.
ఫాఫం… పవన్ కల్యాణ్… ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోెతి ఫస్ట్ పేజీ జాకెట్ యాడ్స్ చూడగానే అనిపించింది అదే… మొన్న ప్రపంచ కప్ గెలిచిన జట్టులో మెంబర్ శ్రీచరణిని అభినందిస్తూ ఆ యాడ్…
అందులో చంద్రబాబు ఉన్నాడు, అందులో లోకేషుడూ ఉన్నాడు… ఎవరో యాడ్ స్పానరర్స్ కూడా ఉన్నారు… కానీ ఫాఫం ఏపీ ఆటల మంత్రి కడప జిల్లాకు చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లేడు… శ్రీచరణి రెడ్డి కూడా కడప జిల్లా అనుకుంటా…
Ads
అంతెందుకు..? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటో కూడా లేదు… ఎవరూ దేకలేదు… మాట్లాడితే ఈసారి ఒలింపిక్స్ అమరావతిలోనే అంటాడు గొప్పల తిప్పల చంద్రబాబు… సరే, తుపాకీ రాముడు అనలేం గానీ… మరీ టీవీ5 సాంబలాగా, మహాన్యూస్ వంశీలాగా… అహో లోకేష్, ఓహో లోకేష్ అనలేం గానీ… మరీ డిప్యూటీ సీఎంను వదిలేసి, ఇంకా ఫాఫం, ఏపీ బీజేపీ వాళ్లనూ వదిలేసి… పూర్తిగా బాబు అండ్ ఫ్యామిలీకే ఈ యాడ్ అంకితం…
సరే, ఏపీ బీజేపీ వాళ్లకు సి-శ- ఏమీ ఉండాలని ఆశించలేం, దశాబ్దాలుగా అది టీడీపికి తోక పార్టీయే… అవును, తోక ముడుచుకుని, కిమ్మనకుండా, నోళ్లు మూసుకుని ఉండే పార్టీ… ఎస్, అలా ఉండబడేయబడిన పార్టీ… కానీ జనసేనకు దేనికి ఇంత దాసోహ వైఖరి..? ఇది టీడీపీ సర్కారా..? కూటమి సర్కారా..? ఏమయ్యా ఓజీ సర్కార్..?!

నేడు… సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి, మిథాలీ రాజ్… స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్.. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో పంచుకున్న శ్రీచరణి… అంతకుముందు గన్నవరం ఎయిర్ పోర్టులో శ్రీచరణికి ఘన స్వాగతం పలికిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు…
శ్రీచరణికి ఏమేం తాయిలాలు ప్రకటించారో ఈ తాజా వార్తలో క్లారిటీ లేదు కానీ… పదవులు ఇచ్చిన వాళ్ళను తప్ప ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసిఏ) పట్టించుకోదా?…
ఇదీ అసలు ప్రశ్న… శ్రీచరణికి స్వాగతం పలుకుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ శుక్రవారం నాడు పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది… ఇందులో ఏసిఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబుల ఫోటోలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఫోటోలు ప్రముఖంగా వేశారు…
అసలు స్పోర్ట్స్ కు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కు ఏంటి సంబంధం…? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ పదవులు కేశినేని శివనాథ్, సానా సతీష్ లకు దక్కటం వెనక నారా లోకేష్ పాత్రే కీలకం కాబట్టి ఈ విధేయత ప్రకటనా..?
కనీసం స్పోర్ట్స్ మినిస్టర్ ఫోటో మచ్చుకు కూడా పెట్టలేదు… గత కొంత కాలంగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా విధిగా పెడుతున్నారు… తన శాఖతో సంబంధం లేకపోయినా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ ను ప్రభుత్వ ప్రకటనల్లో ప్రమోట్ చేస్తూ పోతున్నారు…
అయితే ఇక్కడ విచిత్రంగా సంబంధింత శాఖ మంత్రి ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా విస్మరించటం విశేషం… రాను రాను పవన్ కల్యాణ్‌ను ఇగ్నోర్ చేస్తున్నారని చెప్పడానికి శ్రీచరణియే సాక్ష్యం..!!
Share this Article