.
తెలుగు సినిమాల నిర్మాణాలకు హైదరాబాద్ అడ్డా… ప్రభుత్వ పరంగా కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుంటారు కానీ, ఎటొచ్చీ ఆచరణలో ఆ చిత్తశుద్ధి కనిపించదు, యూటర్నులు కనిపిస్తాయి… ఈమధ్య అన్నీ అవే…
తాజాగా రేవంత్ రెడ్డి ఏం ప్రకటించాడు..? టికెట్ ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20 శాతం సినీకార్మికులకు ఇవ్వాలి, అలాగైతేనే టికెట్ ధరలు పెంచుతాం అని…
Ads
స్థూలంగా చూస్తే గుడ్ డెసిషన్… కానీ సినిమా నిర్మాతలు చెప్పేవన్నీ దొంగ లెక్కలే… ఐటీ వాళ్ల కోసం వేరు, ప్రేక్షకులకు చెప్పే వసూళ్ల లెక్కలు వేరు, టికెట్ ధరల కోసం చెప్పే లెక్కలు వేరు, అసలు లెక్కలు వేరు… హీరోల అడ్డగోలు రెమ్యునరేషన్లు, దొంగ లెక్కల భారం ప్రేక్షకులు ఎందుకు భరించాలి..?
ఐనా ఒకసారి టికెట్ ధరలు పెంచేశాక, సొమ్ము దండుకున్నాక, ఎంత అదనపు ఆదాయం వచ్చిందో, అందులో 20 శాతం కార్మికుల కోసం ఏం ఖర్చు చేశారో ఎవరు చెప్పాలి..? అదయ్యే పని కాదు… అది సరిచూసే వ్యవస్థే లేదు… ఈమధ్య కార్మికుల జీతాల పెంపు వివాదాలు తెలుసు కదా…
ఎవరైతే మొన్న రేవంత్ రెడ్డిని సన్మానించే దగ్గర తనకు కుడిఎడమల నిల్చున్నారో… వాళ్లే ఈ సంకల్పం అమలు గాకుండా చేస్తారు… సీఎం సన్నిహితుడు రోహిన్ రెడ్డి ప్లస్ దిల్ రాజు కలిసి… అసలు ఈ శాఖ మంత్రి కోమటిరెడ్డినే సైడ్ చేసేస్తున్నారనే విమర్శలు ఉన్నవే…
అల్లు అర్జున్ తాలూకు సంధ్య థియేటర్ తొక్కిసలాట అనంతరం… నో బెనిఫిట్ షోస్ అన్నారు… నో అడిషనల్ షోస్ అనీ అన్నారు… నో ప్రిరిలీజ్ ఫంక్షన్స్ అన్నారు… అన్నీ మళ్లీ మొదలైపోయాయి… నిర్మాతల వ్యాపారాల ప్రమోషన్ కోసం జరిగే ఈ తంతులకు పోలీసుల మొహరింపులు, హైదరాబాద్ జనం అవస్థలు అవసరమా..? పైగా ఇవన్నీ వ్యక్తి పూజను, మూఢ భక్తిని పెంచే సమాజవ్యతిరేక కార్యక్రమాలు…
ఇవి మాత్రం ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు… హైకోర్టు ఉరిమితే తప్ప ఈ అధిక రేట్ల యవ్వారానికి అడ్డుకట్ట పడలేదు మొన్నామధ్య… అంతకుముందు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం చేస్తే తప్ప టికెట్ రేట్ల పెంపు ఉండదన్నారు… అదీ కొట్టుకుపోయింది… నిజమే, టాలీవుడ్ నియంత్రణ, ప్రోత్సాహానికి సంబంధించి ప్రభుత్వానికి ఓ దిశ లేకుండా పోయింది…
Share this Article