.
నిన్న మనం ఓ కథనం చదివాం కదా… సంపాదనలో సమాజానికి కొంతైనా తిరిగి ఇచ్చే సామాజిక బాధ్యతలో, దాతృత్వంలో ఒక శివ నాడార్‌తో పోలిస్తే …. అత్యధిక సంపన్నుడు అయి ఉండీ ముఖేష్ అంబానీ ఎంత దూరంలో ఉన్నాడో చెప్పుకున్నాం కదా…
పోనీలే, కనీసం పుణ్యం కోసమో, పాపభీతి కోసమో… ఓ మంచి పని ప్రకటించాడు… బహుశా అదీ కార్పొరేట్ సామాాజిక బాధ్యత కింద చూపిస్తాడో ఏమో తెలియదు గానీ… తను తిరుమలను సందర్శించాడు… తరువాత 2 లక్షల మందికి రోజూ వండి పెట్టగల అత్యంత ఆధునిక వంటశాల నిర్మాణానికి సహకరిస్తానని ప్రకటించాడు…
Ads
రోజూ సగటున 70 నుంచి 80 వేల మంది వస్తున్నారు తిరుమలకు… ఉత్సవాల రోజుల్లో ఇది మరీ ఎక్కువ… అందులో అందరూ అన్నప్రసాదం తీసుకుంటారని చెప్పలేం, సగటున రోజుకు ఎందరు అన్నదానం స్వీకరిస్తున్నారనే లెక్కల్ని పెద్దగా టీటీడీ వెల్లడించినట్టు గుర్తు లేదు… కాకపోతే మెజారిటీ భక్తులు, అత్యంత ధనిక భక్తులు కూడా అన్నదానాన్ని కూడా ఓ ప్రసాదంలా భావించి, తప్పకుండా స్వీకరించడానికి ఇష్టం చూపిస్తారు…
ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రకటించిన అత్యాధునిక ఆటోమేటెడ్ వంటశాల రోజూ 2 లక్షల మందికి వంట చేసి వడ్డించగలదు… అదీ పౌష్టిక విలువలతో… అఫ్‌కోర్స్, టీటీడీ అందించే సరుకులను బట్టి, వాటి నాణ్యతను బట్టి పౌష్టిక విలువలు ఆధారపడి ఉంటాయి…
మనుషుల అవసరాన్ని, శ్రమను తగ్గించడానికి ఈ కిచెన్ కొత్త టెక్నాలజీ సాయపడుతుంది… హైజీన్ విషయంలో భక్తుల అపోహల్ని తొలగిస్తుంది… మంచి నిర్ణయమే… తన పుణ్యం కోసమే అయినా సరే సగటు భక్తుడికి ఉపయోగకరమే… (ఈమాత్రం ఖర్చు టీటీడీ భరించలేదా అనడక్కండి… వీలైనంతవరకూ టీటీడీ అన్ని విషయాల్లోనూ విరాళాల కోసం ప్రయత్నిస్తుంది…)
ఐతే ఈ మోడరన్ కిచెన్ కోసం ఎంత ఖర్చవుతుంది, ఇతర వివరాలేమిటో అంబానీ టీమ్ చెప్పలేదు, టీటీడీ చెప్పలేదు… మరో విశేషం ఏమిటంటే… టీటీడీ దేవాలయాలు అన్నింట్లోనూ అన్నదానం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పాడు కదా… ఆ దేవాలయాలన్నింటికీ ముఖేష్ అంబానీ అన్నదానం విషయంలో సాయం చేస్తానని ప్రకటించాడు… ఆ వివరాలు కూడా వెల్లడించలేదు, సూత్రప్రాయ ప్రకటన…
ఇది వెంకటేశ్వర స్వామికి సేవ చేయడం, తిరుమల దైవిక లక్ష్యంలో ఒక చిన్న భాగం – ఏ భక్తుడు కూడా ఆకలితో ఉండకూడదని…” అని అంబానీ టీమ్ ప్రకటన చెబుతోంది… తిరుమల తరువాత కేరళలోని గురువాయూర్ టెంపుల్ వెళ్లాడు… అక్కడ 15 కోట్లతో ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రకటించాడు…!!
Share this Article