.
అవును… పార్టీ అధికారంలో ఉంటే… నానా అడ్డమైన కమీషన్లు, తప్పుడు నిర్ణయాలు, ప్రజావ్యతిరేక చర్యలు… ఫాయిదా ఏమిటీ అంటే… క్విడ్ ప్రోకో… నీకేం కావాలి, నాకేం ఇస్తావ్…
అధికారికంగా ఎంతిస్తావ్..? బినామీ ఖాతాల్లో ఎంత జమచేస్తావ్..? అంతా ఇదే దందా… ఏ పార్టీ మినహాయింపు కాదు… బీఆర్ఎస్ దేశంలోని అన్ని పార్టీల్లోకెల్లా ముదిరిపోయిన టెంక ఈ విషయంలో…
Ads
ఒక దశలో 1600 కోట్ల పైచిలుకు పార్టీ అధికారిక నిధులు… దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి చేతకాలేదు ఈ ఘనత… మరి కేసీయార్ అంటే మాటలా..? ఇలాంటి విషయాల్లో సిద్ధహస్తుడు… అమాయక తెలంగాణ జనమే తన పెట్టుబడి…
సోకాల్డ్ స్టాలిన్, ఠాక్రే, మమత, జగన్, చంద్రబాబు వంటి కుటుంబ పార్టీలకే చేతకాలేని ఘనత… కేసీయార్ ది గ్రేట్… ఈరోజుకూ కొందరు మేధావులు, జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు…. పాపం శమించుగాక, సోకాల్డ్ మోడీ, అమిత్ షా కూడా… తమను వెనుక నుంచి తంతున్నా సరే… సిగ్గూశరం లేక ఇంకా భ్రమల్లో నుంచి రాలేని దురవస్థ… థాంక్స్ టు ది గ్రేట్ ఓ జాతీయ పార్టీ కిషన్ రెడ్డి…
సరే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, ఫ్లాప్… లోకసభ ఎన్నికలు, డిజాస్టర్… జనం ఛీత్కరించారు, కానీ పార్టీ నిధులు బాగానే ఖర్చయ్యాయి… బీఆర్ఎస్ మోడ్ ఎన్నికలు అంటేనే డబ్బులు, ప్రలోభాలు, కొనుగోళ్లు కదా… మరోసారి చెబుతున్నా, ఫాఫం తెలంగాణ జనం…
ఇప్పుడేమైంది..? జనం ఎహెఫోరా అని తిప్పికొట్టారు… ఉద్దరించావులే, ఇక చాలు అన్నారు… దారుణంగా ఉంది పార్టీ పరిస్థితి జనంలో…! అధికారంలో ఉన్నప్పుడు పనుల కోసం అడ్డగోలుగా పార్టీ విరాళాలు ‘ధారాదత్తం’ చేయాల్సి వచ్చిన కంపెనీలు, పెట్టుబడిదారులు కూడా మొహాలు చాటేశారు…
దాని ఫలితం ఏమిటో తెలుసా..?
