.
నిజం… ఈసారి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, ప్రాంతం, ఇతరత్రా ప్రభావాలూ, ప్రలోభాలు కూడా నిజం, అక్రమాలు నిజం… తమ సొంత వ్యవస్థల దుర్వినియోగమూ నిజం… స్థూలంగా ప్రెస్ క్లబ్ ఎన్నికల తంతు దారితప్పిందనేదీ నిజం…
నేనిక్కడ విజేతలు, పరాజితుల గుణాల్ని అంచనా వేయడం లేదు, విమర్శించడం లేదు… కానీ ఓ ప్రెస్ క్లబ్ ఎన్నికలు మరీ ఇంత దిగజారాలా..?
Ads
హఠాత్తుగా ఆంధ్రాలో సెటిలైన జర్నలిస్టులకు ఓటు హక్కు ఏమిటి..? గత ఏడాదికీ ఈ ఏడాదికీ ప్రామాణికత ఎందుకు మారింది..? అక్కడి నుంచి వాళ్లను తీసుకురావడానికి, మేనేజ్ చేయడానికి, గిఫ్టులకు, మందూమాకూ మర్యాదలకూ బోలెడు ఖర్చు జరిగిందనేదీ నిజం.,. ఓ జనరల్ ఎలక్షన్‌ను మించిన పటాటోపం ఏమిటసలు..?
ఒకడు యాంటీ బీసీ అనే ప్రచారం చేస్తాడు… మరొకడు యూనియన్లను బజారుకు లాగుతాడు… అసలు ఎవరున్నారు దీని వెనుక..? ఒక ప్యానెల్ గెలుపు వెనుక అదృశ్య శక్తి ఎవరు..? ఈ చర్చలు వదిలేసి… జర్నలిస్టులు వాట్సప్ గ్రూపుల్లో తన్నుకుంటున్నారు.,.
నిజమే… తోటి జర్నలిస్టు సంఘాలను బుడ్డెరఖాన్ సంఘాలు, కాళ్ల మధ్య దూరడం వంటి వ్యాఖ్యలేమిటి అసలు..? సంస్కారం అనే పదం దాకా అక్కర్లేదు గానీ, సదరు వ్యాఖ్యలకు బాధ్యత వహించాల్సిన యూనియన్ సిగ్గుపడాలి… ఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం… డౌట్ లేదు… చిన్న సంఘాలంటే అంటే అంత చిన్నచూపు ఏమిటి..? పెద్ద సంఘాలు ఉద్దరించింది ఏమిటి..?
ఎన్నికలంటే ఎవరో నిలబడతారు, నానా సమీకరణాల్లో ఎవడో గెలుస్తాడు, ఎవరో ఓడిపోతాడు… ఆఫ్టరాల్ ఓ కల్లు కంపౌండ్ ఎన్నిక ఇది… ఒకప్పుడు కాస్త ఆధార్, హెల్త్ క్యాంపులు కనిపించేవి… అవేమీ లేవుగా ఇప్పుడు… జస్ట్, హ్యాంగవుట్ల అడ్డా…
బుడ్డ సంఘాలు, బుడ్డెరఖాన్లు, విషసర్పాలు అని ఎవరో వ్యాఖ్యానిస్తే… మిగతా సంఘాలు కస్సుమంటుంటే… ఆ కుసంస్కారాన్ని ప్రశ్నిస్తుంటే…. సోకాల్డ్ ఆ యూనియన్ బాధ్యులు ఎందుకు స్పందించరు..? పరోక్షంగా సమర్థిస్తున్నారా..? ఎంత దరిద్రం..?
జనరల్ ఎన్నికల్లో కనిపించే దుర్వ్యసనాలు ఈ ఎన్నికల్లో వ్యాపించి దుర్గంధం వెదజల్లడం మీద ఎవరూ మాట్లాడటం లేదు… సమీక్ష లేదు… ఎవరో ఏదో అన్నారనే అంశంపైనే చర్చ… తప్పులేదు… తప్పును, దానిపై విమర్శలను సాదరంగా, సానుకూలంగా తీసుకుని, హుందాగా క్షమాపణ చెప్పే సోయి కూడా లేదు…
వీళ్లు జర్నలిస్టులకు సారథులు…? పిటీ… యూనియన్ల బాధ్యులే పత్రికలు పెట్టి… సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతే… ఇదేనా మీ జర్నలిస్టుల సంక్షేమ, హక్కుల పోరాట స్ఫూర్తి అని ఎవడూ అడగడు… మీ పోరాటాల్లో డొల్లతనం ఇదేనా అని ఎవడూ ప్రశ్నించడు…
ఆఫ్టరాల్, ప్రెస్ క్లబ్… 1200 లేదా 1300 వోట్లు… అందులో 200- 300 మంది హైదరాబాదులో లేనే లేరు… వారి సభ్యత్వం రద్దు కాదు, వారి ఓటు హక్కును ప్లాన్ ప్రకారం పునరుద్ధరిస్తారు… ఇవేమీ చర్చకు రావు… అసలు ప్రక్షాళన ఎందుకు జరగొద్దు..? అసలు ఈ యూనియన్ల గొడవేమిటి మధ్యలో…
అరె, బద్ధ వ్యతిరేకులైనా సరే సాక్షి, ఈనాడు సిస్టమ్స్ కలిసి పనిచేశాయి కదా… యాజమాన్యాలు వేరు, వాటి గొడవలు వేరు, వాళ్లు ఎంత తన్నుకుని, చంపుకున్నా సరే, మేం మాత్రం కలిసే ఉంటాం అంటున్నారు కదా…
జవహర్‌లాల్ హౌజింగ్ సొసైటీ రాజకీయాల్లాగే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ రాజకీయాలూ కంపు కొడుతున్నాయి… ఫాఫం తెలుగు జర్నలిస్టు..!!
Share this Article