ సినిమాకూ కధను నేసారు . డైలాగులనూ వ్రాసారు . దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకుడు . ఎన్నో ఢక్కామొక్కీలను తిన్న సీనియర్ నటుడు అక్కినేని , తమిళ చిత్ర రంగ దిగ్గజం శివాజీ గణేషన్ నటించారు ఈ సినిమాలో .

వీటన్నింటినీ మించి అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో అక్కినేని పెద్ద కుమారుడు వెంకట్ నిర్మాత . ఆయనకూ చిత్ర నిర్మాణంలో చాలా అనుభవం ఉంది . సాధారణంగా వీళ్ళందరూ ఒక కధను వినగానే అది హిట్టవుతుందా లేక ఫట్టవుతుందా చాలావరకు చెప్పేయగలరు .

Ads

ఒకవేళ హిట్ కాకపోయినా , డబ్బులు రాకపోయినా కళాఖండాలుగా మిగిలిపోతాయి . అదీ స్వాగతీయమే . ఉదాహరణకు ఏకవీర , మేఘసందేశం సినిమాలు . కానీ , ఈ అగ్నిపుత్రుడు సినిమా ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ముగుస్తుందో అంతా హాశ్చర్యమే .

  • సినిమా ప్రారంభంలో ఆనందభైరవి సినిమా లాంటిదేమో అని అనిపిస్తుంది . మొదలయ్యాక రొటీన్ విలన్లు ఎంటరయిపోతారు . మధ్యలో ఎర్ర వీరులు వచ్చేస్తారు . సినిమా ఎరుపవుతుంది . చివర్లో ఎరుపు గొప్పా లేక కాషాయం గొప్పా క్లియరుగా చెప్పరు . ఎరుపుని కాషాయాన్ని ధవళాన్ని కలగాపులగం చేసేసారు .

కధ ఏంటంటే : హరి హర భరద్వాజ చైతన్య గురుకులానికి పీఠాధిపతి అవుతారు . సనాతన ధర్మ ప్రేమికుడే కానీ ఛాందసుడు కాదు . ధర్మం ఏదయినా అది జనం కోసం , ముఖ్యంగా పేదల కోసం అని త్రికరణశుధ్ధిగా నమ్మే వ్యక్తి . ఆయనకూ కొందరు విలన్లు ఉంటారు . ఒకరు గోతి కాడ నక్క అయితే మరోకరు పేదల్ని పీక్కుతినే జమీందారు రాబందు .

వాళ్ళకు కంట్లో నలుసు అవుతాడు భరద్వాజ . రొటీన్ సినిమాల్లో లాగా భరద్వాజ మీద చేయని నేరాలను మోపుతారు . సినిమా అష్టకష్టాలపాలు చేస్తారు . ఈలోపు కాలేజీలో చదివే భరద్వాజ కొడుకు జైలుకు వెళ్ళటం , అక్కడ చైతన్య అనే విప్లవకారుడు కలవటం , హరికృష్ణ మోహన్ బాబుకు అప్పచెప్పినట్లు ఎర్ర జెండాని భరద్వాజ కొడుక్కి హేండోవర్ చేయటం జరుగుతుంది .

ఇంక కధ క్లైమాక్సుకు వచ్చేస్తుంది . విలన్లు విజృంభిస్తారు . భరద్వాజను గాయపరుస్తారు . క్లైమాక్స్ ఫైటింగులో ఖైదీలో చిరంజీవిలాగా నాగార్జున రెచ్చిపోయి అందరినీ Ak 47 తో కాల్చిపడేస్తాడు . భరద్వాజ విలన్ సత్యనారాయణని వధించేస్తాడు .

ధర్మం కోసం చేసా కాబట్టి తప్పు కాదంటాడు . అధర్మాన్ని అణచివేయటానికి హింసకు పాల్పడవచ్చని గీతలో శ్రీకృష్ణుడు బోధించాడని చెపుతాడు . సనాతన ధర్మ పరిరక్షణను , పేదల సంక్షేమాన్ని ప్రస్తుత ప్రభుత్వాలు లాగా రెండు కళ్ళుగా చూసుకోమని కొడుక్కి చెప్పటంతో సినిమా ముగుస్తుంది . ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటారు . అలా కాషాయం , ధవళం , ఎరుపు కలిసిపోతాయి . వెలిసిపోతాయి.