ఒక దశలో ఒక సంవత్సరంలో 500 కోట్ల పైచిలుకు పార్టీ విరాళాలు….. అవి ఎలక్టోరల్ బాండ్స్ కావచ్చు, ఇంకేదో జనం కళ్లుగప్పే విరాళాలు కావచ్చు… ఆ స్థితిలోె ఉన్న బీఆర్ఎస్ కేసీయార్ ఆదాయం ఒకే ఏడాదిలో 15 కోట్లకు పడిపోయింది… అంటే 97 శాతం…
ఎందుకు…? జనం ఛీఫో అంటున్నారు, లోకసభ ఎన్నికల్లో జీరో రిజల్ట్… జనంలోకి రావడం లేదు తను… ప్రజలే తనకు రుణపడి ఉన్నారనే తిక్క భ్రమ, ఓ పర్వర్షన్… దాంతో అనుమతుల కోసం, పెద్ద దొర కరుణ కోసం కోట్లకుకోట్లు సమర్పించుకున్న వాళ్లు సైతం ఎహెఫో అనేయడం…
ఐనా సరే, ప్రాబ్లం లేదు… ఓ దశలో బిడ్డ పెళ్లికి వాళ్లనూ వీళ్లనూ చేతులు చాచి అడిగిన సూపర్ అధినేత (కవితే చెప్పింది)… ఈరోజు దేశంలోకెల్లా బలమైన కుటుంబ పార్టీ అధినేత… బినామీ, సొంతం, అధికారికం అన్నీ కలిస్తే వేలాదివేల కోట్లు… వందల ఎకరాలు… అద్భుతమైన సాధనసంపత్తి…
కేసీయార్‌కు తెలంగాణ జనం అమాయకత్వం భలే కనెక్టయింది… ఈ దేశంలో అవినీతి కుటుంబ ప్రాంతీయ పార్టీలు బోలెడు… వాటిల్లో నంబర్ వన్ కావడం అంత మజాకా..? యువార్ గ్రేట్ కేసీయార్… నువ్వొక ఉదాహరణ… తెలంగాణ జనం ఇంత ఇచ్చినా సరే, ఫామ్ హౌజులో మొహం చాటేసి, జనం సమస్యలు తెలిసినా అనుభవించనీ దరిద్రులు అనే భావనలో, మత్తులో మునిగి ఉండటం ప్రపంచంలోనే ఏ నాయకుడికీ చేతకాని ప్రతిభ..!!
మరీ 15 కోట్లకు విరాళాలు పడిపోవడం అంటేనే… మట్కా మార్కెట్ టైపు… ఇప్పట్లో అది కోలుకోదు అని అర్థం… బీజేపీ హైకమాండ్ దరిద్రపు కార్యాచరణ, కేసీయార్ బానిసగా వ్యవహార శైలి పుణ్యమాని కాస్త కేసీయార్ ఊపిరి ఉంది… మోడీషాకు నిజంగా చేతనైతే ఈపాటికే కేసీయార్ పార్టీ భూస్థాపితం అయ్యి ఉండేది… థాంక్స్ టు మోడీ…
వ్యక్తిగత సంపాదన వైట్ కావాలంటే…. వందల ఎకరాల్లో ఎకరానికి కోటి వ్యవసాయ ఆదాయం చూపించాలి… మీడియాను పిలిచి ప్లాంటెడ్ స్టోరీలు రాయించాలి… మరి పార్టీకి..? ఫండ్ రైజింగ్ అంటూ… నాయకులు బజార్లలో పడాలి, కూలీ పనులు చేయాలి, ఒక్కో అయిదారు నిమిషాల పనికి లక్షల కూలీ తీసుకోవాలి, చూపించాలి…
అడ్డగోలు ఫాయిదా చూపి, కంట్రాక్టర్ల దగ్గర… బినామీ, అధికారిక, పార్టీపరమైన, సొంత ఖాతాల వివరాలను పకడ్బందీగా చూపించాలి… క్విడ్ ప్రోకో అంటారు… అదే అధికారం నుంచి జనం తరిమేస్తే… కంపెనీలు, కంట్రాక్టర్లు కూడా క్విట్ పార్టీ అంటారు… సహజం… బీఆర్ఎస్ విరాళాలు 97 శాతం పడిపోవడం వెనుక మర్మం ఇదే, విశ్లేషణ ఇదే, నిజం కూడా ఇదే…
ఏదో ఈనాడు సైటులో ఓ వార్త… అంతే తప్ప, కేసీయార్ మీద ఒంటి కాలి మీద లేస్తున్న ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో వార్త ఏది… రిపోర్టింగ్ నెట్వర్క్ ఫెయిల్యూరా..? లేక రాధాకృష్ణ స్ట్రాటజిక్ సైలెన్సా..? సాక్షి సరేలే, అది నమస్తే సాక్షి కదా… అదెప్పుడూ తెలంగాణ వ్యతిరేకి కదా…!! యెల్లో మీడియాను మించి.,.!!! అవునూ… జూబిలీ హిల్స్ ఓడిపోతే… వచ్చే year ఏమిటి పరిస్థితి..?!
Share this Article