.
ఏమాటకామాట… బండి సంజయ్ వచ్చేదాకా బీజేపీ ప్రచారంలో ఏమాత్రం జోష్ లేదు… ఎప్పుడైతే తను వచ్చాడో ఒక్కసారిగా జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక మరింత హీటెక్కింది… ఇప్పటిదాకా నడిచిన ప్రచారాంశాలు టర్న్ తీసుకుని, మతం వైపు మళ్లింది ప్రచారం..!
ఇదే తేడా కిషన్ రెడ్డికీ, బండి సంజయ్‌కూ… ఇదే తేడా బండి సంజయ్‌కూ, రామచంద్రరావుకూ..! నిజానికి లోకసభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి మంచి వోట్లే వచ్చినా, అవన్నీ మోడీ మొహం చూసి వేసినవే… లోకసభ ఎన్నికల సరళి వేరు…
Ads
బండి సంజయ్‌ను రాష్ట్ర బీజేపీ నుంచి తప్పించి, కేవలం కేసీయార్ కరుణ కోసమే, తన పట్ల సానుకూలుడు కిషన్ రెడ్డిని మళ్లీ పగ్గాలు ఇచ్చారనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి… ఇప్పుడూ కిషన్ రెడ్డి నిర్లిప్తంగా వ్యవహరించడం (లేట్ ప్లానింగ్, లేట్ ప్రచారం ఎట్సెట్రా) వెనుక కూడా ఇదే బీజేపీ, బీఆర్ఎస్ రహస్య దోస్తీయే కారణమనే విమర్శలూ ఉన్నాయి…
ఎవరూ స్టార్ క్యాంపెయినర్లు లేరు… ఏదో చాపకింద నీరులా కొందరు కార్యకర్తలు శ్రమించడం తప్ప ఇన్నాళ్ల ప్రచారం చప్పగా సాగింది… బోరబండలో ప్రచారానికి అనుమతి ఇవ్వకపోతే, నేనైతే వస్తున్నా, ఏం చేసుకుంటారో చేసుకొండి అని బయల్దేరాడు… తరువాత అనుమతి ఇచ్చారు, అది వేరే సంగతి…
(బండి సంజయ్ ప్రచారంతో నాలుగు వోట్లు బీజేపీకి ఎక్కువ పడితే, అది బీఆర్ఎస్‌కు నష్టం, కాంగ్రెస్‌కు ఫాయిదా… ఇదొక ఈక్వేషన్… ఇన్నాళ్లూ ఎందుకు దూరం ఉంచినట్టు..? బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ వంటి నేతలను..? మిగతా ప్రముఖ నేతలు ఏరి..?)
సరే, ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ ముస్లిం వోట్లపైనే కాన్సంట్రేట్ చేస్తున్నాయి కదా… బండి సంజయ్ తనదైన స్టయిల్‌లో కంట్రాస్టు ప్రచారం స్టార్ట్ చేశాడు… అంటే అదే మతవాదాన్ని, మరింత బలంగా… ఆ రెండు పార్టీలు ముస్లిం వోట్ల మీద శ్రద్ధ చూపిస్తుంటే, పూర్తి భిన్నంగా హిందూ వోటు సంఘటితం కోసం బండి సంజయ్…
కొన్ని వ్యాఖ్యలు చూడండి… ‘‘టోపీ పెట్టుకుని వోట్లడిగే రోజు వస్తే తల నరుక్కుంటా… నేను హిందువును… టోపీ పెట్టి, దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపర్చను..’’ అంతేకాదు… తనకు అప్పట్లో అచ్చొచ్చిన అదే చార్మినార్ భాగ్యలక్ష్మి పాట అందుకుని… ముస్లిం వోట్ల కోసం టోపీలు ధరిస్తున్నారు కదా…
రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఒవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు… మీరు మీ అజహరుద్దీన్ చేత వక్రతుండ అని గణేష్ మంత్రం చదవించే దమ్ముందా? ఒవైసీ సొదరులను భాగ్యలక్ష్మీ టెంపుల్ కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా?’’
దడదడ బండి ఉరుకుతూనే ఉంది… నిన్నటి తాజా పరిణామాలను వెంటనే అందుకున్నాడు… కేటీయార్ పూర్తిగా డిఫెన్స్‌లో పడేలా మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన వ్యాఖ్యలను పట్టుకుని… ‘‘మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణం… గోపీనాథ్ తల్లి చెప్పిన మాట ఇది… రేవంత్ కు దమ్ముంటే….గోపీనాథ్ చావుపై సమగ్ర విచారణ జరిపించాలి’’ అని సానుభూతి వోట్లు బీఆర్ఎస్‌కు పడకుండా బ్రేకులు వేస్తున్నాడు… గండి కొడుతున్నాడు…
బండి సంజయ్ ప్రసంగాల ధాటితో బీఆర్ఎస్ ఇరుకునపడింది… సానుభూతిని నమ్ముకున్న బీఆర్ఎస్‌కు ఇప్పుడు ఈ మత ప్రచారాలను ఎలా కౌంటర్ చేయాలో అర్థం కావడం లేదు… దీనికి తోడు మాగంటి తల్లి వ్యాఖ్యలు మరింత ఇరకాటంలోకి నెట్టేశాయి… అవునూ… ఇన్నిరోజులూ బండి సంజయ్‌ను ప్రచారబరిలోకి ఎందుకు దింపలేదు..? ఏమిటి కారణం..?
Share this Article