.
( గోపు విజయకుమార్ రెడ్డి ) …. ప్రతి ఇంట్లో… ప్రతి ఊరిలో… ప్రతి ఇండస్ట్రీలో… ప్రతి టీంలో ఒకడుంటాడు… చిరునవ్వుతో అనే సినిమాలో బ్రహ్మానందంలాగా..! ఎక్కడికి వెళ్లినా దురదృష్ట దేవతని జేబులో పెట్టుకొని తిరుగుతుంటాడు…
అటువంటి దురదృష్టవంతుడు క్రికెట్లో ఒక్కడున్నాడు… పేరు “అమోల్ మోజాందర్”… ఇప్పుడు తన తలరాతని, తన ప్రొఫైల్ ని మార్చుకునే అవకాశం ఉంది,,. ఇప్పడతను ఇండియన్ ఉమెన్స్ టీం హెడ్ కోచ్, ఒక్క అడుగు దూరంలో అదృష్టానికి దగ్గరగా ఉన్నాడు…
Ads
పాపం, మనోడి లక్ ఎంత బ్యాడ్ అంటే… శారదాశ్రమం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, సచిన్, కాంబ్లీ వరల్డ్ రికార్డు 664 పరుగులు చేసినప్పుడు, పాడ్స్ కట్టుకొని నెక్స్ట్ బాటింగ్ కోసం రెండు రోజులు వెయిట్ చేసిన నెక్స్ట్ బాటర్ మనోడే…
ఇండియన్ అండర్ 19 వరల్డ్ కప్ టీం వైస్ కెప్టెన్… రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీతో కలసి ఇండియా A టీంకి కలిసి ఆడాడు… కానీ 20 ఏళ్ళ డొమెస్టిక్ కాంపిటీషన్లలో ఎన్నో సెంచరీలు కొట్టినా, టన్నుల కొద్దీ పరుగులు సాధించినా పాపం ఎప్పుడూ జాతీయ జట్టుకి ఎంపిక కాలేకపోయాడు…
కారణం… శత్రు దుర్బేద్యమైన టాప్ 5 బ్యాటర్స్ టీంలో ఉండటమే, దానికి తోడు క్రికెట్లో ఏ గాడ్‌ఫాదర్ లేకపోవడం (హర్షిత్ రానాకి గంభీర్‌లాగా )… సచిన్ సెహ్వాగ్, ద్రావిడ్ గంగూలీ, లక్ష్మణ్ ని దాటేసి టీంలోకి రాలేక పోయాడు… 260 ఇన్నింగ్స్ లు, దాదాపు 12 వేల పరుగులు డోమెస్టిక్ క్రికెట్లో అంతే ఆషామాషీ కాదు…

ఒక్కసారి ఉహించుకోండి అమోల్ మొజాందర్ ప్లేసులో మనం ఉంటే ఎంతలా డీలా పడిపోతామో.., కానీ మనోడు మధ్యలో కాడి వదిలేయలేదు… దాదాపు 38 ఏళ్ళ వయస్సు వరకు రంజీలు ఆడుతూనే ఉన్నాడు… ఒక్క ఛాన్స్… ఒక్కటంటే ఒక్క ఛాన్స్ వస్తుందేమోనని ఆశపడుతూనే ఉన్నాడు… బ్యాడ్ లక్…
ఇప్పుడిక తన తలరాత మార్చుకోవడానికి ఒ అవకాశం వచ్చింది… నిన్నటి అద్భుత మహిళా టీం విజయం వెనుక ఒక పేరు తనదే… సూపర్ ఇన్నింగ్స్ ఆడిన జెమీమా కూడా తన కోచ్‌ను తలుచుకుంది…
ఒక్క అడుగు దూరంలో విశ్వ విజేతలకు గురువుగా తన పేరు నిలుపుకునే సమయం వచ్చింది…. ఆల్ ది బెస్ట్ అమోల్ మొజాందర్…, ఆ దేవుణ్ణి వేడుకుంటున్నా నీకు న్యాయం జరగాలని, నువ్వు తలెత్తుకోవాలని…!!
Share this Article