Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భారతీయ సివంగులు గెలిచాయి… తొలిసారి ప్రపంచకప్‌ ముద్దాడాయి….

November 2, 2025 by M S R

.

భారతీయ సివంగులు గెలిచాయి… దక్షిణాఫ్రికాకు ఎప్పుడూ అలవాటే కదా… మెన్స్ టీమ్ అయినా, వుమెన్ టీమ్ అయినా… గెలుపు ముందు బోర్లా పడటం.., ఇండియన్ వుమెన్ టీమ్ చరిత్ర క్రియేట్ చేసింది… తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది… ఏళ్లు కష్టపడినా మిథాలీరాజ్‌కు సాధ్యం కాని విజయం హర్మన్ ప్రీత్ కౌర్ సాధించింది… మంచి ఔట్ స్టాండింగ్ కెప్టెన్సీ కనబరిచింది… (బహుశా ఆమెకు ఇది చివరి ప్రపంచకప్)…

25 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియా చేతుల్లో నుంచి జారిపోయిన కప్పు ఇండియా చేతుల్లోకి వచ్చి చేరింది… ఫైనల్స్‌లో శక్తిమంతమైన దక్షిణాఫ్రికాను ఓడించి దేశాన్ని ఆనందపు హోరులో ముంచెత్తింది… ఇన్నాళ్లూ వుమెన్ టీమ్ మీద ఓ వివక్ష కనిపించేది… ఇప్పుడిక వుమెన్ టీమ్‌కు కూడా విస్తృతాదరణ… గొప్ప ఛేంజ్…

Ads

wc

సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించాక, ఈ ఫినాలే మీద బాగా హైప్, బజ్ వచ్చింది… దేశవిదేశాల్లో ఉన్న ఇండియన్లు టీవీలకు అతుక్కుపోయారు… రెగ్యులర్ క్రికెట్ వ్యూయర్స్ కాని వాళ్లు కూడా… ఒక ఎమోషన్… ఒక జోష్… ఆ స్టేడియం ఫుల్ ప్యాక్… బ్లూ జెర్సీలతో ఓ నీలిసముద్రాన్ని తలపించింది… పిల్లలు, మహిళలతో సహా స్టేడియం హోరెత్తింది… మా తుఝే సలాం అనే నినాదం స్టేడియంలో మారుమోగిపోయింది…

నిజానికి ఈ ప్రపంచ కప్‌లో 330 దాటిన లక్ష్యాలను చేజ్ చేసిన సందర్భాలు కూడా ఉండటంతో… ఇండియా పెట్టిన 298 పరుగులను దక్షిణాఫ్రికా అలవోకగా చేజ్ చేస్తుందనే సందేహాలు కూడా మొదట్లో తలెత్తాయి.,. దీనికి తోడు ఓపెనర్, కెప్టెన్ వోల్వార్ట్ కూడా ధాటిగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి, పరుగుల సగటు తగ్గకుండా చూసి, ఇండియన్లలో చాలాసేపు ఉత్కంఠను పెంచింది…

చివరకు సెంచరీ చేసి, ఔటయి… దక్షిణాప్రికాను కూడా ఔట్ చేసింది… అమన్‌జోత్ పట్టిన ఈ క్యాచ్ ఏకంగా ప్రపంచ కప్పును అందుకున్నట్టయింది… డిసైడింగ్ ఇంపార్టెంట్ వికెట్ అది…

ఏమాటకామాట… దక్షిణాఫ్రికా ఎఫిషియెంట్ ఫీల్డింగుకు దీటుగా ఇండియన్ గరల్స్ ఫీల్డింగు చేశారు… బౌలింగ్ సరేసరి… అనుకోకుండా జట్టులోకి వచ్చిన షఫాలి సూపర్ ప్లే… బ్యాటింగులో 87, బౌలింగులో 2 వికెట్లు…! కౌర్, జెమీమా ఎట్సెట్రా ఇంప్రెసివ్ బ్యాటింగు చూపకపోయినా… మొదట్లో స్మృతి, తరువాత షఫాలీ, దీప్తి ఆదుకున్నారు… కెప్టెన్ కౌర్ ఏకంగా ఏడుగురిలో బౌలింగ్ చేయించింది… దీప్తి  హాఫ్ సెంచరీ, అయిదు వికెట్లు… మంచి పర్‌ఫామెన్స్…

స్టేడియంలో సచిన్, రోహిత్ శర్మ, ఐసీసీ చైర్మన్ జైషా, మెన్స్ క్రికెట్ మాజీలు, ప్రస్తుతాలు, వీవీఐపీలు కనిపించారు… అందరిలోనూ ఓ ధీమా… ఇండియన్ వుమెన్ గెలిచి తీరుతారని… ఆ నమ్మకం నిలిచింది… ఇండియా గెలిచింది… అర్ధరాత్రి దేశంలో మరోసారి దీపావళి, సంబురాలు… బాణాసంచా వెలుగులు…!!

wc

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…
  • అల్పపీడనాలు… అవి ప్రకృతి జారీ చేస్తున్న ప్రమాద హెచ్చరికలు…
  • జగన్ మానసిక వైకల్యం సరేగానీ… నార్సిసిస్ట్ కానివారెవ్వరు ఇప్పుడు..?!
  • ఇదుగో గ్రహాంతర జీవులు… వస్తున్నాయి, పోతున్నాయి, గమనిస్తున్నాయి…
  • సో వాట్..? ఈ కెప్టెన్ కూడా ఆటలో పదే పదే ప్రార్థిస్తూ కనిపించింది..!
  • ఎవల్యూషన్, ట్రాన్స్‌ఫార్మేషన్… ఓ psychological angle లో చూద్దాం…
  • లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రికెటరా..? యాక్టరా..? ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ..!!
  • క్రికెట్‌లోకి ఈ ఆల్‌రౌండర్ ఎంట్రీకి దారివేసింది ఓ పర్‌ఫెక్ట్ థ్రో..!!
  • భారతీయ సివంగులు గెలిచాయి… తొలిసారి ప్రపంచకప్‌ ముద్దాడాయి….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions