Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరంజీవ..! ఆహా… ఎంత నాసిరకం సినిమా సమర్పించావు అభీ..!!

November 8, 2025 by M S R

.

థాంక్ గాడ్… చిరంజీవ అని మాత్రమే పెట్టుకున్నారు సినిమా పేరు… లేకపోతే చిరంజీవి అని పెట్టుకుంటే కేసుల పాలయ్యేవాళ్లు… సజ్జనార్ సర్, వాళ్ల సినిమాలో చిరంజీవి అని లేదు, అందుకని ది గ్రేట్ పద్మవిభూషణుడికి వీసమెత్తు ప్రతిష్ఠాభంగం లేదు, కాబట్టి కన్నెర్ర చేయకండి ప్లీజ్…

మా ఖర్మ…. అన్నయ్య అని పిలవలేం, చిరంజీవీ సుఖీభవ అని ఆశీర్వదించలేం… సరే, మెగాస్టార్ వదిలేయండి… తనను నమ్మిన 85 లక్షల మందిని నిండా ముంచి, పార్టీని కాంగ్రెస్‌లో ప్రజారాజ్యాన్ని నిమజ్జనం చేసినప్పుడే వదిలేశాం…

Ads

ఈ తెలుగు పదాల మీద పేటెంట్ రైట్స్ ఎవరికి..? శతాబ్దాలుగా తెలుగుతనంలో ఒదిగిన పదాలకూ చిరంజీవికి రైట్స్ ఏమిటి..? పెద్ద పెద్ద భాషావేత్తలే మూసుకుని కూర్చున్నారు మాకేమిటి లెండి…… సరే, ఈ చిరంజీవ అనే సినిమాకు వద్దాం…

ఒకప్పుడు బడ్డింగ్ హీరో రాజ్‌తరుణ్… తరువాత నానా వివాదాలూ, మన్నూమశానాలు, చెత్త ఎంపికలతో భ్రష్టుపట్టాడు… ఇప్పుడు ఈ డైరెక్ట్ ఓటీటీ సినిమాతో వచ్చాడు… ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి…

ఒక జబర్దస్త్ కమెడియన్ బలగం వేణు ఒక్కడే సూపర్ హిట్… ఎక్కడా జబర్దస్త్ దుర్వాసన లేకుండా జాగ్రత్తపడ్డాడు కాబట్టి..! కానీ అదిరె అభి అనే తెర పేరున్న జబర్దస్త్ కమెడియన్ అభినయ హరికృష్ణ తీసిన సినిమా ఇది… కానీ ఓ భిన్నమైన బలగం బాపతు సినిమా తీయలేక, రొటీన్ ఓ బేకార్ ఫాంటసీ కామెడీ తీసి ఉసూరుమనిపించాడు…

ముందుగా ఆ జబర్దస్త్ మైండ్ సెట్ నుంచి బయటికి రాలేని తనం… ఓ అంబులెన్స్ డ్రైవర్… ఇతరుల ఆయుష్షు ఎంతో తెలిసే వారం ఉందట తనకు… ఇక అక్కడి నుంచీ ఓ కథ… ప్రధానంగా కామెడీ… కానీ ఫాంటసీ సినిమాకు అది మాత్రమే చెల్లదు…

  • శివ (రాజ్ తరుణ్) అనే అంబులెన్స్ డ్రైవర్‌కు స్పీడ్ అంటే ఇష్టం… పుట్టుకతో మహార్జాతకుడు అయినప్పటికీ, అతనికి దేవుడంటే నమ్మకం తక్కువ…
  • ఒక రాత్రి, అతివేగంతో వెళ్తున్న శివ అంబులెన్స్ యముడి వాహనమైన దున్నపోతును ఢీకొడుతుంది… ఈ ప్రమాదం కారణంగా అతను ఆసుపత్రి పాలవుతాడు…
  • ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, శివకు ఒక అద్భుతమైన శక్తి వస్తుంది…: ప్రతి వ్యక్తి తలపై వారి మిగిలిన ఆయుష్షును సూచించే కాంతివంతమైన టైమర్ కనిపిస్తుంది…
  • ఈ జ్ఞానంతో, శివ మొదట్లో దానిని డబ్బు కోసం ఉపయోగించుకుంటాడు, కానీ త్వరలోనే నైతిక సందిగ్ధతను ఎదుర్కొంటాడు…
  • ఒక సంఘటనలో పిల్లల ప్రాణాలను కాపాడటానికి అతను ఈ శక్తులను ఎలా ఉపయోగించాడు, అలాగే రౌడీ సత్తు పహిల్వాన్ (రాజా రవీంద్ర)తో అతని వైరం ఎలా ముగిసింది అనేది మిగతా కథాంశం…

