.
అవును, ఢిల్లీలోని ‘డ్రాయింగ్ రూమ్’ నిపుణులు.,.. గ్రాఫులు, గ్రాఫిక్కులు, పాత గణాంకాలతో సంక్లిష్టమైన లెక్కల్ని వివరిస్తూ బీహార్ రాజకీయ చిత్రాన్ని వివరించేందుకు అష్టకష్టాలూ పడుతుంటారు… సెఫాలజిస్టులు, మీడియా మేధావులు, పార్టీల అధికార ప్రతినిధులు కుస్తీలు పడుతుంటారు డిబేట్లలో…
- కానీ… రాజస్థాన్‌లో ఫలోదీ అనే పట్టణం మాత్రం నిశ్శబ్దంగా జనం అభిప్రాయాల్ని భిన్నంగా, తనదైన పద్దతిలో క్రోడీకరించుకుని, విశ్లేషించుకుంటుంది… ఫలోదీ అంటే రాజస్థాన్, జోధ్‌పూర్ దగ్గర ఉండే పట్టణం… ఇది ఓ సట్టా బజార్‌కు కేంద్రం…
రాజకీయమే కాదు, సమాజంలో వర్తమాన, ఆసక్తికరమైన ఏ అంశంలోనైనా సరే, అది తనదైన అంచనాలు వేస్తుంది… ఇక్కడ సొంత డబ్బును పందెం కాసే పంటర్ల ద్వారా అంచనా వేయబడుతుంది… తమ అనుభవం, క్షేత్ర స్థాయి వాస్తవాలపైనే ఎక్కుగా ఆధారపడతారు… అందుకే ప్రతి ఎన్నికలోనూ పార్టీలు, నాయకులు ఫలోది ఏమంటున్నదో ఆసక్తి చూపిస్తారు… నమ్ముతారు కూడా…,
Ads
ఫలోది ఏమంటోంది?
వినిపిస్తున్న కథనాల ప్రకారం… బీహార్ ఎన్నికలకు సంబంధించి ఫలోది సట్టా బజార్‌లోని ముఖ్య అంచనాలు ఇక్కడ ఉన్నాయి… (బీహార్ ఒకరకంగా భవిష్యత్ దేశ రాజకీయాలను శాసిస్తాయని ఓ అంచనా…)
- ఎన్‌డీయే కూటమి విజయంపై ఎక్కువ అంచనాలున్నాయి… 75 నుంచి 80 పైసల రేటు నడుస్తోంది… అంటే మెజారిటీపై స్పష్టమైన సంకేతం
- మహాకూటమి ఆశలు తగ్గుముఖం పట్టాయి… మరీ 20 నుంచి 25 పైసల రేటు నడుస్తోంది ఇప్పుడు ఈ కూటమిపై… అంటే విశ్వాసం సడలింది పందెం రాయుళ్లలో…
- ఎన్‌డీఏ సీట్లు 128 నుంచి 134 వరకు అని తాజా అంచనా… (మొత్తం సీట్లు 243, మెజారిటీ మార్క్ 122 సీట్లు…)
- నితిశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతాడనే ఈ సట్టా బజార్ నమ్ముతోంది.,. ఈ రేసులో తేజస్వి యాదవ్ వెనుకబడిపోయాడు…
- బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే, నితిశ్ బదులు ఎవరైనా బీజేపీ సీఎం వస్తాడనే ఊహాగానాల నడుమ ఈ సట్టా సెంటర్ మాత్రం నితిశ్‌నే మళ్లీ వచ్చే ముఖ్యమంత్రిగా చూస్తోంది…
సట్టా బజార్ అభిప్రాయం
నితీష్ కుమార్ బలంగా ఉన్నాడు…: పైకి శక్తివంతంగా కనిపిస్తున్నాడు తేజస్వి యాదవ్… కానీ కేవలం ఉత్సాహం, పైపైన కనిపించే అభిప్రాయాలు ఎన్నికల్లో గెలవవు… వ్యవస్థా నిర్మాణమే గెలిపిస్తుంది అని ఫలోది మార్కెట్ చెబుతోంది…
- ఈ సట్టా మార్కెట్ దందా రీత్యా నైతికం కాకపోవచ్చు… కానీ ఇది కుల సమీకరణాలు, కమ్యూనిటీ, డబ్బు ప్రవాహం, ప్రచార తీరు వంటి వాటిని ఒక అనుభవజ్ఞుడైన డిటెక్టివ్‌లాగా విశ్లేషిస్తుంది….
అత్యంత ఖరీదైన ఒపీనియన్ పోల్స్ కూడా లెక్కించలేని మానవ సహజసిద్ధమైన స్వభావం (human instinct) ఆధారంగా ఈ మార్కెట్ తన అంచనాలను వేస్తుంది… వీరు ఊహాగానాల కోసం కాకుండా, లాభం కోసం పందెం వేసేవారు కాబట్టి, వీరు ప్రజల మనోభావాలను సరిగ్గా పట్టుకునే ప్రయత్నం చేస్తారు… తప్పు అంచనాలు మరీ అరుదు…
- చెప్పనే లేదు కదూ… ది గ్రేట్ ఇండియన్ పొలిటికల్ మేనిప్యులేటర్ ప్రశాంత్ కిషోర్ బాపతు జనసురాజ్ పార్టీని అసలు ఈ సట్టా బజార్ పరిగణనలోకే తీసుకోలేదు… రియాలిటీ..!!
Share this Article