Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ పాకిస్థానీ ప్రేమికుడికన్నా… మన ఇడ్లీ సాంబార్ నెత్తురే చాలా నయం…

October 27, 2025 by M S R

.

ఆమే నయం… నిజంగా ఆమే అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చునే అవకాశమొస్తే… భారతదేశం మనస్పూర్తిగా అది నిజమవ్వాలని కోరుకుంటుంది…

  • ఒకప్పుడు ఆమె అమెరికా ఉపాధ్యక్షురాలి పోటీలో ఉన్నప్పుడు ప్రేమతో, తమ బిడ్డ అనే అభిమానంతో ఆమె పట్ల ఆసక్తిని, ఆమె విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తపరిచింది ఈ దేశం… కానీ ఇప్పుడు ట్రంపు అనే ఓ బెడదను ఈ ఇండియన్ రక్తం దూరం చేయాలని బలంగా అభిలషిస్తోంది… అదే తేడా…
  • ప్రస్తుతం ఆమె వయస్సు 60 ఏళ్లు… వచ్చే ఎన్నికల్లో ఈసారి నేరుగా అధ్యక్ష పదవి రేసులో ఉంటుందా..? ఆమెను బీబీసీ ఇంటర్వ్యూలో ఇదే అడిగితే… “I am not done.” (నేను ఇంకా పూర్తి చేయలేదు/నా ప్రయాణం ముగియలేదు.) అని చెప్పింది… అంటే ఎస్, నేను ఆసక్తితోనే ఉన్నాను, అవకాశాల్ని వదలను అంటోంది పరోక్షంగా…

    Ads

    ఐతే అదంత సులభం కాకపోవచ్చు, కానీ ఆమె ప్రయత్నించకుండా ఉండదు… “I have lived my entire career as a life of service and it’s in my bones.” (నా కెరీర్ మొత్తాన్ని సేవకే అంకితం చేశాను, అది నా నరనరాన ఉంది.) అంటూ… అమెరికాకు త్వరలో ఒక మహిళా అధ్యక్షురాలు అవుతుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పింది…

    ఆ మహిళ ఈ మహిళేనా అని అడిగినప్పుడు, చిరునవ్వుతో “Possibly” (కావచ్చు/సాధ్యమే) అని సమాధానం ఇచ్చింది… తాను ఇంకా 2028 ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదని కూడా తెలిపింది, ఎందుకంటే, అది చాలా సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది…

    కానీ ప్రజాభిప్రాయ సర్వేల్లో మీకు అంత అనుకూలత లేనట్టుంది కదా అనడిగితే… నేను సర్వేలను విని ఉంటే, పట్టించుకుని ఉంటే… ఇక్కడి దాకా వచ్చి ఉండేదాన్ని కాదు అని చెప్పింది… If I listened to polls, I would have not run for my first office… అంటే, ఈ సర్వేలను పట్టించుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేననీ, పోరాడుతూనే ఉంటాననీ చెబుతోంది…

    ఆమె 107 డేస్ అని ఓ పుస్తకం రాసింది… దాని ప్రచారంలో భాగంగా బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చింది మొన్న… ఆ సందర్భంగానే ఈ ప్రశ్నలు,, ప్రస్తావనలన్నీ వచ్చాయి… హఠాత్తుగా అధ్యక్ష పదవి బరి నుంచి జో బిడెన్ తొలగిపోయాక… ఆమెకు అధ్యక్ష పదవి కోసం పోటీలో కేవలం 107 రోజుల ప్రచార సమయమే దక్కింది… ఆ 107 రోజుల్లో తన ప్రయాస, తన సవాళ్ల గురించి ఆ పుస్తకం రాసిందామె…

    ఇదే సందర్భంగా… 2028 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ నామినేషన్‌ను సాధించడానికి, అధ్యక్షురాలు కావడానికి ఆమె మనసులో ఒక బలమైన సంకల్పం ఉందని చెప్పినట్టయింది…

    అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నిలబడి, గెలవాలనీ, ఓ చరిత్ర సృష్టించాలనే బలమైన ఆకాంక్ష వెలిబుచ్చింది… 2024 ఓటమి నేర్పిన పాఠాలు, ట్రంపు పట్ల పెరుగుతున్న వ్యతిరేకత (దాదాపు 3 వేల చోట్ల ట్రంపు వ్యతిరేక ఆందోళనలు జరిగాయి ఈమధ్య) తనను 2028 ఎన్నికల్లో గెలుపు వైపు తీసుకుపోతాయని ఆమె ఆశ…

    ఆమె నేపథ్యం తెలుసు కదా… తల్లివి ఇండియన్ రూట్స్… పేరు శ్యామల గోపాలన్, హిందూ, డాక్టర్… బిడ్డ పేరు కూడా అలాగే పెట్టుకుంది… తండ్రి డొనాల్డ్ హారిస్‌ది జమైకా, ప్రొఫెసర్… కమలాహారిస్ భర్త యూదు మతస్తుడు… డగ్లస్ ఎమాఫ్… లాయర్… ఫస్ట్ సెకండ్ జెంటిల్‌మన్, అంటే ఉపాధ్యక్షురాలి భర్త… భిన్న ప్రాంతాలు, భిన్న వృత్తులు, భిన్న మతాలు… వసుధైక కుటుంబం మన కమలక్కది..! ఇడ్లీ సాంబార్ నెత్తురు..!!

    • అన్నట్టు… అబ్ కా బార్ ట్రంప్ సర్కార్ అని ప్రచారం చేసి భంగపడిన మోడీ మహాశయుడు ఇప్పుడు ఏమంటాడో..!!

    Share this Article



    Advertisement

    Search On Site

    Latest Articles

    • పవర్‌లో ఉంటే ప్రతిదీ క్విడ్ ప్రోకో… పవర్ ఊడిపోతే అందరూ క్విట్ పార్టీ…
    • చదరంగం కాదు, రణరంగం కాదు… ఇదొక దారుణరంగం…
    • మదనగోపాలుడు… సకల కళావల్లభుడిని దారికి తెచ్చుకున్న ఓ పడవ పిల్ల..!
    • ఆ పాకిస్థానీ ప్రేమికుడికన్నా… మన ఇడ్లీ సాంబార్ నెత్తురే చాలా నయం…
    • సంసారం యథాతథం… కానీ ఆ భార్యాభర్తల నడుమ 20 ఏళ్ల నిశ్శబ్దం…
    • కథలో పదే పదే వేలు పెట్టే స్టార్ హీరోకు ఆ దర్శకుడి భలే చురక..!!
    • ఎహెఫో… ట్రంపుకి ఇండియా తాజా సందేశం… రష్యాలో భారీ యూరియా ప్లాంట్…
    • శ్రీ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి… అయ్యో, కేసు పెట్టేసి జైళ్లో వేస్తారా..?!
    • కృష్ణ సాహసి..! ఆరోజుల్లో ఎన్టీయార్‌ను ఢీకొట్టడం అల్లాటప్పా కాదు మరి..!!
    • ఎస్… రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ, మద్దతు ఇవ్వకపోతే… మొదటికే మోసం.,.!!

    Archives

    Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions