.
కొన్ని విషయాల్లో నాకూ మోడీ మీద ఫిర్యాదులున్నయ్… కానీ మరికొన్ని విషయాల్లో మోడీ ప్రస్తుతం దేశంలో తిరుగులేని నాయకుడు… అది పర్సనల్ టచ్ విషయంలో…
ఇస్రో ఫెయిల్ ఏదో ఇష్యూలో… మోడీ ఆ చైర్మన్‌ను కావిలించుకుని ధైర్యం చెబుతాడు… ఇది ఉదాహరణ మాత్రమే… దేశం కాలరెగరేసే విషయాల్లో గతంలో ప్రధానులు ఫార్మల్ అభినందనలే చూశాం, కానీ మోడీ వేరు… పర్సనల్‌గా కనెక్టవుతాడు…
Ads
తను రాహుల్ గాంధీలా శుష్క వ్యాఖ్యలు, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడు… సడెన్‌గా చెరువులో దూకి చేపలు పట్టడు… 2017లో కావచ్చు వుమెన్ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సాధించలేకపోయింది… మోడీ అన్నాడు… ‘ఇది తాత్కాలికంగా మరిచిపొండి, రేపు మాదే… ఆ గెలుపు తనంతట తనే వస్తుంది మన వద్దకు’ అని… ఇది ఊరటే కాదు, భరోసా, వెన్ను తట్టడం, ఈ దేశ ప్రధానిగా దేశం యావత్తూ మీ వెంట ఉంటుంది బిడ్డా అని వెన్నుతట్టడం…
అంతకుముందు కప్ గెలవలేని జట్టు వద్దకు తనే వెళ్లి ధైర్యం చెప్పాడు… మొన్న ప్రపంచ కప్ గెలిచాక మహిళల జట్టుకు అపూర్వమైన ఆతిథ్యం ఇచ్చాడు… ప్రధాని హోదాలో, అధికారిక నివాసంలో… పాల్గొన్న ప్రతి క్రీడాకారిణికి ఎంత గౌరవం..? సూపర్ మొమెరీ…!
ఎవరు ఏం రాసిచ్చారనేది పక్కన పెట్టండి… తను వ్యక్తులతో కనెక్టవుతాడు… ఇక్కడా అంతే…. నాకు బాగా నచ్చింది ప్రతీక రావల్‌తో తన సంభాషణ… ఆటలో గాయపడిన ఈ స్టార్ ప్లేయర్ ఫినాలే కూడా ఆడలేదు… మోడీ అంటున్నాడు…
“ప్రతీక, నీకు గాయం అయినప్పుడు జట్టు గెలిచింది… ఆ సమయంలో నీ బాధను, సంతోషాన్ని కలిపి అనుభవించిన ఉద్విగ్నతను నేను ఊహించగలను… నువ్వు జట్టుకు చేసిన సేవ గొప్పది… నీ లాంటి యోధురాలు ఉండటం జట్టుకు బలం…”
కప్పు చేత్తో పట్టుకున్న ఆనందంకన్నా ఇదీ అపురూపమే కదా అభినందన… ఆమెకు స్వయంగా విందు వడ్డించడం.., త్వరగా కోలుకోవాలని కోరడం.., మోదీ పర్సనల్ టచ్‌కు నిదర్శనం… ప్రతీక ఉద్విగ్నతతో కన్నీరు పెట్టుకున్న దృశ్యం, ఆ క్షణాల నిజాయితీకి ప్రతీక…
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను పలకరించిన మోదీ, నవ్వుతూ ఆమెతో చమత్కారంగా మాట కలిపాడు… “హర్మన్, నేను ఫైనల్ మ్యాచ్ చూశాను… కప్ గెలిచిన వెంటనే, ఆ ఆఖరి బంతిని తీసుకొని జేబులో దాచుకున్నావు..! ఆ బంతిని ఎందుకు దాచుకున్నావ్? అది దేనికి ప్రతీక?…”
ప్రధాని పరిశీలనకు అవాక్కైన హర్మన్‌ప్రీత్, ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది… “సార్, ఆ బంతి కేవలం క్రికెట్ బంతి కాదు… ఇది మా కల! ఈ విజయం కోసం మేము పడ్డ కష్టం, త్యాగం, కన్నీళ్లు అన్నీ ఆ ఒక్క బంతిలో ఉన్నాయి… ఇది మా జట్టుకు చెందిన చారిత్రక బంతి.., అందుకే దాన్ని నా దగ్గరే ఉంచుకోవాలనిపించింది…”
ఈ సూటి సమాధానానికి ప్రధాని మోదీ హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టాడు… తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఆంధ్రా యువ స్పిన్నర్ శ్రీచరణిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించాడు…
“శ్రీచరణి, మీ బౌలింగ్ అద్భుతం… ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో అంతటి ఒత్తిడి ఉన్నా, నువ్వు చిరునవ్వుతో కనిపించావు… ఫైనల్ మ్యాచ్‌లో ఆ ఒత్తిడిని ఎలా జయించగలిగావు..? మీకేమైనా భయం అనిపించిందా..?”
ఆమె వినయంగా బదులిచ్చింది…: “సార్, నిజం చెప్పాలంటే భయపడ్డాను.. కానీ, మా సీనియర్లు, కెప్టెన్ ‘దేశం కోసం ఆడుతున్నాం’ అని పదే పదే గుర్తు చేశారు… ఆ మాట గుర్తు రాగానే ఒత్తిడి పోయి, గెలవాలనే పట్టుదల పెరిగింది.. నవ్వడం కేవలం ఆత్మవిశ్వాసం కోసమే సార్…”
జెమీమా, నువ్వు జట్టులో ఎప్పుడూ నవ్వులు పంచుతుంటావ్…. రాధాయాదవ్, మూడు మ్యాచులు ఓడినప్పుడు కూడా ఆత్మవిశ్వాసం సడనివ్వలేదు మీరు… దీప్తి శర్మా, నీ భుజంపై హనుమాన్ టాటూ నీ విశ్వాసం, నీ ఆత్మవిశ్వాసానికి ఇది అదనపు బలం… ఇలా ప్రతి ఒక్కరితోనూ హార్ట్ టచ్…
ఓ ఇరవై మందికి పార్టీ ప్రధాని హోదాలో ఇవ్వడం అత్యంత చిన్నవిషయం… కానీ ఒక్కో క్రీడాకారిణిని పలకరించి, వాళ్లకే ప్రత్యేకించే అంశాలను గుర్తుచేస్తూ మాట్లాడటం…. అభినందనల్లోకెల్లా విశిష్ట అభినందన…!!
Share this Article