భరద్వాజగా ANR , ఆయన ధర్మపత్నిగా శారద బాగా నటించారు . ఆయన కుమారునిగా నాగార్జున బాగానే కష్టపడ్డాడు . నాగార్జున , రజని జోడీ చాలా అందంగా ఉంటుంది . రజని చాలా హుషారుగా నటించింది . అతిధి పాత్రలో విప్లవమూర్తిగా శివాజీ గణేషన్ సినిమాకు ఎట్రాక్షన్ .

విలన్లుగా సత్యనారాయణ , గొల్లపూడి , చలపతిరావులు నటించారు . కృష్ణవేణి అక్క కూతురు రజిత ఈ సినిమా ద్వారానే పరిచయం చేయబడింది . ఇతర ప్రధాన పాత్రల్లో నూతన్ ప్రసాద్ , పి యల్ నారాయణ , డబ్బింగ్ జానకి , రాళ్ళపల్లి , చాట్ల శ్రీరాములు , కృష్ణవేణి , ముచ్చెర్ల అరుణ , జ్యోతి , సుత్తి వేలు , వై విజయ , ప్రభృతులు నటించారు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలు బాగుంటాయి . దర్శకేంద్రుని పాటల చిత్రీకరణ నైపుణ్యం కనిపిస్తుంది . కమలం కమలం కన్నులలో మధురం మధురం పెదవులలో , ఎర్ర ఎర్రని బుగ్గ మీద , ముద్దుకో ముద్దెట్టు డ్యూయెట్లు బాగుంటాయి . చీరెలు విడిచిన వనితల్లారా అంటూ సాగే కాలేజి యువతీయువకుల పాట హుషారుగా ఉంటుంది .

ఎర్ర ఎర్రని బుగ్గ మీద పాట చిత్రీకరణ రాఘవేంద్రరావు శైలిలో అలరిస్తుంది . తప్పెట్ల వర్షం కురుస్తుంది . హృదయం ఢమరుకం ప్రజ్వరిల్లగా అంటూ సాగుతుంది క్లైమాక్సులో నాగార్జున మీద పాట . జయాయ జయభద్రాయ అంటూ సూర్య స్తోత్రంతో సినిమా ప్రారంభం అవుతుంది .

  • మిత్రులకు ఎవరికయినా అనిపించవచ్చు . సక్సెస్ కాని సినిమా గురించి నేనెందుకు ఇంత విశ్లేషణ వ్రాసానని . ఇంత మంది అతిరధ మహారధులు , ఉద్దండులు ఉన్నా సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతాయో అనే అంశానికి కేస్ స్టడీ ఈ సినిమా అని చెప్పేందుకు .
  • అయిననూ ANR , రజని , శారద , నాగార్జున అభిమానులు ఒక ప్రయత్నం చేయవచ్చు . యూట్యూబులో ఉంది . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎవరు ఈ సతీష్ జార్కిహోళి..? ఈ కొత్త పేరుతో డీకేకు చెక్..!!
  • ఆత్మరక్షణ, తుపాకీ కాల్పులు, వెహికిల్ బోల్తాలు… చెరువులో దూకి ఆత్మహత్య..!!
  • ఈ అక్కినేని సినిమా ఎందుకు తన్నేసిందో… ఓ స్టడీ అవసరం…!!
  • మోస్ట్ అవకాశవాది వర్సెస్ ఓ స్కూల్ డ్రాపవుట్… ఎవరు సీఎం..?!
  • రేవంత్ కొరడా పట్టుకుంటే తప్ప మూతపడని అవినీతి చెక్ పోస్టులు..!!
  • లక్కీ రేవంత్‌ రెడ్డి… ప్రాజెక్టులు ఫుల్… రికార్డు స్థాయి చీప్ పవర్, పంటలు..!
  • మాజీ డీజీపీ, మాజీ మంత్రి ఇంట్లో ఓ రంకు యవ్వారం… కథేమిటంటే..?!
  • సుడిగాలి సుధీర్ టచింగ్ వర్డ్స్..! ఆ షోలో అందరూ ఎమోషనల్..!!
  • ‘‘ఈ పాటకు పల్లవి లేదు, చరణం లేదు, సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేనేలేదు…’’
  • వాడిని నడిరోడ్డుపై ఉరితీద్దాం సరేగానీ… అసలు కోపకారణం ఏంటి బ్రదర్..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions