Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎహెఫో… ట్రంపుకి ఇండియా తాజా సందేశం… రష్యాలో భారీ యూరియా ప్లాంట్…

October 26, 2025 by M S R

.

ట్రంపు వంటి వాచాలుడు పిచ్చి కూతలకు దిగుతాడు… మోడీ వంటి కార్యసాధకుడు చేతల్లో చూపిస్తాడు… ఇదీ ఓ మిత్రుడి వ్యాఖ్య… భారత్- రష్యాల భారీ యూరియా ప్లాంటు ఏర్పాటును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్య ఇది…

ఇండియాను తన కాళ్ల మీద పడేసుకోవడానికి ట్రంపు అనే — చేయని ప్రయత్నం లేదు… తనకు మద్దతు ఇచ్చినందుకు మోడీ ఎన్నిసార్లు తనలోతనే లెంపలేసుకున్నాడో కూడా తెలియదు… కాకపోతే సైలెంటుగా ఇండియా పావులు కదుపుతోంది… ఎహె ఫోరా ట్రంపుగా అన్నట్టుగా కదులుతోంది…

Ads

ఇంకా అమెరికా అగ్రరాజ్యం అనే భ్రమల్లోనే ఉంది, ప్రపంచం మీద ఇంకా అదే పెత్తనం చలాయించే పోకడతోనే ఉంది… అందుకే టారిఫులు అంటూ ప్రతి దేశాన్నీ బెదిరిస్తోంది… ధూర్త ఉగ్ర పాకిస్థాన్‌లతో అంటకాగుతూనే ఉంటుంది…

దానికి ప్రపంచబ్యాంకు సాయం అందుతుంది, ఉగ్రవాద సాయానికి సంబంధించి ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ ముద్ర పడకుండా ట్రంపు కాపాడతాడు… మోడీ నా దోస్తు, చెప్పినట్టు వింటాడు అనే పిచ్చికూతలకూ దిగుతాడు… ఈ స్థితిలో “భారత్–రష్యా యూరియా ప్లాంట్” ప్రపంచ మార్కెట్‌ను షాక్ చేసిన వ్యూహాత్మక కదలిక…

చమురు కొనడమే కాదురా, ఇంకా ముందుకెళ్తాం, రష్యాతో దోస్తీ విషయంలో… ఇదీ ట్రంపుకి ఇండియా ఇస్తున్న సందేశం, సంకేతం… ఈ అడుగు ఇండియా ఆర్థిక స్వావలంబన, వ్యూహాత్మక భద్రత దిశలో మంచి అడుగు…

భారత ప్రభుత్వ సంస్థ RCF , నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (IPL) వంటి ఇతర ఎరువుల సంస్థలతో కలిసి రష్యాలో 2 మిలియన్ టన్నులకు పైగా యూరియాను ఉత్పత్తి చేయగల ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి… ఇది భౌగోళిక-ఆర్థిక వ్యూహంలో ఒక భారీ మలుపు…

ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత భారత్‌కి యూరియా దిగుమతులపై ఆధారపడే అవసరం గణనీయంగా తగ్గుతుంది… ప్రస్తుతం భారత్ ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల విలువైన ఎరువులను దిగుమతి చేసుకుంటుంది… ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా, దిగుమతులపై ఖర్చు తగ్గించడం, సబ్సిడీలను స్థిరపరచడం ద్వారా 10– 15 సంవత్సరాల్లో 30 బిలియన్ డాలర్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది…

భారత్ స్పష్టమైన సందేశం – మేము మా దారిలోనే నడుస్తాం… భారత్ ఈ నిర్ణయంతో చైనా, అమెరికా ఆధారిత మార్కెట్‌ల నుండి బయటపడే ప్రయత్నం… ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు — భారత్ ఆహార భద్రత, రైతు సంక్షేమం…

అంతేకాదు, డాలర్ ప్రభావం, విలువ తగ్గించే దిశలో.,. రూపాయి- రూబుల్ విలువ పెంచడం ఇది… రష్యా కూడా భారత్ ద్వారా ఇతర దేశాలకు 25– 50 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిపే అవకాశం ఉంది…

.

🇮🇳🇷🇺 ముఖ్య వివరాలు…

లక్ష్యం: ఇది భారతదేశపు మొదటి విదేశీ ఎరువుల తయారీ వెంచర్.

ఉత్పత్తి సామర్థ్యం: ఈ ప్లాంట్ సంవత్సరానికి 2 మిలియన్ టన్నులకు పైగా యూరియాను ఉత్పత్తి చేస్తుందని అంచనా.

తాజా పురోగతి: ప్రభుత్వ ఫర్టిలైజర్ సంస్థలు రష్యన్ భాగస్వాములతో నాన్-డిస్‌క్లోజర్ ఒప్పందాన్ని (NDA) కూడా కుదుర్చుకున్నాయి… ఈ ప్రతిపాదిత వెంచర్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా డిసెంబర్‌లో ప్రకటించే అవకాశం ఉంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎహెఫో… ట్రంపుకి ఇండియా తాజా సందేశం… రష్యాలో భారీ యూరియా ప్లాంట్…
  • శ్రీ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి… అయ్యో, కేసు పెట్టేసి జైళ్లో వేస్తారా..?!
  • కృష్ణ సాహసి..! ఆరోజుల్లో ఎన్టీయార్‌ను ఢీకొట్టడం అల్లాటప్పా కాదు మరి..!!
  • ఎస్… రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ, మద్దతు ఇవ్వకపోతే… మొదటికే మోసం.,.!!
  • దమ్మున్న జర్నలిస్టు అంటే..? సీఐఏకే చుక్కలు చూపించిన ఈ కేరక్టర్..!!
  • ఒక మంచి ప్రేమకథ… కథలో లీనమైతే కళ్లు తడిపేసే ‘ప్రేమకథ’…
  • తాష్కెంట్-2… ఓ విఫల కుట్ర… నిజంగా మోడీని పుతిన్ రక్షించాడా..?!
  • శంఖు పుష్పం..! అందం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం… వ్యాపారం..!!
  • పదండి పోదాం, పదండి తోసుకు… పోదాం పోదాం వెనక్కి వెనక్కి…!!
  • ప్రపంచ టాప్-3 సైంటిస్టుల జాబితాలో… వరుసగా మూడేళ్లూ స్థానం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions