.
What a match …. మగ జెంట్స్ క్రికెట్ అంటేనే ఇండియాలో క్రేజ్… ఆడ లేడీస్ క్రికెట్ అంటే ఓ తేలికభావం… కానీ ఈరోజు ఆస్ట్రేలియా మీద వుమెన్ క్రికెట్ జట్టు గెలిచిన తీరు, ప్రపంచ్ కప్ ఫైనల్‌కు చేరిన తీరు అపూర్వం… అపురూపం…
మామూలుగా కాదు, గతంలో ఎప్పుడూ లేనంతగా… ఏకంగా 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే మాటలా..? చేశారు… వావ్ అవర్ వుమెన్ క్రికెట్ జట్టు… సాలిడ్ గేమ్… ఎక్సట్రా ఆర్డినరీ మ్యాచ్…
Ads
అసలు మెన్ క్రికెట్ మ్యాచులు చూసే ప్రేక్షకుల్లో 5 శాతం కూడా వుమెన్ క్రికెట్ మ్యాచులు చూడరు… కానీ ఈరోజు సెమీ ఫైనల్ పోరులో ఈ ప్రిస్టేజియస్ మ్యాచ్‌తో గెలిచాక ప్రతి వుమెన్ క్రికెటర్ కన్నీళ్లు పెట్టుకున్నారు… నిజమే… ఆనందబాష్పాలకు అర్హమైన గెలుపు ఇది…
మ్యాచ్ స్టార్టయ్యాక కాసేపటికే స్టార్ బ్యాటర్ షెఫాలీ వర్మ ఔట్… తరువాత సూపర్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఔట్… కానీ జెమీమా నిలబడింది… సెంచరీ చేసింది… ఒత్తిడిని బ్రేక్ చేస్తూ… ఓ ఫిమేల్ కోహ్లీలాగా… 339 పరుగుల ఛేజింగులో తనొక్కతే 127 పరుగులు చేసి విజయ పతాక ఎగరేసింది… ఫీల్డింగులో కూడా మెరుపులు అదనం…
ఫైనల్ దక్షిణాఫ్రికాతో… ఆల్ ది బెస్ట్ ఇండియన్ వుమెన్ క్రికెట్ టీమ్…, బీసీసీఐకి కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్, ఐసీసీ ఛైర్మన జైషా చప్పట్లతో గంతులేయడమే తక్కువ… ఇంతకీ ఎవరీ జెమీమా… ఆమెది మహారాష్ట్ర… హాకీ ప్లేయర్ కూడా… కొన్నాళ్లు టీమ్‌లో పక్కన పెట్టారు… ఈరోజు టైమ్ వచ్చింది ఆమెకు…
అందరమూ ఓ తిలక్ వర్మను ఆసియా కప్ గెలుపు సందర్భంగా ఆకాశానికెత్తాం కదా… కానీ జెమీమా ఇన్నింగ్స్ ఇంకా గ్రేట్… దానికన్నా ఎక్కువ… తను క్రీజులో నిలబడి ఆస్ట్రేలియా మీద ఎదురుదాడి చేసిన తీరు అపూర్వం…
వుమెన్స్ వరల్డ్ కప్ అన్ని మ్యాచుల్లో ఈ మ్యాచుది ఓ రికార్డు… సూపర్ జెమీమా…!! 99 శాతం గెలుపు చాన్స్ లేని ఆటను తను గెలిపించిన అద్భుతం… Of course 89 పరుగులు చేసిన కెప్టెన్ హరిప్రీతం కౌర్ ఇన్నింగ్స్ కూడా great…
గెలిపించి… విలపించి…
గెలిచాక… ఆమె ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది… కన్నీళ్లు… ఆమే కాదు, జట్టు మొత్తం అదే సిట్యుయేషన్… వావ్…!! ఛల్, రేప్పొద్దున ఫైనల్ గెలుస్తారా లేదా జానే దేవ్… ఈ మ్యాచు గెలవడం ప్రపంచకప్ గెలవడం కన్నా ఎక్కువ…. ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరూ ఫీలైంది ఇదే… ఇదే… మిత్రుడు చెప్పినట్టు…. జెమీ మా తుఝే సలాం…!!!
గెలిచాక ఆమె ఏమన్నదంటే… ‘‘నేను యాభయ్యో, వందో చేశాననేది కాదు ముఖ్యం, ఇండియా గెలిచిందనేదే ముఖ్యం…’’
Share this Article