.
బీఆర్ఎస్ క్యాంపు కాంగ్రెస్ వైపు ఒక వేలు చూపితే… నాలుగు వేళ్లు తనవైపే వెక్కిరిస్తూ చూపిస్తున్నాయి… దాదాపు ప్రతి అంశంలోనూ… అధికారంలో ఉంటే ఒక తీరు, ప్రతిపక్షంలో ఉంటే మరో తీరు…
జుబ్లీహిల్స్ ఎన్నికల తీరు ప్రబల ఉదాహరణ… కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మీద బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు… కానీ గురివింద గింజ తన డ్యాష్ కింద నలుపు ఎరుగదని సామెత కదా… అచ్చంంగా అది బీఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుంది ఇక్కడ…
Ads
బీఆర్ఎస్, కేటీయార్ మౌత్ పీస్ నమస్తే తెలంగాణ అనే కరపత్రిక ఏం రాసింది..? ఇది చూడండి…

తను రౌడీ షీటర్ అట… తనతో మంత్రి సీతక్క మార్నింగ్ వాక్ (ప్రచార నడక) చేసిందట… హవ్వ, ఇంకేమైనా ఉందా..? ఇంతకు మించి ప్రపంచ సమస్య మరొకటి ఉంటుందా అన్నట్టు కాలాల కొద్దీ పరిచేసింది ఓ వార్త…
నవీన్ తండ్రి చిన శ్రీశైలం యాదవ్‌తో సహా చాలామందిని ఎన్నికల సంఘం బైండోవర్ చేసిందట… దాన్ని పట్టుకుని లాగుతూ ఉంది… నవీన్ యాదవ్ తండ్రి, బాబాయ్ ఇద్దరూ రౌడీ షీటర్లే. ఫాఫం జుబ్లీ హిల్స్ ప్రజలు అన్నట్టు రాసుకొచ్చింది… కేటీయార్ వాయిస్ కదా…
బైండోవర్ అంటే అరెస్టు కాదురా బాబూ… కొంచెం సమస్యాత్మకంగా ఉండే వాళ్లను అదుపులో ఉంచుకునే ప్రక్రియ బైండోవర్…! మరి ఇదే నవీన్ యాదవ్, ఆయన తండ్రి, ఆయన బాబాయ్‌లకు సోకాల్డ్ కేసీయార్, కేటీయార్, బీఆర్ఎస్ అత్యంత ప్రముఖ, లాయలిస్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యుడు… అది తెలియదా, తెలివి లేదా బీఆర్ఎస్ క్యాంపుకి…?
ఇదే శ్రీనివాస్ యాదవ్ గతంలో తెలంగాణ వ్యతిరేకి, తను తెలుగుదేశానికి రాజీనామా చేయకుండానే, తెచ్చి, నెత్తిన పెట్టుకుని, మంత్రి పదవి ఇచ్చింది కేసీయార్ కాదా..? దీన్నే గురివింద గింజ నీతి అంటారు…
మన తొలి వెలుగు అనే పోర్టల్, యూట్యూబ్ చానెల్ కొన్ని పాత ఫోటోలు సంపాదించింది… అందులో ఇప్పుడు బీఆర్ఎస్ క్యాంపు ఏదో కొత్త విషయం చెబుతున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్న అదే చిన శ్రీశైలం యాదవ్‌ను ఇదే కేసీయార్ వెంబడి వేసుకుని తిరిగిన ఫోటోలను అది వెలుగులోకి తీసుకొచ్చింది… గుడ్…



ఇవండీ కొన్ని ఫోటోలు… అప్పుడు చిన శ్రీశైలం యాదవ్‌ను మోసిందెవరు..? ఇదే కేసీయార్ కాదా..? అప్పట్లో తను రౌడీ షీటర్ కాదా..? అంతెందుకు..? శ్రీనివాస్ యాదవ్‌ను అడ్డగోలుగా మోసింది ఎవరు..? కేసీయార్ కాదా..? ఇప్పటికీ తను జుబ్లీ హిల్స్ స్టార్ క్యాంపెయినర్ కదా…? అదెలా సమర్థనీయం మరి..?!

సరే, కాంగ్రెస్ అభ్యర్థి, తండ్రి, బాబాయ్ ప్లస్ శ్రీనివాస్ యాదవ్‌లను కాసేపు పక్కన పెడదాం… అప్పుడేదో కేసీయార్ అమాయకంగా వీళ్లను మోశాడు అనుకుందాం… మరిప్పుడు కేటీయార్ చేసింది ఏమిటి..?

సల్మాన్ అనే నాయకుడిని బీఆర్ఎస్‌లో చేర్చుకున్నాడు కదా… తనపై బోలెడు కేసులు పోక్సో కేసు సహా నమోదై ఉన్నాయి కదా… మరి తను బీఆర్ఎస్ సచ్చరిత్రుడు ఎలా అయిపోయాడు సడెన్‌గా…! సో, నువ్వు కౌగిలించుకుంటే రత్నం… ఎదుటి క్యాంపులో ఉంటే బొగ్గు… అంతేనా..?
కేసీయార్ త్వరలో జుబ్లీ హిల్స్ ప్రచారానికి వస్తాడు అంటున్నారు కదా… (నమ్మకం లేదు, తను ప్రజాజీవితంలోకి రాడు) వస్తే ఈ సల్మాన్ చేరిక మీద వివరణ ఇవ్వాలి జుబ్లీ హిల్స్ ప్రజలకు…
ఇవన్నీ సరే… మరణించిన మాగంటి మీద జనంలో విపరీతమైన సానుభూతి ఉందని అనుకుని, ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు కదా… (అఫిషియల్ భార్య కాదు, కేవలం అనధికార సహజీవనం అని మాగంటి మొదటి భార్య కొడుకు ఆరోపిస్తున్నాడు, అది వేరే సంగతి)… అంత సానుభూతి సునామీలా ముంచెత్తుతూ ఉంటే సల్మాన్ పోక్సో కేరక్టర్ల అవసరం ఏముంది బీఆర్ఎస్‌కు..?! కేసీయార్ అండ్ కేటీయార్, దీన్నే గురవింద గింజతనం అంటారు.,.!!
Share this Article