.
సోకాల్డ్ కమర్షియల్ సినిమాలు మాకెందుకు..? మనసును తాకే సినిమాలు కావాలని అనుకుంటున్నారా..? గుడ్… వెరీ గుడ్… అలాగే కమర్షియల్ వీవీఐపీ ధనిక దేవుడి క్షేత్రం మాకెందుకు అనుకుంటున్నారా..? ఓకే, ఇక్కడ కాస్త చెప్పుకుందాం…
మీ కాలనీ చివరలో ఉన్న వెంకన్నకు, తిరుమలలో వెంకన్నకూ తేడా లేదు… మన మైండ్ సెట్‌లో ఉంది లోపం… నానా అష్టకష్టాలు పడి, కిందా మీద పడుతూ… వ్యయప్రయాసలకు ఓర్చి వెళ్లడంకన్నా మీ ఓన్ గుడిలో 11 ప్రదక్షిణలు నయం అనుకుంటున్నారా… గుడ్, ప్రవచనకర్త గరికపాటి కూడా కరెక్ట్ అంటాడు…
Ads
సరే, ఓసారి దత్తాత్రేయ పరంపరకు వద్దాం… మన తెలుగువాళ్లకు తెలిసినవి రెండు… 1) మంత్రాలయం 2) గానుగాపూర్…. తెలుసుకోవాల్సిన మూడోది కురువాపురం… గత మే నెలలో వెళ్లినప్పుడు రాసిన కథనం ఇది… ఏమీ తెలియక, తెలుసుకోక వెళ్లినప్పుడు… కానీ ఇప్పుడు ఏమిటి..? మొదట ఈ పాత కథనం చదవండి…
గత మే నెలలో రాసిన కథనం ఇది… ఓసారి లుక్కేయండి…
ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
అప్పుడంటే నీళ్లు లేవు నదిలో… వసతి తెలియదు… మరిప్పుడు…? చాలామంది అడుగుతున్నారు… చెబుతాను…
హైదరాబాదు నుంచి 170 కిలోమీటర్లు… జడ్చర్ల- మహబూబ్‌నగర్- మక్తల్ మీదుగా వెళ్లాలి… రాయచూర్ రోడ్డు మీద అనుగొండ రోడ్ మళ్లాలి… 20 కిలోమీటర్ల వరకు రూరల్ రోడ్… బట్ బీటీ రోడ్డు… ప్రాబ్లం లేదు… ఈ క్షేత్రం కర్నాటక- తెలంగాణ సరిహద్దుల్లో… కృష్ణా నది మధ్యలో ఉంటుంది… ఈ ద్వీప క్షేత్రం… మరి వసతి..?

మనం కృష్ణా నది ఒడ్డు దాకా చేరగానే పైన ఫోటోలో ఉన్న దృశ్యమే… నిజానికి గతంలో నేను వెళ్లినప్పుడు వసతి గురించిన సరైన సమాచారం లేక ఇబ్బంది పడ్డాను… నిజానికి వసతి ఉంది… బాగుంది… ఓసారి ఇది సేవ్ చేసుకొండి…

ఇది కృష్ణా గట్టుకు కిలోమీటర్ ముందుగానే ఉంటుంది… ఛాయ ఆశ్రమం… బోలెడు రూమ్స్ దొరుకుతాయి… దీని పక్కనే మరో పెద్ద వసతి గృహం కడుతున్నారు… 3 నెలలు ఆగితే ఏసీ, నాన్ ఏసీ ఇంకా బోలెడు రూమ్స్…
ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ రెంట్స్ ఎంత పెడతారో తెలియదు… ప్రస్తుత ఈ ఛాయా ఆశ్రమంలో 2018 నుంచి ‘దిగంబర నామయజ్ఞం నడుస్తోంది,,, 2019 నుంచి అగ్ని యజ్ఞం… మొత్తం 13 ఏళ్ల పాటు సాగుతుందట… అఖండంగా… ప్రతి గంటకు, రెండు గంటలకు హోమం దగ్గర సిబ్బంది మారుతూనే ఉన్నారు… నేను ప్రత్యక్ష సాక్షి…
https://www.facebook.com/reel/666467499669182
ముందుకు వెళ్తే మరో ఆశ్రమం కూడా ఉంది… పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్… లంచ్, డిన్నర్ ఫ్రీ.,. నేను రుచిచూసిన లంచ్ ఎక్సలెంట్… రాసుకొండి… మేం 11 రాత్రి గంటలకు వెళ్తే ఆ నిర్వాహకుల మాట ఏమిటో తెలుసా… ‘‘ఎప్పుడు తిని వచ్చారో, కాస్త తింటారా..?’’ మీరు ఏ సమయంలో వెళ్లినా వాళ్లు కడుపు నింపుతారు… గ్యారంటీ… పైగా అక్కడ మీకు ఫుడ్ దొరకదు కూడా…
