.
వుమెన్ వరల్డ్ కప్ ఇండియన్ టీమ్ సాధించింది… నిన్న మొత్తం అదే హంగామా… మీడియాలో, సోషల్ మీడియాలో… గెలిచిన అర్ధరాత్రి దేశంలోని అనేకచోట్ల యువత రోడ్ల మీదకు వచ్చి ఉత్సవాలు చేసుకుంది… డాన్సులు, బాణాసంచా, కేకులు, స్వీట్లు ఎట్సెట్రా…
ఫైనల్ తరువాత ఎవరెవరు హైలట్ అయ్యారు..?
Ads
దీప్తి శర్మ… మంచి బౌలింగ్‌తో (ఫైనల్‌లో 5/39) చరిత్ర సృష్టించి, భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది… 215 పరుగులు (మూడు హాఫ్ సెంచరీలు), 22 వికెట్లు… మంచి ఆల్‌రౌండర్, ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్…
షఫాలీ వర్మ.,. అనుకోకుండా జట్టులోకి వచ్చి, వేగవంతమైన అర్ధ సెంచరీతో (87 పరుగులు) ఇన్నింగ్స్ వేగాన్ని పెంచింది… రెండు వికెట్లు తీసుకుంది…
హర్మన్‌ప్రీత్ కౌర్… కెప్టెన్‌గా జట్టును నడిపించిన తీరు, ఆమె వ్యూహాలు చర్చనీయాంశమయ్యాయి… ఎక్కువ క్రెడిట్ కెప్టెన్‌గా ఆమెకే దక్కుతుంది… సహజం…
జెమీమా రోడ్రిగ్స్… సెమీ ఫైనల్‌లో 127 పరుగులు చేసి, బలంగా ప్రచార తెర మీదకు వచ్చింది…
అమన్‌జోత్ కౌర్… దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచుతో ఈమెకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి…
మరి స్మృతి మంధాన..? ఎస్… నిజంగా ఆమెకు దక్కాల్సినంత ప్రచారం మాత్రం పెద్దగా కనిపించలేదు మీడయాలో, సోషల్ మీడియాలో… ఈ ఫైనల్‌లో 45 పరుగులు చేయడమే కాదు, ఫస్ట్ వికెట్‌కు షఫాలీతో కలిసి సెంచరీ భాగస్వామ్యం ఆమెది… ఈ నిశ్శబ్ద పునాది మీదే మిగతా ప్లేయర్లు బాగా ఆడి 298 పరుగుల దాకా చేయగలిగారు…
దీప్తి శర్మ బౌలింగు, బ్యాటింగ్ మెరుపుల ఎదుట స్మృతి ఇన్నింగ్స్ మరుగునపడిపోయింది… నిజానికి స్మృతిది స్థిరమైన ఆటతీరు… ఈ వరల్డ్ కప్‌లో ఆమె 434 పరుగులు చేసింది… ఈ టోర్నీలో అత్యధిక పరుగులు ఆమెవే… ఇవే కాదు… ఆమె కెరీర్ మొత్తం ఇంప్రెసివ్ గణాంకాలే…
114 వన్డేల్లో 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు… 5219 పరుగులు మొత్తం… చివరకు టీ20లలో కూడా మెరుగైన ప్రతిభే… ఈ పొట్టి ఫార్మాట్‌లో కూడా 147 మ్యాచుల్లో ఒక సెంచరీ, 31 హాఫ్ సెంచరీలు… ఇంప్రెసివ్ పర్‌ఫార్మర్…
2024లో ఆమె అద్భుతమైన ODI ప్రదర్శనలకు ICC మహిళల ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతూ, 2024లో తొలి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది…
వ్యక్తిగతానికి వస్తే… ముంబైలో పుట్టుక… తండ్రి, సోదరుడికి క్రికెట్ నేపథ్యం ఉంది… కోచ్ అమోల్ మజుందార్ పికప్ చేసిన ప్లేయర్ ఈమె… త్వరలో పలాష్ ముచ్చల్ అనే బాలీవుడ్ సింగర్, కంపోజర్, డైరెక్టర్‌ను పెళ్లి చేసుకోబోతోంది… 2019 నుంచీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు… పలాష్‌ది ఇండోర్…

(ఈ ఫోటోలో చేయి ఎవరిదో కాదు, స్మృతి కాబోయే భర్తదే… ఆమె పేరు ప్లస్ ఆమె జెర్సీ నంబర్ టాటూ వేయించుకున్నాడు… వరల్డ్ కప్ పట్టుకుని ఇలా సెల్ఫీలు దిగారు మురిపెంగా…)
అన్నట్టు… అందమైంది కదా, పైగా పాపులర్ వుమెన్ క్రికెటర్… అందుకే బ్రాండ్ వాల్యూ ఎక్కువ… హ్యూందాయ్, నైక్, రెడ్ బుల్, మాస్టర్ కార్డ్, హెచ్‌పీ, అమెజాన్, బోట్, అమూల్, గుడ్ డాట్, హీరో మోటోకార్ప్ ఉత్పత్తులకు మోడలింగ్ చేసింది…
అన్నట్టు… హర్మన్ ప్రీత్ ను తప్పించేసి, ఇక స్మృతిని అన్ని ఫార్మాట్లకూ కెప్టెన్ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి…! మాజీ కెప్టెన్ శాంత రంగ స్వామి వంటి క్రికెటర్లు ఆల్రెడీ గళం విప్పారు…
Share this Article