.
శిల్పా శెట్టి అంటే..? మొదట్లో ఓ మోడల్, ఓ సినిమా నటి… తెలుగులో కూడా రెండోమూడో సినిమాలు చేసింది… వెంకటేశ్ సరసన ఓ మత్స్యకన్య పాత్రతో గుర్తుండిపోయింది…
తరువాత… బాలీవుడ్ పాపులర్ స్టార్… యోగా వీడియోలతో ఇంకా పాపులర్… ఫిట్‌నెస్, యోగా ప్రాముఖ్యత మీద ఆమె చేసిన వీడియోలు, డీవీడీలు శిల్పాస్ యోగ పేరిట చాలా ప్రసిద్ధం…
Ads
“ది గ్రేట్ ఇండియన్ డైట్” (The Great Indian Diet) వంటి హెల్తీ లైఫ్ స్టయిల్ పుస్తకాలు కూడా రాసింది… సోషల్ మీడియాలో చాలా యాక్టివ్… ఇంకా..? ఆమెకు మరో మొహం ఉంది… అది కాస్త వికృత కోణం…
1. ₹60 కోట్ల మోసం కేసు (Fraud Case)… శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రా డైరెక్టర్లుగా ఉన్న ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యాపార విస్తరణ కోసం తన దగ్గర 60 కోట్లు తీసుకుని, వ్యక్తిగతంగా వాడేసుకున్నారని దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త ఫిర్యాదు…ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది… దీనికి సంబంధించి వారిపై లుకౌట్ సర్క్యులర్ (LOC) కూడా జారీ చేయబడింది…
2. రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల (Adult Content) నిర్మాణంలో, వాటిని మొబైల్ యాప్‌ల ద్వారా ప్రసారం చేయడంలో పాలుపంచుకున్నారని 2021లో ముంబై పోలీసులు ఆయనను అరెస్టు చేశారు… కొన్ని నెలలు జైలులో ఉండి, తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు…
3. 2017లో జరిగిన ‘గెయిన్ బిట్‌కాయిన్ పోంజి స్కీమ్’ కేసుతో రాజ్ కుంద్రాకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి… ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాకు చెందిన సుమారు ₹97.79 కోట్ల విలువైన ఆస్తులను (జుహులోని శిల్పా శెట్టి ఫ్లాట్‌తో సహా) ఈడీ అటాచ్ చేసింది…
4. 2013లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) స్పాట్-ఫిక్సింగ్ కేసులో రాజ్ కుంద్రా పేరు వినిపించింది… ఈ కేసులో సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ రాజ్ కుంద్రాపై క్రికెట్ సంబంధిత కార్యకలాపాల నుండి జీవితకాల నిషేధాన్ని విధించింది…
.
ఇప్పుడు వాళ్ల ఇంకో కోణంలోకి వెళ్దాం… ఆమె మంచి బిజినెస్‌వుమన్… ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్ బాస్టియన్ (Bastian) ఆమెదే… లావిష్… అంటే విలాసవంతమైన… ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే పెద్ద వైభోగ రెస్టారెంట్…
దీని గురించి ప్రముఖ రచయిత్రి శోభా డే రీసెంటుగా ఏమంటున్నదీ అంటే… ‘‘బాస్టియన్ రెస్టారెంట్‌లో ప్రతి రాత్రి ₹2 నుండి ₹3 కోట్లు వరకు టర్నోవర్ (వ్యాపారం) జరుగుతుంది.,. “స్లో నైట్”లో టర్నోవర్ ₹2 కోట్లు ఉంటుంది… వారాంతాల్లో (వీకెండ్‌లలో) అది ₹3 కోట్లకు చేరుకుంటుంది…
కస్టమర్‌లు ఒక్క రాత్రి భోజనానికే లక్షల్లో డబ్బులు ఖర్చు చేస్తున్నారు అక్కడ… ఆ రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్‌లు లంబోర్గిని (Lamborghini), ఆస్టన్ మార్టిన్ (Aston Martin) వంటి ఖరీదైన కార్లలో వస్తున్నారు… అక్కడ Waiting List కూడా ఉంటుంది…
ఈ రెస్టారెంట్ 21,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది…360-డిగ్రీల్లో సిటీని చూడొచ్చు… ఒక్క సీటింగ్ 700 మందితో, రెండు సీటింగ్‌లలో మొత్తం 1,400 మందికి సేవలు అందిస్తుంది… రెండు అంతస్థులు…
నేను ఆ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న 700 మందిలో ఒక్క పరిచయస్తుడు కూడా కనిపించలేదు… అందరూ యువకులు, ఖరీదైన, అత్యుత్తమ టకీలా (Tequila) బాటిళ్లను ఆర్డర్ చేస్తున్నారు… కేసులూ గీసులూ జాన్తానై… అవి అలా నడుస్తూనే ఉంటాయి… ఆమె వ్యాపారం అలా పచ్చగా సాగిపోతూనే ఉంటుంది…! ప్రముఖ వ్యక్తులకు ఆమె రెస్టారెంట్ ఓ హ్యాంగవుట్ ఇప్పుడు…!!
Share this Article