పొద్దున్నే 4 గంటలకు వెళ్లి, నదీస్నానం చేసి, అక్కడ బోటు ఎక్కి, నది మధ్యలోని గుడికి వెళ్లాలి… చిన్న గుడి… ప్రైవేటు గుడి… వేరే ఏ అధికారి పెత్తనమూ ఉండదు… పేరుకు కర్నాటక, రాయచూర్ జిల్లా పరిధి… కానీ అక్కడ తెలుగు, కన్నడ, మరాఠీ, ఇంగ్లిషు నడుస్తాయి…
5.30కల్లా కృష్ణా దాటి, మెయిన్ గుడికి వెళ్తే…. రుద్రాభిషేకం… ఫ్రీ… అరగంట, ముప్పావు గంట… 251 డొనేషన్ కూడా ఉంటుంది… ఆ టైమ్ దాటితే మళ్లీ 7.30 ప్రాంతంలో సెకండ్ షిఫ్ట్… అదీ భక్తులు ఉంటేనే… లేకపోతే ధర్మదర్శనం మాత్రమే…
ఈ కేటగిరీలు ఏమిటో తరువాత చెప్పుకుందాం… కానీ బాగా నచ్చింది ఏమిటంటే..? మనం వెళ్లిన మరే ఇతర పాపులర్ గుళ్లకన్నా…. నిష్టగా, శాస్త్రోక్తంగా అభిషేకం… (కొన్ని ఉన్నయ్ పూజలు, అవి గుడి మెయింటెనెన్స్ కోసం విరాళాల పేరిట… 251 నుంచి 10,000 దాకా…) మెజారిటీ జనం సర్వ, ధర్మదర్శనం కోసమే వస్తారు… పేద ప్రాంతం అది…
గర్భగుడిలోకి ఎవరినీ రానివ్వరు… బయట రెండు టీవీల్లో లైవ్… అది చూస్తేనే మనకు అర్థమవుతుంది… ఎంత పద్ధతిగా పూజ చేస్తారో… ఏ హడావుడీ, ఏ రద్దీ, ఏ కమర్షియల్ దోపిడీ ఉండవు… ఉన్న కాసేపూ ప్రకృతి ఒడిలో ఉన్నట్టుంటుంది… జూరాల నుంచి రిలీజయ్యే వాటర్… నెమ్మదిగా… సాగుతూ ఉంటుంది…
సరే, ఈ ఆశ్రమంలో నేను తిన్న మధ్యాహ్న ప్రసాదం చెప్పనా..? ‘‘పులిహోర, అన్నం, కూర, సాంబారు, ఒక స్వీట్…’’ సెలవు… ఇంకా చాలా రాయొచ్చు… తరువాత కథనాల్లో…! పునర్దర్శన ప్రాప్తిరస్తు..!!
.
చివరగా ఒక మాట… గతంలో నదికి తెలంగాణ ఒడ్డున, కృష్ణా పుష్కరాల సమయంలో మంచి ఘాట్లు కట్టారు… స్వేచ్ఛగా, భద్రంగా స్నానాలు చేయొచ్చు లేడీస్ కూడా… అటు కర్నాటక బోర్డర్‌లో ఇవేమీ ఉండవు… జస్ట్, గుడి, దత్తాత్రేయుడి పరమోత్కృష్ట శిష్యుడు…. అదే… ‘దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా…’
మరో మాట… వెళ్తే ఊరికే వెళ్లకండి… గానుగాపూర్ భక్తుల ఆనవాయితీలాగే…. స్వీట్లు, పులిహోర వంటి ఏదో ఒకటి… తీసుకెళ్లండి…. అక్కడ భక్తులకు ప్రసాదంలా పంచండి.,. అది దర్శకన్నా పుణ్యఫలం… నిజం..!! ఈ కథనాన్ని కనీసం 11 మందికి షేర్ చేస్తే కురువాపురం (అలియాస్ కురుగడ్డి) దత్తాత్రేయుడి ఆశీస్సులు మీకు...!!
అన్నట్టు చెప్పనెలేదు కదా... Dec 4... దత్త జయంతి... పౌర్ణిమ...
మరీ చివరగా... మనకు గోకుడు అలవాటు కదా... ఆ ట్రస్టు ఉత్తరాధికారుల్లో ఒకరిని నిందాపూర్వకంగా పలకరిస్తే.... తన జవాబు... ‘‘కార్తీక పౌర్ణమి, ఇతర పౌర్ణమి రోజుల్లో కాబట్టి పది మంది రద్దీ కనిపిస్తుంది, మామూలు రోజుల్లో రండి, మీరూ నేను దేవుడు... మనమే పూజిద్దాం.,..’’
Share this Article