.
ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజులో కంపు రేపుతున్న, రేపిన రమ్య, మాధురి, కంట్రవర్సీ రీతూ తదితర కేరక్టర్లను కాసేపు వదిలేస్తే తనూజ బలమైన కంటెండర్… ఆమె బలాల్లో ఒకటి రమ్య, శ్రీజ, మాధురి, రీతూలతో పోలిక…
అసలు ఎవరీమె అని సెర్చితే… ఓ కన్నడ సినిమా కొత్త ప్రయోగం తెలిసింది… సినిమా ప్రేమికులకు ఇంట్రస్టింగ్ ప్రయోగం అది… ఆ సినిమా పేరు 6-5=2… అవును 2013 లోనే ఈ ప్రయోగం చేశారు… అందులోని ఆరు ప్రధాన పాత్రల్లో తనూజ ఒకరు, ఆమె డెబ్యూ మూవీ అది… ఆరు నుంచి అయిదు తీసేస్తే రెండా..? అవును, ఇది సినిమాటిక్ మ్యాథ్స్… అదెలాగో సినిమా చెబుతుంది…
Ads
జస్ట్, 30 లక్షలతో తీశారు ఈ కొత్త తరహా హారర్ సినిమాను… 5 కోట్లు వసూలు చేసింది పుష్కరం క్రితమే… సినిమాలో విశేషం పేరు ‘ఫౌండ్ ఫుటేజ్’ టెక్నిక్… ఈ సినిమాను ఎవరో కోల్పోయిన కెమెరాలో దొరికిన అసలు ఫుటేజ్ (Found Footage) మాదిరిగా చూపించారు… ఈ టెక్నిక్‌కు ‘ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’ (The Blair Witch Project) అనే హాలీవుడ్ సినిమా నుండి ప్రేరణ పొందారు…
కన్నడంలో ఈ తరహా జానర్‌లో వచ్చిన మొదటి సినిమా ఇదే… సినిమా విడుదల సమయంలో, ఇది 2010లో ఆరుగురు ట్రెక్కింగ్ వెళ్లిన వ్యక్తుల నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడిందనీ, రమేష్ అనే మరణించిన వ్యక్తి కెమెరాలో దొరికిన ఫుటేజ్ ఇది అని గట్టిగా ప్రచారం చేశారు…
ఈ ప్రచారం ప్రేక్షకులలో సినిమా పట్ల విపరీతమైన ఆసక్తిని పెంచింది… అయితే, ఇది పబ్లిసిటీ కోసం చేసిన ప్రచారం మాత్రమేనని, కథ పూర్తిగా కల్పితమని తరువాత తెలిసింది… సినిమాకు మరింత ‘రియల్’ లుక్ ఇవ్వడానికి, ఇందులో ఓపెనింగ్ లేదా ఎండ్ క్రెడిట్స్‌లో నటీనటుల పేర్లను, టెక్నీషియన్ల వివరాలను వెల్లడించలేదు… ఇది అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది…
ఈ కన్నడ సినిమా తెలుగులో ‘చిత్రం కాదు నిజం’ పేరుతో డబ్ చేయబడింది.., హిందీలో కూడా అదే ‘6-5=2’ పేరుతో రీమేక్ చేయబడింది… కన్నడం వెర్షన్ యూట్యూబులో ఉంది… తనూజ ఒకటోరెండో సినిమాలు చేసింది, తెలుగులో ముద్దమందారం అనే 1500 ఎపిసోడ్ల హిట్ సీరియల్ చేసింది… దాంతోనే పాపులర్ ఆమె..!
మనం సౌత్ సినిమా ప్రయోగాలు అనగానే మలయాళం, తమిళం గురించి చెప్పుకుంటాం… కానీ కన్నడంలో కూడా పుష్కరం క్రితమే (అప్పటికి కన్నడ సినిమా కర్నాటక దాటి పెద్దగా బయటికి రాలేదు…) ఇలాంటి ప్రయోగాలు చేశారని చెప్పడానికి ఈ వింత జానర్ సినిమా పరిచయం…!!
Share this Article