.
నిన్న సీపీఎం అమరావతి పత్రిక ప్రజాశక్తి బ్యానర్ స్టోరీ అనుకోకుండా కంటబడింది… అదేమిటంటే..? 2000 కోట్ల ప్రజాఆస్తుల్ని మోడీ ప్రభుత్వం ఆదానీకి అప్పగించబోతోంది, తిరుపతి బస్టాండుపై ఆదానీ కన్ను అని…
1) ప్రభుత్వ రంగం నుంచి ప్రజా ఆస్తుల్ని తప్పించి ప్రైవేటు వారికి ధారాదత్తం చేయడం… 2) ఆర్టీసీని నిర్వీర్యం చేయడం… 3) ప్రైవేటు బస్సుల మాఫియాకు కూడా తోడ్పడటం… ఎట్సెట్రా సీపీఎం వ్యతిరేకతకు కారణాలు…
Ads
కానీ… ఇది పీపీపీ మోడ్… గతంలో జరిగిన నిర్ణయమే… ప్రైవేటుకు ధారాదత్తం చేయడం ఏమీ ఉండదు… ప్రైవేటు బస్సుల్ని ఇక్కడ కొత్తగా కట్టే అల్ట్రా మోడరన్ టర్మినల్‌కు అనుమతించినా, వాటి నుంచి అద్దె తీసుకుంటారు (ఎయిర్‌పోర్టుల్లో తీసుకున్నట్టు…) దీనికీ ఆర్టీసీ నిర్వీర్యానికీ సంబంధం లేదు…

అదే వార్తలో ప్రస్తుత బస్టాండ్ కూల్చివేసే ఫోటో, ప్రతిపాదిత టర్మినల్ ఊహాచిత్రం కూడా పబ్లిష్ చేశారు… అంటే పనులు వేగంగా ప్రారంభమయ్యాయి అని లెక్క… 1) ఆదానీ అనగానే కమ్యూనిస్టులకు మోడీ గుర్తొస్తాడు… 2) మోడీ అనగానే గుడ్డి వ్యతిరేకత ఒకటి కళ్లను ఆవరించేస్తుంది… 3) ప్రైవేటు అనే పదం వింటేనే మంట…
వ్యతిరేకించాలి… కానీ ఎప్పుడు..? లులూకు విజయవాడ ఆర్టీసీ స్థలాల్ని అడ్డికి పావుశేరు పద్దతిలో… కాదు, కాదు, అప్పనంగా ధారాదత్తం చేసే చర్యను వ్యతిరేకించాలి… పోరాడాలి… అక్కడ ఆర్టీసీ నిజానికి పీపీపీ పద్ధతిలోనే పెద్ద మాల్ కట్టొచ్చు… లులూ వాడేమీ డబ్బు లేనోడు కాదు, వాడు కట్టే మాల్స్ విజయవాడలో బోలెడు… మరెందుకు వాడికి కట్టబెడుతున్నట్టు… అందులో మతలబు ఏమిటి..?
ఇవీ ప్రశ్నించాల్సినవి… పోనీ, అది అమ్ముతున్నారా, అదీ లేదు… లీజు పేరిట రాసిచ్చేయడమే… లులూ వాడు వ్యాపారి, లోగుట్టు లేనిదే ప్రభుత్వం వాడికి ఇచ్చేస్తుందా..? అది కదా వ్యతిరేకించాల్సింది… ఒకసారి ఈ వార్త చూడండి…

11 అంతస్థుల టర్మినల్… కేంద్ర ప్రభుత్వ సాయం కూడా ఉంది… 150 ప్లాట్‌ఫారాలు… 11వ అంతస్థుపైన హెలీ ప్యాడ్… అందులోనే జనం తాకిడికి, స్థోమతకు తగినట్టు రెస్టారెంట్లు, బ్యాంకులు, హోటళ్లు, ఆధునిక వసతులు… సో వాట్ రాంగ్..? ఆదానీకి ఇస్తున్నారు కాబట్టి వ్యతిరేకించాలా..?
ప్రభుత్వ రంగం విఫలమైనచోట… లేదా విఫలం చేయబడినచోట… ప్రైవేటు రంగం కాళ్లు పెడుతుంది… ఇక్కడా అదే జరిగింది… రాను రాను పర్యాటక రంగంలో ఆధ్యాత్మిక టూరిజానికి బాగా ప్రాధాన్యం పెరుగుతోంది… తిరుపతిని బలమైన, ప్రభావవంతమైన పర్యాటక స్థలిగా మార్చుకోవచ్చు… దానికి ఈ అల్ట్రా మోడరన్ టర్మినల్ ఖచ్చితంగా ఊపునిస్తుంది…
ఇప్పటికే భక్తుల రద్దీ, వీవీఐపీ భక్తులకు దాసోహంతో తిరుమల కిటకిటలాడుతూ…. పేద భక్తులకు బదులు ధనిక భక్తుల పర్యాటక కేంద్రం అయిందనే విమర్శలున్నాయి… అవి సహేతుకం… దీనికి కారణం, ప్రతి ప్రభుత్వం ఆ బోర్డును అడ్డమైన రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడం, అక్రమాలు… అదొక రాజకీయ కాలుష్యం… పాపం, ఆ వెంకన్న స్వామికే ఈ కాలుష్య నివారణ సాధ్యం కావడం లేదు… సరే, ఇదంతా మరో పెద్ద కథ…!!
Share this Article