యమలోకపు ప్రస్తావన… కానీ ఆ విజువల్స్, ఆ చిత్రణలోకి వెళ్లలేదు అభి… సంతోషం, బతికించావు బ్రదర్… లేకపోతే ఇంకా బుక్కయ్యేవాళ్లం… కనీసం బలగం సినిమా చూసైనా నేర్చుకోకపోతివి హైపర్ ఆది గురువా… ఆ కథ రాసినవాళ్లెవరో గానీ… యముడు కేవలం ఎగ్జిక్యూటర్ మాత్రమే, తనకు చావుపుట్టుకలతో సంబంధం లేదు… ఫాఫం అభి…

ఎక్కడా వీసమెత్తు ఎమోషన్ పలికించలేకపోవడంతో సినిమా తుస్సుమనిపోయింది… జబర్దస్త్ స్కిట్ వేరు, ఆఫ్టరాల్ ఓ చెత్తా కామెడీ 10 నిమిషాలలోపు… అదీ ఈటీవీ చెత్తా టేస్టుకు సరిపడా… కానీ విస్తృతంగా జనబాహుళ్యంలోకి ఓ సినిమాతో వస్తున్నప్పుడు ఆ జబర్దస్త్ పోకడలు చెల్లవు…. అది అభి గమనించలేక పోవడమే ఈ సినిమా మైనస్…

మొన్నెక్కడో చూశాం… దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతున్నాడు… సినిమా కెరీర్ మొదట్లో అభి, తను కలిసి జర్నీ స్టార్ట్ చేశారట… అది చూశాక ఈ సినిమా మీద కాస్త ఆసక్తి పెరిగింది.., కానీ ఆహా బాపతు కంటెంట్ అంటేనే, ఇది థియేటర్లలోకి రాలేదు అంటేనే అర్థమైంది… కానీ మరీ ఇంత అనాసక్త చిత్రం అనిపించలేదు అప్పుడు… ఫాఫం అభి..!!

 

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చిరంజీవ..! ఆహా… ఎంత నాసిరకం సినిమా సమర్పించావు అభీ..!!
  • గోపీనాథ్ మరణ మిస్టరీ ఏమిటి..? కేటీయార్ మౌనం వెనుక మర్మమేంటి..!!
  • దీనక్క… ఏం రాశాడు గురూ సినిమా మాండలికంలో… బాగా ప్రాసపడుతూ…
  • నేతల సొంత కంచాల కథలేమిటి..? చానెల్‌లో పర్సనల్ కేసు లొల్లేమిటి..?
  • అంబానీలు, ఆదానీలకన్నా… శివ నాడార్ శిఖర సమానుడు… ఎలాగంటే..?!
  • బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది… టెండర్ల రద్దు అసలు కథ వేరు…
  • …. అలాంటి నాగార్జున సడెన్‌గా యాక్షన్ హీరో అనేసరికి మేమంతా షాక్’’
  • సాయి అభ్యంకర్..! మూడేళ్లలోనే ఎగిసిన స్వరకెరటం… భారీ డిమాండ్..!!
  • చక్దా ఎక్స్‌ప్రెస్..! ఈ ప్రపంచకప్ విజయ నిర్మాణంలో ఒక పునాది శిల..!!
  • సుమలత, ఊర్వశి… నాలుగు భాషల్లోనూ వాళ్లే… దర్శకుడూ ఒకడే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions