.
అసలు సినిమా ఫంక్షన్ల నిర్వాహకులదే తప్పు… పిచ్చి కూతల రాజేంద్ర ప్రసాదుని, బండ్ల గణేషును, ఇలాంటి కేరక్టర్లను ఎందుకు పిలవాలి..? కంపు ఎందుకు చేసుకోవాలి…? కావాలనేనా..? వార్తల్లో తమ సినిమా పేరు నానేందుకు, ఉద్దేశపూర్వక నెగెటివ్ క్యాంపెయిన్ కోసమేనా..?
ఫిలిమ్ జర్నలిస్టుల్లో కొందరితో ప్రెస్‌మీట్లలో అడ్డమైన ప్రశ్నలు వేయించేదీ ఇందుకేనట… ఇదీ ఓ పెద్ద మార్కెటింగ్ దందా అట… ఫాఫం, ఆ జర్నలిస్టుల ఓనర్ సంస్థలు, వాటి యాజమాన్యాలు, బాధ్యులు…
Ads
సరే, రాజేంద్ర ప్రసాద్ తలాతోకా లేెకుండా ఏదో మాట్లాడతాడు, కనీసం తను సినిమాల్లో నటిస్తున్నాడు కాబట్టి మర్యాదకు పిలిచి ఆ సోదిని భరిస్తున్నారు అనుకుందాం… ప్రేక్షకుల తలనొప్పి సంగతి తరువాత… మరి బండ్ల గణేష్..?
తనకు సంబంధం లేని ఈవెంట్లకు ఎందుకు పిలుస్తున్నారు..? కేవలం పిచ్చి కూతల కోసమేనా..? ఈమధ్య భారీ పార్టీ ఏదో ఇస్తే చిరంజీవి సంబురంగా వెళ్లిన ఫోటోలు చూసినట్టు గుర్తు… అలాగే లిటిల్ హార్ట్స్ మూవీ ఫంక్షన్‌లో లీడ్ రోల్ నటుడిని వేదిక మీద పట్టేసుకుని, ఏవేవో కూశాడు… పాపం పిల్లాడు హడలిపోయాడు…
కే-రాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో అలాగే పిచ్చి కూతలకు దిగాడు… ఆ హీరోను వేదిక మీదకు పిలిచి మరీ హత్తుకుంటూ (పాపం, ఆ నటుడు భయంభయంగా దూరదూరంగా ఉండటానికి విశ్వప్రయత్నం చేశాడు…) తనదైన ఓ తలతిక్క ధోరణిలో మాట్లాడాడు…
ఈ రెండు సందర్భాల్లోనూ షాక్ తిన్నది రవితేజ, విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, బన్నీ వాసు తదితరులు… అసలు ఆ ఈవెంట్ ఉత్సాహం మొత్తం పోయింది అని బన్నీ వాసు స్పందించగా… అసలు నాకు ఓ లెవల్ ఉంది అని బండ్ల గణేష్ వ్యాఖ్యల మీద స్పందించడానికే నిరాకరించాడు అల్లు అరవింద్… వాట్ ఎ షాట్..? తాగిన పురుగును ఏరిపారేసినట్టు..!!
మరోవైపు రవితేజ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా నెట్‌లో భీకర ట్రోలింగుకు దిగారు… సరే, బండ్ల గణేష్ లెవల్ అది… తను అంతకుమించి ఎదగడు… బజారు స్థాయి భాష… సో, తనను అతిథిగా పిలిచి వేదికల మీద పిచ్చి కూతలు కూయించే నిర్వాహకులదే ప్రధాన తప్పు… ఇదొక కాలుష్యం…

ఇలా ఓ ట్వీట్ కొట్టాడు… నిషా దిగినట్టుంది… నిజం బోధపడినట్టుంది… మరి అడుసు తొక్కనేల, కాలు కడుగనేల..? నిజానికి ఇది అడుసు తొక్కడం కాదు, కక్కడం..! కడిగినా పోదు… కడుక్కున్నా పోదు…
సార్, రేవంతం సార్, ఏ సినిమా ఫంక్షన్ అయినా సరే, పోలీసులను పంపించి, బ్రీత్ అనలైజర్స్ పెట్టించాలి, దిల్ రాజుకు చెప్పినా చేయడు, ఆ క్యాంపే కాబట్టి ఏ సజ్జనార్‌కో స్ట్రిక్టుగా చెప్పండి… తను చూసుకుంటాడు ఇక… జింతాకు జితా జితా… ఇవి పాటిస్తేనే సినిమా రేట్ల పెంపు అనీ చెప్పండి…
ముందు ఎవరైనా బాధపడితే క్షమాపణలు అన్నాడు కదా, కాసేపటికి ఆ లైన్ మాయం… బండ్ల గణేష్ మెంటాలిటీలాగే… ప్రతిదీ తిక్కతనమే…
కనీసం చెప్పే ఆ వివరణలో, క్షమాపణల్లో కూడా నిజాయితీ ఉండదు, స్పష్టత ఉండదు… తెలివి, విజ్ఞత, వివేచన, విచక్షణ వంటి పదాలే ఉండవు… అసలు తన డిక్షనరీలోనే ఆ పదాలే ఉండవు..!!
Share this Article